భీమ్లా నాయక్ పాట పాడిన కిన్నెర కళాకారుడు ఎవరో మీకు తెలుసా ?

0
mogulaiah history
bheemla nayak title song singer mogulaiah history

ఇప్పుడు ఎక్కడ చూసినా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ గురించే చర్చ జరుగుతోంది. అందుకు కారణం, పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా కిన్నెర సంగీత కళాకారుడి చేత ఒక పాట పాడించడం. ఆయన పేరు మొగులయ్య.

మొగులయ్య జన్మస్థలం నాగర్ కర్నూలు జిల్లా లింగ మండలంలోని అసలికుంట. ఈయన కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ అందరి చేత ప్రశంసలు పొందిన గొప్ప తెలంగాణ జానపద కళాకారుడు. మొగులయ్య తన పాటలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకుగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈయనను ప్రత్యేకంగా సత్కరించడం కూడా జరిగింది.

మరి ఇప్పుడు భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మంచి పాట పాడి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఈ పాటలో మొగులయ్య కిన్నెర వాయిద్యం వాయిస్తూ భీమానాయక్ పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ వీడియోలో కనపడతారు.

మొగులయ్య తన తండ్రి ఎల్లయ్య నుండి వారసత్వంగా వచ్చిన ఏడు మెట్ల కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ పాటలు పాడుతూ ఉంటారు. అంతరించిపోతున్న కిన్నెర సంగీత కళని ఇప్పటికీ కొనసాగిస్తున్న మొగులయ్యను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఉగాది పురస్కారంతో సత్కరించింది. అంతేకాకుండా సోషల్ సబ్జెక్టు లో ఎనిమిదో తరగతిలో మొగులయ్య జీవిత చరిత్రను కూడా ప్రవేశపెట్టడం జరిగింది.

మరి ఇంతలా పాపులారిటీ సంపాదించుకున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు మొగులయ్యను పిలిచి మరి భిమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ఆడే అవకాశం కల్పించారు. చెన్నైకి సమీపాన ఉన్న తమిళనాడు అడవులలో ఈ పాటను చిత్రీకరించారు. మొగులయ్య ఎక్కువగా పాడిన ‘ పొంగల్ మియాసాబ్ ‘ పాటను అనుకరిస్తూ భీమ్లా నాయక్ పాట సాగుతుంది.

ఈ పాట పాడిన అందుకుగాను అలాగే తనకు అవకాశం ఇచ్చి ఇంత గొప్పగా ప్రోత్సహించినందుకు గాను పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మొగులయ్య కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి :- మనసున్న రాజకుమారి వింత ప్రేమ ..!