కరోనా డెడ్ బాడీస్ కు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

0

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు భారత దేశానికి ఆర్థిక రాష్ట్రంగా పేరు పొందిన మహారాష్ట్రలో ఇప్పటివరకు1574 మందికి కరోనా సోకగా, వీరిలో 110 మందికి పైగా మరణించారు. ప్రధానంగా పూణే లో 25 మంది చనిపోయారు. అక్కడ 245 కేసులు పాజిటివ్ గా తేలాయి. కరోనా వైరస్ సోకి మరణించిన ఈ మృతదేహాలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ సంచలన నిర్ణయం ప్రకటించింది.

ఈ డెడ్ బాడీస్ కు ప్రభుత్వమే ఇకనుంచి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కరోనా మృత దేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించబోమని తేల్చి చెప్పింది.అయితే వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు మృతదేహాన్ని ఖననం లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో కాల్చివేస్తామని వెల్లడించింది.అంత్యక్రియలు జరిపే సందర్భంలో వ్యాధి విపరీతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందువల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

మృతదేహానికి అంత్యక్రియలు జరిపే వాళ్ళు తప్పనిసరిగా పర్సనల్ ఎక్విప్మెంట్ సూట్ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ మృతదేహాల అంత్యక్రియలకు సంబంధించిన టీం సూపర్వైజర్ గా ఉన్న పూణే జిల్లా కలెక్టర్ కిషోర్ రామ్ మాట్లాడుతూ , మృతదేహాలను రెండు ప్లాస్టిక్ కవర్లతో చుట్టగా చుట్టి సీలు వేసి భద్రపరుస్తాం.వీటిని నగర శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ దాదాపు ఆరు అడుగుల లోతు గుంతలు తవ్వి పూడ్చి వేస్తాం. ఇక మరి కొంతమంది విశ్వాసాల ప్రకారం వారి బంధువుల మృతదేహాలను కాల్చి వేయడం కోసం ఎలక్ట్రానిక్ మిషన్ లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ఉన్నతాధికారి రాజేంద్ర గారు తెలియజేశారు. మహారాష్ట్రలో కూడా ఈ కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ప్రజలందరూ బెంబేలెత్తుతున్నారు.