Best protein Food to eat for your hair in telugu
ఊడిన జుట్టు మరల రావాలంటే?
జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా బలంగా ఉంటే జుట్టు సాధారణంగా ఊడిపోకుండా ఉంటుంది. ఒక వేళ జుట్టు ఊడిపోతూ ఉంటే కొత్త వెంట్రుకలు పుట్టించే సామర్థ్యం జుట్టు కుదుళ్లకు ఉంటుంది. జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటే ఊడిన జుట్టు స్థానంలో మరలా కొత్త జుట్టు ఉత్పత్తి అవుతుంది.
అందుకోసం జుట్టు కుదుళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి అవసరమైన పోషకాలు సరఫరా కోసం రక్తప్రసరణ బాగా ఉండాలి. రక్త ప్రసరణ బాగా ఉండాలి అంటే రక్తం బలంగా ఉంటూ హిమోగ్లోబిన్ అధికంగా ఉండాలి. అందుకే బ్లడ్ సప్లై సరిగ్గా ఉంటే జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు కుదుళ్ల ఆరోగ్యానికి ప్రోటీన్ ఎక్కువగా అవసరం. ఐరన్, మినరల్స్ మరియు విటమిన్ – డి లాంటి పోషకాలన్నీ అవసరం.
జుట్టు కుదుళ్ల ఆరోగ్యానికి ఒక కూర అవసరమవుతుంది. దీనికోసం మార్కెట్లో దొరికే తోటకూర, పాలకూర, బచ్చలకూర, మరియు గోంగూర కానీ తీసుకుని వండుకుని తినాలి. ఈ కూరల్లో జుట్టు కుదుళ్లకు అవసరమైన ఐరన్ తో పాటు మినరల్స్ అధిక శాతంలో ఉంటాయి. కాబట్టి వీటిలో ఏదో ఒక రకం కూర ప్రతిరోజు వండుకొని తినే విధంగా అలవాటు చేసుకోవాలి.
దీనివల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరిగి, జుట్టు ఆరోగ్యంగా తయారయ్యి ఊడిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావడం మొదలవుతుంది. సాధారణంగా పప్పు వండడానికి కందిపప్పు పెసరపప్పు వీటితో పాటు ఏదైనా ఇతర పప్పుదినుసులు కూడా వాడి పప్పు కూర తయారు చేసుకోవాలి.
ప్రధానంగా సోయా చిక్కుడు గింజలు మరియు పుచ్చ గింజలు ఉపయోగించినట్లయితే ఇందులో నుండి హై ప్రోటీన్ లభిస్తుంది. బఠాణీలను కూడా నానబెట్టి పప్పు కూరలో ఉపయోగించడం చాలా ఉపయోగకరం. జుట్టు పెరుగుదలకు అవసరం అయ్యే విటమిన్ కె పుష్కలంగా ఆకుకూరలు నుండి లభిస్తుంది.
కాబట్టి జుట్టు బాగా ఉత్పత్తి అయ్యి బలంగా తయారవుతుంది. ఈ విధంగా ఆకుపచ్చని ఆకు కూరలను ఎక్కువ మోతాదులో ఆహారంలో భాగంగా తీసుకుంటే ఊడిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు తప్పకుండా మొలకెత్తుతుంది.
ఇది కూడా చదవండి :- ఇలాంటి వారికి నిద్ర లోనే ప్రాణం పోతుంది
జుట్టు పెరగడానికి పోషకాలు
ప్రధానంగా స్త్రీలలో జుట్టు ఊడిపోవడానికి కారణం రక్తహీనత. అందుకే ఈ రక్తహీనత నుంచి బయట పడడానికి ఆకుకూరలు మరియు గింజధాన్యాలు రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.
కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఆకుకూరలు, గింజ ధాన్యాలు అందుబాటులో లేనప్పుడు మీల్ మేకర్ తో కూడా కూర వండుకుని తినడం జుట్టుకు చాలా మంచిది.
రక్తహీనత తొలగిపోయి దాదాపు 12 – 13 గ్రాముల హిమోగ్లోబిన్ పెరుగుదల శాతం చూపిస్తుంది. ఇటీవల కాలంలో పిల్లలు మరియు స్త్రీలు దుంపలు సలాడ్ లు వంటివి ఇష్టంగా తింటారు కానీ ఆకుకూరలు సరిగా వండుకుని తినరు. అందుకే ఆకుకూరలు స్థానంలో రాజ్మా లేదా సోయా గింజలు వంటివి కూరల్లో నానబెట్టి గాని కుక్కర్ లో ఉడికించి గాని కూరల్లో వేసుకొని తినాలి. దీనివల్ల కూర రుచి గాను మరియు ప్రోటీనులు తోనో లభిస్తుంది.
మంచి ఆహారంతో పాటు జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే తలస్నానం కూడా చాలా ముఖ్యం. వారంలో మీకు వీలైనన్ని సార్లు తలస్నానం చేయడానికి ప్రాముఖ్యతను ఇవ్వండి. ఐదు పది నిమిషాల తలస్నానం వల్ల జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా తయారై జుట్టు ఉత్పత్తి మొదలవుతుంది. తల స్నానం వల్ల జుట్టంతా రక్తప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తలస్నానం కూడా ప్రధాన కారణమని గ్రహించండి.
ఇది కూడా చదవండి :- పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు ని కాకరకాయతో ఇలా కరిగించండి