కాల్పోల్ 500 mg టాబ్లెట్స్ ఎలా ఉపయోగించాలి ? మోతాదు ఏంటి ?

0
కాల్పోల్ టాబ్లెట్ ఉపయోగాలు
కాల్పోల్ టాబ్లెట్ ఉపయోగాలు

Calpol 500 Uses In Telugu  | కాల్పోల్ టాబ్లెట్స్:  Calpol 500 MG Tablet సాధారణంగా జ్వరాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది కీళ్ళ నొప్పి, తల నొప్పి వంటి విషయంలో నొప్పి తగ్గించడానికి ఉపయోగిస్తారు.

ఇది తరుచు కాన్సర్ తో భాదపడుతున్న వారికీ మరియు శస్త్ర చికిత్స చేయించుకొన్న రోగులకు ఉపయోగపడుతుంది. ఈ ఔషదం గర్భాదరణ సమయంలో మరియు తల్లి పాలు ఇస్తున్న సమయంలో ఉపయోగించడం సురక్షితం.

కాల్పోల్ 500 ఎంజి టాబ్లెట్ (Calpol 500 MG Tablet) పెద్దవారికి జ్వరం మరియు నొప్పి కోసం సాధారణ మోతాదు 325-650 ఎంజి. ప్రతి 4 నుండి 6 గంటలకు లేదా ప్రతి 6 నుండి 8 గంటలలో ఒకసారి 1000ఎంజి మాత్రలు వాడాలి.

సైడ్ ఎఫెక్ట్స్ అఫ్ కాల్పోల్ టాబ్లెట్స్ :

 • ఇవి వాడేటపుడు కొన్ని సందర్భాలలో చర్మం దద్దుర్లు రావడం,కడుపులో వికారం, కడుపు నొప్పి మరియు ఆకలిని కోల్పోవచ్చు.
 • మీకు ఒకవేళ ముదురు రంగు మూత్రం రావడం, బంక మట్టి రంగు మలము రావడం లేదా కామెర్లు వంటి ఏవైనా తీవ్రమైన లక్షణాలను గమనిస్తే మీరు కాల్పోల్ 500 ఎంజి టాబ్లెట్ (Calpol 500 MG Tablet) ని ఉపయోగించడం తీసుకోక పోవడం మంచిది.
 • అదిక మోతాదులో ఈ టాబ్లెట్ గనుక వాడితే, కాలేయం వైఫల్యం అవుతుంది.

కాల్పోల్ టాబ్లెట్స్ మరికొన్ని ఉపయోగాలు :-

 • జ్వరం – కాల్పోల్ 500 ఎంజి టాబ్లెట్ (Calpol 500 MG Tablet)  జ్వరంను తగ్గించడానికి ఉపయోగిస్తారు.
 • తల నొప్పి – కొన్ని సమయాలలో మైగ్రిన్ తలనొప్పి వచ్చినపుడు ఉపయోగిస్తారు.
 • కండరాల నొప్పి– కాల్పోల్ టాబ్లెట్స్ కండరాల నొప్పికి ఉపయోగిస్తారు.
 • Osteoarthritis ( ఆస్తియొఆర్థరైతిస్ ) – ఆస్టియోఆర్థరైటిస్ వల్ల కలిగే కీళ్ల నొప్పిని తగ్గించడానికి కూడా కాల్పాల్ టాబ్లెట్ ను సిఫార్సు చేస్తారు.
 • నెలసరి సమయం – (Menstrual Cramps) ఋతుస్రావంతో బాధపడుతున్న నొప్పిని తగ్గించడానికి కాల్పోల్ 500 ఎంజి టాబ్లెట్ (Calpol 500 MG Tablet) ను ఉపయోగిస్తారు.

కాల్పోల్ టాబ్లెట్స్ జాగ్రత్తలు:-

 • కాల్పాల్ టాబ్లెట్ వాడే ముందు మీరు ఏదైనా ఇతర మెడిసిన్, విటమిన్ లేదా హెర్బల్ సప్లిమెంట్లు ఏమైనా వాడుతున్నట్లయితే మీ డాక్టర్కు తెలియజేయాలి.
 • కంటి చూపులో మార్పు, చెవిలో శబ్ధాలు వంటి మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలవాలి.
 • టాబ్లెట్స్ పట్ల అలర్జీ ఉన్నవారు వాడకూడదు.
 • రోజు మద్యపానం అలవాటు ఉన్నవారు ఈ మెడిసిన్ వాడకపోవడం ఉత్తమం.
 • తప్పనిసరి అయితే తప్ప గర్భిణి స్త్రీలకు ఈ Calpol tablet సిఫార్సు చేయబడదు. వీరు ఈ మందు వాడడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది.
 • గర్భంలోని శిశువుకు హాని కలుగవచ్చు అనే ఋజువులేమీ లేవు కానీ, వాడే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.

కాల్పాల్ టాబ్లెట్ కు ప్రత్యామ్నాయ టాబ్లెట్స్ – Substitutes for Calpol tablet:

క్రింద పేర్కొన్న కొన్ని టాబ్లెట్లలో Calpol టాబ్లెట్లతో సరిసమానమైన, కాంబినేషన్, డోస్, మరియు సామర్ధ్యం ఉంటుంది. కనుక వీటిని డోలో టాబ్లెట్లకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు.

 • Cipmol 500 MG Tablet
 • Dimace P 500 MG Tablet
 • Lupipara 500 MG Tablet
 • Malidens 500 MG Tablet
 • Paracad 500 MG Tablet

గమనిక : ఈ టాబ్లెట్స్ ని ఉపయోగించే ముందే మీరు వైదుడిని సంప్రదించండి.