చైనా నుండి భారత్ కు భయంకరమైన కరోనా వైరస్..హై అలర్ట్

0

చైనా దేశం నుండి భారత్ కు వ్యాపిస్తున్న కరోనా వైరస్ :-

దీన్నే కిల్లర్ కరోనా వైరస్ అని కూడా అంటున్నారు. భూమి పైన మానవ జాతి అంతరించి పోవడానికి అనేక రకాల కారణాల్లో వైరస్లు కూడా పెద్ద కారణమే. ఎందుకంటే ఈ వైరస్ ల దెబ్బకు ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.  భారతదేశంలో గడిచిన కొన్ని సంవత్సరాల కిందట బర్డ్ ఫ్లూ వైరస్, స్వైన్ ఫ్లూ వైరస్ ల ద్వారా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరలా చైనా నుండి మనకు వ్యాపిస్తున్న వైరస్ కరోనా వైరస్. దీన్నే కిల్లర్ కరోనా వైరస్ అని కూడా అంటున్నారు ప్రస్తుతం భారత్ లో ఎంత మంది ప్రాణాలు కోల్పోతారో అని అనుమాన భయాలతో ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం ఈ కరోనావైరస్ బారిన పడి చైనాలో 25 మంది ఇప్పటికే మృతి చెందారు. దాదాపు 850 మందికి ఈ వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. 70 లక్షల మందికి వైరస్ అనుమానితులు గా భావించి వారికి గృహనిర్బంధం విధించారు. దీంతో ఎక్కడి ప్రజలు అక్కడే నివాసం ఉండేలా చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. చనిపోయిన 25 మందిలో 24 మంది మధ్య హూబీ ప్రాంతానికి చెందిన వారని చైనా అధికారులు వివరించారు.

మరొకరు హెబీఅనే ప్రాంతంలో చనిపోయారని తెలిపారు. ఈ హెబి అనే ప్రాంతం చైనా రాజధాని అయిన బీజింగ్ సరిహద్దుల్లో ఉండటంవల్ల రాజధాని ప్రాంతంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా చెందిందని ప్రచారం జరుగుతున్నది. అంతేకాక ఇతర ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 177 మంది పరిస్థితి కూడా తీవ్ర విషమంగా ఉందని తెలుస్తోంది. ఒకవైపు చైనాలో ఈ కరోనా వైరస్ దెబ్బకు జనాలు పిట్టల్లా రాలి చనిపోతుంటే, మరోవైపు జపాన్లో కూడా ఈ వ్యాధి బారిన పడిన వారు బయట పడుతున్నారు.

చైనాలోని విహాన్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి జపాన్ వెళ్లడం వల్ల అక్కడ ఈ కరోనా వైరస్ కేసు బయటపడింది. ప్రస్తుతం చైనాలో ఈ కేసులో రోజురోజుకు పెరుగుతూ ఉంటే చైనా రాజధాని బీజింగ్లో కూడా కరోనా వైరస్ బారిన పడ్డవారు పెరిగిపోతున్నారు. థాయిలాండ్, దక్షిణ కొరియా, తైవాన్, జపాన్, అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ కరోనావైరస్ కేసులు ఒక్కొక్కటిగా నమోదవుతున్నాయి.

నిర్బంధంలో ఉన్న ప్రజలు::

చైనాలోని విహాన్ ప్రాంతంలో ఈ వైరస్ వ్యాప్తి చెందడంతో దీని సమీపంలో ఉన్న ప్రాంతంలో దాదాపు ఏడు మిలియన్ల జనాభా ఉన్న ఈ ప్రాంతంలో లో ఉన్న చోటనే నిర్బంధం చేసి ప్రజా రవాణాను అధికారులు ఆపివేయడం జరిగింది. ఈ కరోనా వైరస్ దెబ్బకు దాదాపు చైనాలో 70 లక్షల మంది ప్రజలను ఎక్కడికక్కడే ఆపి వేస్తున్నట్లుగా ప్రకటించడంతో ఆశ్చర్యానికి గురైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి గౌడ్ ఎన్ గెలియా తన ఆందోళన వెలిబుచ్చారు.


రేపు అనగా శనివారం చైనాలో నూతన సంవత్సర దినోత్సవం! ఈ సందర్భంగా చైనాలో ప్రజలందరూ వారం ముందు నుంచే వారి ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకున్నారు అయితే ప్రస్తుతం ఈ కరోనా వైరస్ దెబ్బకు ఎక్కడ ప్రజలు అక్కడే అన్నట్లుగా నిలిచిపోయారు. చైనాలో ఈ కరోనా వైరస్ దెబ్బకు ఈ శనివారం చంద్ర నూతన సంవత్సరం అనే పండుగ చేసుకోలేక సంబరాల్లో మునిగి తేలలేక బాధతో గడుపుతున్నారు.