butta bomma song lyrics – తెలుగులో లిరిక్స్ – ala vaikunthapurramuloo songs

0

అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ మూవీ ‘ ala vaikunthapurramuloo ’ నుండి butta bomma song ని ఈరోజు youtube లో రిలీజ్త చేశారు. పాట ఇలా onlineలోకి రాగానే అల సెన్సేషన్ అయ్యింది. ట్యూన్ అద్దిరిపోయింది.  SS Thaman సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. అచ్చ తెలుగు సాహిత్యంలో సాగే ఈ butta bomma song lyrics ని పాట వింటూ ఎంజాయ్ చేయండి.

butta bomma song lyrics in Telugu :

ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము
ఈ లవ్వనేది బబులు గమ్ము, అంటుకున్నాదంటే పోదు నమ్ము

ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము,ప్రేమనాపలేవు నన్ను నమ్ము
ఎట్టాగా అనే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే
అరి దేవుడా ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే 

బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే

మల్టీప్లెక్సులోని ఆడియన్సులాగా మౌనంగున్నాగానీ అమ్ము
లోన దండనక జరిగిందే నమ్ము,దిమ్మ తిరిగినాదే మైండు సిమ్ము
రాజుల కాలం కాదు, రథము గుర్రం లేవు
అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే
గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు
చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే

చిన్నగా చినుకు తుంపరడిగితే
కుండపోతగా తుఫాను తెస్తివే
మాటగా ఓ మల్లెపూవునడిగితే
మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే,
జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే
వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టూకుంటివే
కాలికింది పువ్వు నేను నెత్తినెట్టూకుంటివే

ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము
ఈ లవ్వనేది బబులు గమ్ము, అంటుకున్నాదంటే పోదు నమ్ము
ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము,ప్రేమనాపలేవు నన్ను నమ్ము