చంద్ర గ్రహణం – chandra grahan 2020 in telugu – ఈ జాగ్రత్తలు పాటించండి

0

chandra grahan 2020 dates and time in india

జనవరి 10వ తేదీ మరియు పదకొండవ తేదీ 2020 సంవత్సరం చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
ఈ గ్రహణం ఏ సమయంలో వస్తున్నది ఈ గ్రహణం యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం.
ముందుగా అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటో తెలుసుకుందాం.

చంద్రుడికి భూమికి మధ్య సూర్యుడు అడ్డు వచ్చినప్పుడు భూమి మీద కాంతి ప్రసరించకుండా ఉంటుంది. అంటే భూమి మీద ఉన్నటువంటి వారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్ర గ్రహణం అని అంటారు.
చంద్ర గ్రహణం ఎప్పుడూ కూడా పౌర్ణమి రోజున ఏర్పడుతుంది.

2020 సంవత్సరం జనవరి 10వ తేదీన ఏర్పడుతున్న పాక్షిక చంద్రగ్రహణం మన భారతదేశంలో కనపడుతుంది.
ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా ,ఆఫ్రికా ,యూరప్ నార్త్ అమెరికా ,ఆసియా ఇంకా మొదలగు ప్రదేశాలలో కనిపిస్తుంది.

పురాణాల ప్రకారం గ్రహణం అంటే రాహుకేతువులు సూర్యచంద్రులను మింగి వేస్తే ఏర్పడినవే గ్రహణాలు అని పేర్కొనేవారు.
పూర్వం గ్రహణాలను చూసి ప్రజలు విపరీతంగా భయపడుతూ ఉండేవారు. ఈ జనవరి 10న పాక్షిక చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుందో చూద్దాం.

chandra grahanam timings 2020

జనవరి 10వ తేదీ 2020 సంవత్సరం ఈ పాక్షిక చంద్రగ్రహణం ప్రారంభమయ్యే సమయం రాత్రి పది గంటల 38 నిమిషాలకు. జనవరి 11వ తేదీ వేకువ జామున 2 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. మొత్తం గ్రహణ సమయం 04:01 .47 సెకండ్లు భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుంది కాబట్టి గ్రహణం రోజున ఏ నియమాలు పాటించాలి అని సందేహ పడుతున్నారు ప్రజలు.

chandra grahan niyamalu in telugu

ఈ గ్రహణం రోజు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు , ఎందుకంటే ఈ గ్రహణం పాక్షిక చంద్రగ్రహణం కాబట్టి..ఎందుకంటే ఈ పాక్షిక చంద్రగ్రహణం మనకు కంటికి కనిపించదు. అంతేకాకుండా పాక్షిక చంద్ర గ్రహణాలను లెక్కలోకి తీసుకోరు. కేవలం సంపూర్ణ మరియు పాక్షిక గ్రహణాలు మాత్రమే నియమ నిబంధనలు పాటించాలని అంటూ ఉంటారు.

అయినా ఈ గ్రహణ సమయం రాత్రి పూట కాబట్టి అందరూ నిద్రపోతూ ఉంటారు. ఈ పాక్షిక చంద్రగ్రహణం లో ప్ర ఛాయా నీడ అడ్డు కోదు కాబట్టి. ఈ గ్రహణం రోజున భూమి పైన గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు.

chandra grahan rules for pregnant ladies

గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.  కానీ గర్భిణీ స్త్రీలు ఆ గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటే మంచిది. కాకపోతే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తున్నది కాబట్టి కొంత జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ గ్రహణం రాత్రి 10:00 దాటిన తర్వాత వస్తుంది కాబట్టి ఆ సమయానికి గర్భిణీ స్రీలు నిద్ర పోతూ ఉంటే మంచిదని అంటున్నారు.

ఈ గ్రహణ సమయంలో మంత్రోపదేశం ఉన్నవాళ్లు మంత్రాన్ని ఉచ్చారణ చేసుకుంటూ ఉంటే మంచిదని పండితులు చెబుతున్నారు. రామనామాన్ని విష్ణు ,లలితా సహస్రనామాలు పఠిస్తూ ఉంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.
ఈ గ్రహణం రోజున ప్రత్యేక నియమాలు ఏవీ లేవు కానీ గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది..