కరోనా ఎఫెక్ట్ తో ” ఆ ” వీడియోల సైట్లకు పెరిగిన డిమాండ్ !!

0

ప్రపంచం మొత్తం కరోనా దెబ్బకు విలవిల్లాడిపోతోంది. Covid 19 వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు భారీగా దెబ్బతిన్నాయి. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ఈ విషయాన్ని పదేపదే చెబుతూ, లాక్ డౌన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాడు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కఠినమైన ఆంక్షలు విధిస్తూ మోడీ ఇచ్చిన సూచన మేరకు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

ఇక భారత్ లో కూడా ఈ వైరస్ వ్యాప్తి రోజురోజుకీ పెరిగిపోతున్నందువల్ల నరేంద్ర మోడీ ఏప్రిల్ 14వ తేదీ వరకు ప్రతి ఒక్కరు కూడా స్వీయ నిర్బంధంలో ఉండండి అని పిలుపునిచ్చారు. దీనివల్లనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని అందరి ఆలోచన. సమాజంలో మామూలుగా ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేవారే. మరి ప్రస్తుతం అందరం ఇంట్లోనే కూర్చుని ఉండాలి అంటే వారు కాలక్షేపం కోసం టీవీ, మొబైల్, ల్యాప్ టాప్స్ వంటి వాటిపై ఆధారపడుతున్నారు.

అయితే కొంత మంది మాత్రం ఇదే ఛాన్స్ గా భావించి ఫోర్న్ వీడియోలు వైపు ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువ మంది యువత పోర్న్ సైట్లు చూస్తూ తెగ రెచ్చిపోతున్నారు అని ఓ సంస్థ జరిపిన సర్వేలో ప్రకటించింది. చాలామంది కుర్రకారు అంతా ఫోర్న్ వీడియోల కు బానిస అవుతున్నారు.

ఇలాంటి సందర్భాన్ని కూడా క్యాష్ చేసుకునే అవకాశంగా భావించిన కొన్ని టెలికామ్ సంస్థలు ఇంట్లో ఉండి బోర్ ఫీల్ అవుతున్నారా అంటూ రోజుకు 2 జీబీ ఉచితంగా ఇస్తూ బ్రహ్మాండమైన ఆఫర్ లు పెట్టడం వల్ల చాలామంది ఈ పోర్న్ సైట్ల మీద పడుతున్నారు.

గత వారం నుంచి ఈ వారానికి దాదాపు 20 శాతం పైగా ఈ సైట్లకు ట్రాఫిక్ పెరిగిందని తేలింది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే లాక్ డౌన్ రోజుల్లో వీటికి మరింత డిమాండ్ పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.

కరోనా వైరస్ కు సంబంధించి ఎలాంటి సమాచారం కోసమైనా, జనరల్ బ్రేకింగ్ న్యూస్ కోసమైనా చూస్తూ ఉండండి మన తెలుగువారి “తెలుగు న్యూస్ పోర్టల్ వెబ్సైట్.”