కరోనా గురించి వ్యాసం – Corona Virus Essay Writing In Telugu !

0
Corona Virus Essay In Telugu

కరోనా గురించి వ్యాసం | Coronavirus Essay Writing In Telugu 

Corona Virus Essay In Telugu :- కరోనా అంటేనే అందరికి గుర్తుకువచ్చేది మనషుల ప్రాణాలు తీసే వైరస్ అని. ఈ వైరస్ వచ్చినప్పటి నుండి ఇప్పటి దాకా అనేక మంది తమ ప్రాణాలను కొల్పోయారు. ఈ మహమ్మారి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరికి  సోకి మరణించారు. 

ఈ మహమ్మారి చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్‌. కరోనా వైరస్‌ అనేది  శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే వైరస్. ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు. ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అనేక మంది మరణించేలా చేసింది.
కొంత మంది అయితే ఈ వైరేస్ వస్తుంది అనే భయంతో మరణించారు. ప్రతి ఒక్క ఊరికి ఈ వైరేస్ సోకడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు . మన దేశంలో కారోన కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అలాగే ప్రజలు కూడా మరణిస్తున్నారు.
ఈ వైరేస్ ఇతర దేశం నుండి వచ్చి ఎంతో మంది ప్రాణాలను తీసుకొన్నది. ఈ వైరేస్ కి వ్యాక్సిన్ వచ్చిన ఏం లాభం లేకుండా పోయింది.  వ్యాక్సిన్ వేసుకొన్న కూడా ఈ వైరేస్ సోకుతుంది. ఇప్పుడు కరోనా అనేక దశల వారిగా మారి ప్రజలను భయపెడుతుంది. దేశంలోనే కాకుండా ప్రాంతంలోనూ, పట్టణాలలో, గ్రామాలలో వ్యాక్సిన్ వేపించుకోకుండా ఉండేవారు ఉన్నారు.
ఇప్పుడు ఉన్న పరిస్థుతులలో కరోన ఎక్కువగా రావడం జరుగుతుంది, ఈ మహమ్మారి ఎప్పుడు పోతుందో ఏమోగాని, మన దేశానికి పట్టుకొన్న పిడ పోతుంది అని అందరు అంటున్నారు. ఈ మహమ్మారి వల్ల  లాక్ డౌన్లో జనాలు అనేక బాధలు పడినారు.
ప్రతి చిన్న గ్రామాలకు, ప్రాంతాలకి, పట్టణాలకి ఈ వ్యాధి సోకడం జరిగినది. అలాగే దీనికి సంభందించిన  వ్యాక్సిన్ కూడా రావడం జరిగినది, వచ్చిన కూడా ఎలాంటి యూస్ లేకుండా అయింది, దీనిని అందరు వేసుకొన్న గాని ఈ వైరస్ సోకడం జరిగింది.

కరోనా వైరస్ లక్షణాలు ఏమిటి ?

  • జలుబు రావడం.
  • జ్వరం తో బాధపడడం.
  • దగ్గు ఎక్కువ అవ్వడం.
  • తలనొప్పిగా ఉండడం
  • అలసటగా ఉండటం.

పైన పేర్కొన్న లక్షణాలతో ఎక్కువగా బాధపడుతుంటే వెంటనే వైద్యుడిని  సంప్రదించండి. ఒకవేళ అలాగే ఉంటె వైరస్ రావడానికి అవకాశం ఉన్నదీ.

కరోనా రాకుండా ఉండాలంటే జాగ్రతలు ఏమిటి ?

  • ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది, కనుక వీలైనంత దూరం పాటించడం మేలు.
  • కరోనా వచ్చిన వ్యక్తి నుండి దూరంగా ఉండాలి.
  • ఆరోగ్యకరమైన ఆహరం మాత్రమే తీసుకోవాలి.
  • ఎవరిని’ కూడా ఎక్కువగా ముట్టరాదు.
  • ప్రయాణం చేసే సమయంలో తప్పని సరిగా మాస్క్ ను ధరించాలి.
  • బయట ప్రాంతాలకి వెళ్ళినపుడు ఏ వస్తువుని టచ్ చేయరాదు, అలాగే sanitizer చేతులకి వేసుకొంటూ ఉండాలి.
  • బయట ప్రదేశాలకి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు  కాళ్ళ, చేతులు శుభ్రంగా చేసుకొనే ఇంటిలోకి ప్రవేశించాలి.
  • ఇతరుల ముఖం, చేతులు, బాడీ ని ముట్టుకోరాదు.
  • మీరు తినే సమయంలో లేదా ఖాళి టైంలో వేడి నీటిని తాగాలి.
  • బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ ని అసలు తీసుకోకండి.
  • ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి భౌతిక దూరం పాటించండి.
  • తగ్గు, తుమ్ములు ఉన్న మనుషుల వద్దకు వెళ్ళకండి.
  • ఎక్కువగా మంది ఒకే చోట చేరే  కార్యక్రమాలకు వెళ్ళకండి.

కరోనా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ?

  • కారోనా సోకిన వ్యక్తి వారి కుటుంబoతో కలిసి ఉండరాదు.
  • కారోనా వచ్చిన వారు క్వారంటైన్‌కి తప్పనిసరిగావెళ్ళాలి.
  • క్వారంటైన్‌ లో కూడా రోగులకి వేరు వేరు రూమ్స్ ఉండాలి, అలాగే వాష్ రూమ్స్ లు కూడా సప్రేట్ గా ఉండేలాగా చూసుకోవాలి.
  • క్వారంటైన్‌లో  ఉన్నపుడు ఆరోగ్యకరమైన ఆహరం మాత్రమే తీసుకోవాలి.
  • ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి, ధూమపానంకి కూడా దూరంగా ఉండాలి.
  • బంధు మిత్రులు మిమ్మల్ని చూడానికి వచ్చినపుడు కనీసం ఒక మీటర్ దూరం పాటించాలి. వీలైనంత దూరం పాటించడం మరీ మంచిది. ఇతరులతో ఆహారం పంచుకోవడం లాంటివి  చేయకూడదు.
  • హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న వారు వృద్ధులు, గర్భవతి మహిళ నుంచి దూరంగా ఉండాలి. పిల్లలతో దూరం పాటించాలి.
  •  హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారు ఇంట నుంచి ప్రభుత్వం నిర్ధేశించిన గడువు వరకు, లేదా నెగెటీవ్ వచ్చేంత వరకు బయటికి వెళ్లకూడదు.
  •  ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్న వారు పరిశుభ్రత పాటించడం తప్పనిసరి. తరచూ చేతులు కడుగుతూ ఉండాలి. నిత్యం మాస్క్ ధరించాలి. ఇంట్లో వస్తువులను, ఇంటిని, గదిని తరచూ శుభ్రం చేయాలి.
  • హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తెలిసో తెలియకో కొన్ని వస్తువులను టచ్ చేస్తుంటారు. అలాంటి సమయంలో ఆ వస్తువులను వెంటనే శానిటైజ్ చేయాలి.

పైన పేర్కొన్న సమాచారం అంత అంతర్జాలం నుండి సేకరించినది, మీకు వైరస్ గురించి ఎలాంటి సందేశాలు ఉన్న వైద్యుడిని  సంప్రదించండి. ఇది మీకు అవగాహనా కల్పించడం  కోసమే తెలియచెస్తున్నాం. మీకు ఈ వ్యాసం మీద డౌట్స్ ఉంటె కామెంట్  రూపంలో తెలియచేయండి. తప్పకుండ రిప్లై ఇస్తాం.