కరోనా వైరస్ ఎఫెక్ట్ – ఇలాంటి ప్రయత్నం ప్రపంచంలో మొదటిసారి చేస్తున్న చైనా ..! ఎలాంటి జాగ్రత్తలు తీస్కోవాలి ?

0

డ్రాగన్ వర్సెస్ కరోనా వైరస్ :: ( corona effect in china )

డ్రాగన్ దేశంగా పేరుపొందిన చైనా దేశంలో ప్రస్తుతం అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తున్న ఈ భయంకరమైన కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతూ, ఎంతోమంది ఆ రోగం బారిన పడి చనిపోవడం జరుగుతున్నది. ఒక చైనా నుండే కాకుండా హాంకాంగ్ నుంచి వస్తున్న ప్రయాణికుల్లో ఒక్కొక్కరిని వదలకుండా క్షుణ్నంగా వైద్యపరమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఎందుకంటే చైనా నుండి రాకపోకలు సాగిస్తున్న వారి నుండే ఇది ప్రపంచమంతా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ మరియు ముంబై లో కొన్ని ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చైనా నుంచి మరియు చైనా సరిహద్దు ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికుల లో ఎవరికైనా కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వారిని ఈ ప్రత్యేక వార్డుల్లో చేర్చాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడమైనది.



పై చిత్రాన్ని చూశారా? ఒకే ప్రాంతంలో ఇన్ని జెసిబి లు ఇంత హడావుడిగా భూమిని చదును చేస్తున్నాయి ఎందుకో తెలుసా ??

చైనా దేశంలోని వుహాన్ లో కరోనా వైరస్ వ్యాప్తి తో భారీ సంఖ్యలో మరణిస్తున్నారు. ఈ కారణంగా అలాంటి వారికి ప్రత్యేక చికిత్స కోసం కేవలం పది రోజుల్లోనే వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మించేందుకు చైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేసి చూపిస్తున్నది. అందుకే ఒకేసారి వందకు పైగా జెసిబి లు వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం చాలా శ్రమిస్తున్నాయి. 2020 ఫిబ్రవరి మూడో తేదీ కల్లా ఈ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని ఉన్నతాధికారులు సైతం కంటి మీద కునుకు లేకుండా అహర్నిశలు కష్ట పడుతున్నారు.

coronavirus precautions in telugu :

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఎంతో ప్రమాదకరంగా చైనాలో వ్యాప్తి చెందుతున్న కొత్తరకం కరోనా వైరస్ నుండి కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తెలియజేసింది ఏంటో తెలుసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామా!!
1. ఎవరికైనా అనారోగ్యం అనిపిస్తే ప్రయాణం వాయిదా వేసుకోవాలి.
2. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
3. సబ్బుతో అప్పుడప్పుడు మధ్యమధ్యలో చేతులు కడుగుతూ ఉండాలి.
4. పరిశుభ్రమైన చేతి రుమాలుతో, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు నోటికి, ముక్కుకు అడ్డుగా పెట్టుకోవాలి.
5. ఇతరులు వాడిన చేతి రుమాలు, టవాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు.
6. పెంపుడు జంతువులతో ఎక్కువసేపు ఉండకూడదు. మరియు జంతువుల మాంసాన్ని చేతితో తాకరాదు, మరియు తినకూడదు.
7. పంట పొలాల్లో మరియు జంతువుల అమ్మకాలు సాగే ప్రాంతాల్లో ఉండకూడదు.
8. ఇతరులు అనారోగ్యంగా కనిపిస్తే వారిని ప్రత్యేకంగా ఓ చోట ఉంచాలి, వారికి సరైన చికిత్సను అందించాలి.
ఇదిలా ఉండగా ఓ వైపు విమానయాన ప్రయాణం వల్లనే ఎక్కువగా ఈ వ్యాధి వ్యాప్తి జరుగుతుందనే ఉద్దేశంతో విమానయానం చేసేవాళ్ళు ఈ క్రింది జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి నివారణకు అవకాశం ఉన్నది.
1. విమానంలో వస్తూ భారతదేశంలో దిగినప్పుడు వెంటనే అక్కడున్న వైద్య సేవలను పొందాలి .
ఈ విషయంలో నేను ఆరోగ్యంగా ఉన్నానని, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకూడదు.
2. ప్రయాణాల్లో పక్కవారితో ఎక్కువ చనువుగా ఉండకూడదు
3.ముఖ్యంగా వ్యాధి ప్రబలిన చైనా నుంచి వచ్చిన 30 రోజుల్లోపు ఏరోజైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి మీ వ్యాధి లక్షణాలన్నీ చెప్పాలి.
4. విమానం నుండి దిగగానే అక్కడి వైద్య సిబ్బంది ఇచ్చే మాస్కు తీసుకుని ధరించాలి.

అంతేకాకుండా చైనా కు వెళ్లేవారు, చైనా నుండి వచ్చే వారు ఒకవేళ వారు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే టికెట్ల లో ఎలాంటి అడిషనల్ చార్జ్ వసూలు చేయరాదని ఎయిర్ ఇండియా మరియు ఇండిగో విమాన సంస్థలు ప్రకటించాయి.

చైనా దేశానికి మరొక పేరే డ్రాగన్ దేశం ఇలాంటి దేశంలో అందరి కీ ప్రాణభీతి కల్పిస్తున్న ఈ భయంకరమైన కరోనావైరస్ అనేది పాములనుండి వ్యాపిస్తున్నది అనే ఒక ప్రాథమిక నిర్ధారణ చేయడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నది!!!