కరోనా పై రివ్యూ మీటింగ్ – సీఎం జగన్ మోహన్ రెడ్డి

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టడానికి రాష్ట్రంలో కుటుంబ సర్వే చాలా పకడ్బందీగా నిర్వహించాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశాడు. ముఖ్యంగా ప్రతి ఆస్పత్రిలోనూ ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని తెలిపారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన రివ్యూ మీటింగ్ లో జగన్ కొన్ని ముఖ్యమైన ఆదేశాలు ఇవ్వడమైనది. కరోనా వైరస్ నివారణ చర్యల కోసం ఈ రివ్యూ మీటింగ్ నిర్వహించడమైనది. ప్రధానంగా ఈ మీటింగ్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కన్నబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సహాని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన స్పెషల్ ప్రిన్సిపుల్ సెక్రటరీ జవహర్ రెడ్డి లతో ఈ రివ్యూ మీటింగ్ ని నిర్వహించారు.

జగన్ నూతన ఆదేశాలు:-
ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ముఖ్యంగా భారతీయ వైద్య విధాన మండలి గైడ్ లైన్స్ ప్రకారం మూడో విడత ఇంటింటి సర్వే చేసేటటువంటి ప్రశ్నావళి లో మరో రెండు ముఖ్యమైన అంశాలను చేర్చాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. అవి ఏమనగా మొదటి రెండు సర్వేల్లో జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం లతో గుర్తించిన దాదాపు 6289 మందికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మూడో విడత సర్వేలో తప్పనిసరిగా ఉండాలని ఆర్డర్ జారీ చేసాడు. ఈ మూడో విడత సర్వేలో కుటుంబ సభ్యులందరినీ విధిగా సర్వే చేయాలని, వైరస్ లక్షణాలు కనిపిస్తే వాళ్లను ప్రత్యేకంగా గుర్తించి వారికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని ఆయన కోరారు.

ధాన్యం ట్రాన్స్ పోర్ట్ కు వెహికల్స్ రెడీ:-
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వ్యవసాయం మీద రివ్యూ మీటింగ్ జరిపి ధాన్యం రవాణా చేసే అందుకోసం వెహికల్స్ ను రెడీ గా ఉంచాలని ఆదేశించాడు. ఏ రకమైన ధాన్యం అయితే స్టాక్ పెట్టలేరో అలాంటి ధాన్యాన్ని ట్రాన్స్ పోర్ట్ చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా తెలిపాడు. కరోనా వైరస్ కు రెడ్ జోన్, హాట్ స్పాట్ గా ఉన్నటువంటి ప్రదేశాలకు దూరంగా మిర్చి యార్డు లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు తెలియజేశాడు. చివరిగా రైతులు తామే స్వయంగా మార్కెట్లో పంటను అమ్ముకోవాలి అంటే అలాంటి వారికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించాలని కూడా పేర్కొన్నాడు.