కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా జగన్ సంచలన నిర్ణయం

0

ఉదయం నుంచి ఒంటి గంట వరకే దుకాణాలు – AP CM JAGAN

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే ప్రయత్నంలో భాగంగా జగన్ ప్రభుత్వం మంత్రుల కమిటీతో భేటీ జరిపి కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇక అన్ని రకాల దుకాణాలు చేర్చవలెను అని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజలందరూ నిత్యావసరాలు కూరగాయల కోసం బజార్లోకి వచ్చి విచ్చలవిడిగా తిరుగుతున్నారని దీనివల్ల కారణం వైరస్ ఎక్కువగా వ్యాప్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావించింది.

అందుకే ఇక నుంచి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే దుకాణాలు తెరవబడతాయి. ప్రజలు కూరగాయలు కొనడానికి విపరీతంగా రైతుబజార్ల దగ్గరకు వస్తూ ఉండడం వల్ల వైరస్ వ్యాప్తి నివారణకు ఇది ఒక పెద్ద ఆటంకంగా మారుతున్న అందువల్ల నేటి నుంచి రైతు బజార్లలో వికేంద్రీకరణ చేయాలని జగన్ ఆర్డర్స్ జారీ చేశాడు.

ప్రజలు ఎవరూ కూడా వారు ఉన్నటువంటి ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయకూడదు. ప్రజలందరూ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి. నిత్యావసరాలు సరుకులకు ఇబ్బందులు లేకుండా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దుకాణాలు తెరవబడతాయి కాబట్టి ప్రజలు గుంపులుగా వచ్చి కొనడం కంటే విడివిడిగా వెళ్ళడం చాలా మంచిది. కర్ఫ్యూ నేపథ్యంలో లో ఎవరైనా దుకాణదారులు నిత్యావసర ధరలను ఎక్కువ రేట్లు పెంచి అమ్మి నట్లయితే మరియు బ్లాక్ మార్కెటింగ్ మోసాలు వంటి నివారణ కోసం 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని జగన్ తెలిపారు.

అన్నిటికంటే ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నం లో భాగంగా ప్రజలందరూ ఒకేసారి రైతు బజార్లో దగ్గరికి రాకుండా రైతు బజార్లలో ఏరియాల వారీగా ఏర్పాటు చేయించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు. మన తెలుగు వారి తెలుగు న్యూస్ పోర్టల్ వెబ్సైటు ప్రతి క్షణం మీ కోసం కరోనా న్యూస్ ను అందజేస్తూ ఉంటుంది. కరోనా వైరస్ కు సంబంధించి మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.