చంద్రుడి పై కూలిన విక్రమ్ ల్యాండ్రర్

0

 చంద్రుడిపై కూలిన విక్రమ్  ల్యాండర్, హార్డ్ ల్యాండింగ్ జరిగినట్లు నాసా ప్రకటన. ఎర్త్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయిన తర్వాత కూలిపోయిన విక్రమ్, విక్రమ్ జాడ ఇప్పటికీ గుర్తించలేక పోయామన్నా నాసా.7వ తేదీన గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయిన తరువాత,విక్రమ్  ల్యాండర్ చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్ అయినట్లు నాసా తెలిపింది. ల్యాండింగ్ ప్రాంతానికి సంబంధించిన ఫోటోలు నాసా విడుదల చేసింది.విక్రమ్ చేసే గడువు 14 రోజులు ఉండటంత,ఇస్రో కూడా చంద్రయాన్-2 పై ఆశలు వదిలేసుకుంది. హార్డ్ ల్యాండింగ్ కు గల కారణాలను, ఇస్రో ఇంకా అన్వేషిస్తుంది.ఒకవేళ  విక్రమ్ సజావుగా ల్యాండ్ అయిన, 14 రోజులు మాత్రమే, పనిచేస్తుంది. ఆ తరువాత, అది నిర్వీర్యం అయిపోతుంది. అందువలన, ఇస్రో దాని పై ఆశలు వదిలేసుకుంది.విక్రమ్ తో పాటు ఆర్బిటర్ ఉండటం వలన, విక్రమ్ హార్డ్ గా ల్యాండ్ అయిన, ఫోటోలను ఆర్బిటర్ తీసి నాసా కు పంపించింది. నాసా అధికారికంగా ఆ ఫోటోలను ట్విట్టర్ ద్వారా విడుదల చేయడం జరిగింది.అన్ని కక్ష్యలోకి విజయవంతంగా దూసుకెళ్లిన చంద్రాయన్ 2, చంద్రుడి కక్షకు  మరో 2.1 కిలోమీటర్ల దూరంలో ఉందనగా, విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి.అప్పటి నుంచి విక్రమ్ ల్యాండర్ తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఇస్రో తో పాటు, నాసా శాస్త్రవేత్తలు, పలు విధాలుగా ప్రయత్నించారు.చంద్రుడిపై రాత్రి సమయం రావడంతో వారి ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి.ల్యాండర్ నుంచి ఎటువంటి సమాచారం రానప్పటికీ, ఆర్బిటర్ మాత్రం బాగా పనిచేస్తోందని ఇస్రో చైర్మన్ కే. శివన్ వెల్లడించారు.తాజాగా ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ గురించి  నాసా ఇలా ప్రకటించడం జరిగింది.