Coriander seeds water benefits in telugu | ధనియాల కషాయం
ధనియాల రసం/ ధనియాల నీళ్లు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు తెలుసా?
ప్రస్తుత ఆధునిక సమాజంలో చాలామంది బాధపడుతున్న సమస్య ఎసిడిటీ మరియు గ్యాస్ ట్రబుల్ సమస్యలు. ఛాతిలో మంట, పుల్లటి త్రేన్పులు, గొంతులో మంట దీని లక్షణాలు.
కారణాలు:-
చాలామంది రకరకాల ఒత్తిడితో బాధ పడుతూ ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు కలుగుతాయి. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం. ఇలాంటి కారణాల వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం కలుగుతాయి. అంటే జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.
ఈ సమస్యలన్నింటికీ చాలామంది వెంటనే టాబ్లెట్స్ వాడటం అలవాటు చేసుకుంటున్నారు. జీర్ణశయం లో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం పైకి ఎగతన్నటం వల్ల మనకు గ్యాస్ట్రిక్ సమస్య మరియు గొంతులో మంట వంటివి కలుగుతాయి.
ఈ గ్యాస్ ట్రబుల్ కు, దీని ఉపశమనానికి మన పూర్వీకుల కాలం నుండి ప్రచారంలో ఉన్న ఒక చిట్కా గురించి తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:- ఒక గ్లాస్ నీళ్ళు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర. మూడు లేదా నాలుగు నల్లమిరియాలు. మూడు లేదా నాలుగు లవంగాలు.
తయారీ విధానం:-
స్టవ్ మీద ఒక పాత్ర ఉంచి ఆ గ్లాసుడు నీళ్ళు పోసి, అందులోకి ఈ పదార్థాలన్నింటిని వేయాలి. అర గ్లాసు నీళ్లు మిగిలేంతవరకూ బాగా మరిగించాలి. ఈ నీటిలోకి చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఎన్నో రకాల అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నవి ధనియాలు మరియు జీలకర్ర.
ఆయుర్వేదం ప్రకారం ధనియాల కు మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. గ్యాస్ ఎసిడిటీ మరియు మలబద్దకానికి ధనియాలు చాలా చక్కగా పనిచేస్తాయి. మిరియాలు అజీర్తి సమస్య కు చాలా చక్కటి ఔషధంగా పనిచేస్తాయి. ఈ మిరియాలు ఎసిడిటీ సమస్య తగ్గించి గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం వంటి వాటికి ఉపశమనం కలిగిస్తుంది.
ముఖ్యంగా మిరియాలు మన జీర్ణాశయంలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ని తయారు కావడానికి సహాయం చేస్తాయి. లవంగాల లో కార్బోహైడ్రేట్స్, కాల్షియం, పాస్పరస్, సోడియం మరియు విటమిన్ ఏ లాంటి పోషకాలు ఉంటాయి.
ఇది గ్యాస్ మరియు ఎసిడిటి సమస్యను తగ్గిస్తాయి. శరీరంలో బ్లడ్ మరియు షుగర్ లెవెల్స్ ను కూడా కంట్రోల్ చేస్తాయి. ఈ కషాయాన్ని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తాగవచ్చు. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగవచ్చు.
గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నివారణకు ఈ కషాయాన్ని వారంలో రెండు సార్లు తప్పనిసరిగా తాగాలి. ఈ కషాయం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి గుండె సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది.
ప్రధానంగా శరీరంలో ఇమ్యునిటీ అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా జలుబు, దగ్గు, ఆయాసం, విరోచనాలు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ కషాయాన్ని తప్పనిసరిగా తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు ఈ కషాయం తాగితే షుగర్ లెవెల్స్ అందుబాటులోకి వస్తాయి థైరాయిడ్ సమస్యతో బాధపడేవారికి హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి.
ఈ చిట్కాలను పాటించడంతో పాటు ప్రతి రోజు మీరు మంచి నీరు ఎక్కువగా తాగాలి. జీర్ణ సంబంధ సమస్యలకు ప్రధాన కారణం సరిగా తాగునీరు తీసుకోకపోవడమే అని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి :-
- ఒక్క నిమిషంలో పసుపు పచ్చగా ఉండే మీ పళ్ళను తెల్లగా మార్చుకోండి
- మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు
- ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి
- మీ చర్మ నిగారింపు కోసం కేవలం రూ.15 చాలు
- ఈ రసం తాగితే 50 రకాల జబ్బులు మీ దరి చేరవు
- ఒక్క నిమిషంలో మీ దురదను ఇలా పోగొట్టండి !