మాస్కులు తయారు చేస్తున్నది మా అమ్మ కాదు —- చిరంజీవి

0

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ సిచువేషన్ లో ఉన్నది అని అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల వలన రోజువారి కూలీలు, ఎంతో మంది సామాన్య ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సమాజంలో చాలామంది ప్రజలు తినడానికి తిండి లాంటి కనీస సౌకర్యాలు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే నేను సైతం అంటూ కొంతమంది సమాజానికి ఉడతా భక్తి సహాయంగా ఏదో ఒకటి చేయాలని ఆలోచించే వాళ్లు కూడా ఉన్నారు.

అలాంటి వారిలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి తల్లిగారు అంజనా దేవి. ఈమె నేను సైతం అంటూ కరోనా వైరస్ ను అరికట్టడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా మాస్కులు కుడుతున్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈమె తన స్నేహితురాళ్లతో కలిసి గత మూడు రోజులుగా దాదాపు 700 మాస్కులు కుట్టి, వాటిని అవసరమైనవారికి ఉచితంగా పంచి తనదైన మానవత్వాన్ని చాటుకున్నది. అంటూ పలు మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.

మా అమ్మ కాదు — చిరంజీవి.
ఈ వార్తా కథనాల గురించి చిరంజీవి ట్విట్టర్ ద్వారా రెస్పాండ్ అయ్యాడు. దాతృత్వంతో మా తల్లిగారు మాస్కులు కుట్టి అందరికీ పంచి నట్లుగా కథనాలు వచ్చాయి ఇది నిజం కాదు. మీడియాలో చూపించినట్లుగా మాస్కులు కుడుతున్నది మా అమ్మ కాదు. మాస్కులు కుట్టి అందరికీ పంచిన ఆ తల్లి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అని ఈ విధంగా చిరంజీవి గారు తన ప్రతిస్పందన తెలియజేశాడు.