ఒక్కరోజులో 10 వేల కరోన కేసులు – 130 మరణాలు

0

ప్రపంచ పోలీస్ రాజ్యం గా పేరుపొందిన అమెరికాను అతి చిన్న కరోనా వైరస్ గడగడలాడిస్తూ వస్తున్నది. అమెరికా మొత్తం మీద నిన్న ఒక్కరోజే దాదాపు పదివేల పాజిటివ్ కేసులు లెక్క తేలాయి. దాదాపు 130 మంది వరకు మరణించారు. ఇందులో మరణించిన 43 మంది వ్యక్తులు న్యూయార్క్ నగరానికి చెందిన వారు. ప్రస్తుతం అమెరికాలో ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా ఉన్నట్లు తేలింది దీన్ని బట్టి చూస్తే కరోనా వైరస్ వ్యాప్తి లో అమెరికా దేశం యూరప్ దేశాన్ని దాటవేసింది అని అర్థమవుతుంది.

నిన్నటికి ప్రపంచవ్యాప్తంగా 18,299 మంది కరోనా దెబ్బకు చనిపోయారని (WHO) ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది.

ప్రపంచ దేశాలుమరణాలు
ఇటలీ6820
స్పెయిన్ 2800
ఇరాన్1934
ఫ్రాన్స్1100 (నలుగురు డాక్టర్లు)
చైనా3277

పై మరణాలు అన్నీ కేవలం ఒక్క మంగళవారం రోజు జరిగినవే ! చైనాలోని కొన్ని ప్రాంతాల్లో గత మూడు నెలలుగా ఉన్న లాక్ డౌన్ ఆంక్షలు నిన్న ఎత్తివేయడం జరిగింది. ప్రస్తుతం చైనాలో తగ్గుముఖం పట్టడం వల్ల, వైరస్ వ్యాప్తి చేయించిందని చెడ్డ పేరు తో బాధ పడుతున్న చైనా ఆ చెడ్డ పేరు పోగొట్టుకోవడానికి ఇరుగు పొరుగు దేశాలకు అవసరమైన వైద్య పరికరాలను పంపిస్తున్నది.

పాకిస్థాన్ దేశంలో కరోనా కేసులు 960 దాటడంతో రైళ్లను రద్దు చేయడం జరిగింది. కరోనా సోకిన వ్యక్తి తో సెల్ఫీ తీయించుకున్న ఆరుగురు ప్రభుత్వ ఉన్నతాధికారులను వారి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయించింది. ఫిన్లాండ్ దేశ మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మార్టి అహ్టిసారి కరోనా వ్యాప్తికి గురి అయ్యాడు. యూకె, ఫిలిప్పీన్స్ థాయిలాండ్ , దక్షిణాఫ్రికా మొదలైన దేశాలు రేపటి నుంచి లాక్ డౌన్ ను అమలులోకి తీసుకు రానున్నాయి.

ఆదరణ లేని తల్లిదండ్రులు:-

స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నగరంలో ఎంతో మంది వృద్ధులు కరోనా కు గురి అయి పట్టించుకునే నాధుడు లేక కృశించి పోయి చనిపోవడం జరిగింది. కనీసం దహన సంస్కారాలు కూడా లేవు. ఎవరూ పట్టించుకునే వారు లేరు. చూడటానికి ఇక్కడ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి.
స్పెయిన్లో వ్యాధికి గురైన వృద్ధులను ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచి మిలిటరీ వారు, వారి రక్షణను చేపట్టారు.

అయితే మిలిటరీ వాళ్లు సైతం చేతులు ఎత్తివేయడం జరిగింది. ఎంతో మంది చనిపోవడం జరిగింది. పదుల సంఖ్యలో వృద్ధులు మంచాల మీద ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది కొన ప్రాణాలతో కొట్టుకుంటున్నారు. స్పెయిన్ ప్రభుత్వం వృద్ధులను నిర్లక్ష్యంగా వదిలేసిన వారి మీద చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

తెలుగు వారికోసం తెలుగు న్యూస్ పోర్టల్ వెబ్ సైట్ వారు ప్రతిక్షణం కరోనా న్యూస్ ను తెలియజేయడానికి మీ ముందుకు వస్తుంది.