ఈ ఒక్క ఆకుతో కీళ్ల నొప్పులు,ఒబెసిటీ,గుండెవ్యాధులు,షుగర్,గ్యాస్ పూర్తిగా మాయం

0
Betel leaf uses in telugu 2021
Betel leaf uses in telugu 2021

Betel leaf uses in telugu for skin, diabetes, cough, hair & Heart : ఒకే ఒక్క ఈ ఆకును ఉపయోగించడం వల్ల ఒళ్ళు నొప్పులు, అలసట, నీరసం, తలనొప్పి, మైగ్రేన్, ఒబేసిటీ, గుండె సమస్యలు, షుగరు మరియు గ్యాస్ ట్రబుల్ వంటి అనేక రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది.

ప్రధానంగా నేటి కాలంలో చిన్న వయసు వారి నుండి ముసలి వయసు వారి వరకు ఎముకల బలం తగ్గిపోయి, కాల్షియం లోపం వల్ల పెళుసు బారి పోతున్నాయి. ఈ సమస్యల నుండి బయట పడడానికి మీరు ఉపయోగించవలసిన ఒకే ఒక్క ఆకు “తమలపాకు” ( Betel leaf ).

ఈ తమలపాకును వ్యాధులను నివారించడానికి బంగారంతో సమానమైనది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ తమలపాకులో అనేక రకాల ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

ఈ తమలపాకును సరైన పద్ధతిలో ఉపయోగించడం అలవాటు చేసుకుంటే, మన శరీరంలో ఉండే అనేక రకాల వ్యాధులు తొలగిపోతాయి. ముఖ్యంగా మీ శరీరం యొక్క రోగనిరోధక శక్తి రెండింతలు పెరుగుతుంది.

ఎనర్జీ డ్రింక్

మీరు తరచుగా నీరసం, అలసట, మైగ్రేన్ నొప్పి మరియు తలనొప్పితో బాధపడుతున్నారా?
అయితే తమలపాకు తో తయారు చేసే ఈ ఎనర్జీ డ్రింక్ ను తయారు చేసుకుని తాగండి.

ఇందు కోసం మొదటిగా ఒక పాత్రలో రెండు గ్లాసుల నీళ్లు పోసి, రెండు లేదా మూడు తమలపాకులు తీసుకుని వాటిని ముక్కలుగా చేసి బాగా మరిగించాలి. ఇలా మరిగించడం వల్ల తమలపాకు లో ఉన్న ఔషధ గుణాలు అన్నీ కూడా ఈ నీటిలో కరుగుతాయి.

ఈ నీటిని ఒక గ్లాసు నీరు మిగిలేలా బాగా మరిగించాలి. చివరగా మిగిలిన ఆ ఒక గ్లాసు నీటిని వేడి గా ఉన్నప్పుడే తాగాలి. అనేక సమస్యలతో బాధపడేవారు ఈ నీటిని తాగిన వెంటనే వారిలో మార్పు అనేది కనిపిస్తుంది.

కొంతమంది కీళ్ళు, కాళ్ళు నొప్పులు సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి తమలపాకులు గొప్ప ఔషధంగా పనిచేస్తాయి. ఒక తమలపాకు ను తీసుకొని, అందులోకి గోధుమ గింజ అంత సున్నం వేసుకుని రెండు కలిపి బాగా నమిలి తినాలి.

ఇలా చేయడం వల్ల మన శరీరానికి కావల్సిన కాల్షియం లభిస్తుంది. దీని వల్ల మీ ఎముకలు బలంగా, దృఢంగా తయారవుతాయి. ఒకవేళ తమలపాకులు నమలడం మీకు అలవాటు లేకపోతే తమలపాకు రసంలోకి సున్నం వేసుకుని తాగితే, తప్పకుండా మీ అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.

అంతేకాకుండా మీ రోగనిరోధక శక్తి పెరిగి మిమ్మల్ని తరచుగా బాధపెట్టే జలుబు, దగ్గు, జ్వరం మరియు తలనొప్పి సమస్యలు తొలగిపోతాయి.

ఒబేసిటీ కోసం

నేటి రోజుల్లో చాలామంది బాధపడుతున్న సమస్య స్థూలకాయం సమస్య. దీనికోసం మీరు ఒక తమలపాకు తీసుకుని అందులో కి నాలుగు నల్లమిరియాలు కలుపుకొని తింటే మీ శరీర బరువును ఆరోగ్యకరంగా తగ్గిస్తుంది.

అజీర్ణ సమస్య

అజీర్ణ సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు భోజనం తిన్న తర్వాత ఒక తమలపాకు నమిలి తింటే చాలా ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉండవు. కాబట్టి ప్రతి రోజూ తమలపాకును క్రమం తప్పకుండా తీసుకుంటే గ్యాస్ సమస్యలతో పాటు సుగర్ సమస్యలు కూడా తగ్గుతాయి.

గుండె సమస్యలు – కొలెస్ట్రాల్ సమస్యలు

తమలపాకు కషాయం తాగడం వల్ల మీ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రధానంగా మీ శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.

ఎందుకంటే ముఖ్యంగా తమలపాకు కషాయం వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ శుద్ధి చేయబడుతుంది. కాబట్టి ప్రతి రోజు క్రమం తప్పకుండా ఈ తమలపాకు కషాయాన్ని తాగడం అలవాటు చేసుకోవాలి.

తమలపాకు కషాయం లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు మరియు అల్లం ముక్కలు వేసుకుని కషాయం తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతోనే తాగాలి.

ఒకవేళ కషాయం తాగడానికి మీకు ఇబ్బందిగా ఉంటే, తమలపాకు లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు మరియు అల్లం ముక్కలు వేసుకుని ప్రతి రోజూ ఉదయం పరగడుపున బాగా నమిలి తినాలి.

దీనివల్ల ఇందులో ఉండే రసాయనాలు మీ జీర్ణ వ్యవస్థ లోని కి వెళ్లి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీని వల్ల బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్ అవుతుంది. రకరకాల జబ్బులతో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయం మధ్యాహ్నం రాత్రి భోజనం తర్వాత ఒక తమలపాకు తినడం వారి ఆరోగ్యానికి మంచిదే.

ఇవి కూడా చదవండి :-

  1. ఇలా చేస్తే పుచ్చి పోయిన పళ్ళ నుండి పురుగులు వెంటనే పోతాయి
  2. ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి
  3. ఇలాంటి వారికి నిద్ర లోనే ప్రాణం పోతుంది
  4. ఈ రసం తాగితే 50 రకాల జబ్బులు మీ దరి చేరవు
  5. ఒక్క నిమిషంలో మీ దురదను ఇలా పోగొట్టండి !