ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్ కు ఇంతవరకు ఎక్కడా వ్యాక్సిన్ కానీ మందు కాని లేదు. సరిగ్గా 4 నెలల క్రితం చైనా లోని వుహాన్ లో వ్యాప్తి చెంది ఎన్నో వేల మంది ప్రాణాలను బలి తీసుకున్న ఈ వైరస్ కు గురికాని దేశం కాని, ప్రదేశం కాని లేదు. ప్రపంచ దేశ ప్రజలు అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్న ఈ వైరస్ ను నిర్మూలించడానికి ఔషధాన్ని కనిపెట్టడం కోసం ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధి పొందిన ఎందరో శాస్త్రవేత్తలు, ఎన్నో ఫార్మాస్యూటికల్ కంపెనీలు చేయని ప్రయత్నాలు లేదు.
ఇప్పటివరకు మందు కనిపెట్టడం లో పెద్దగా అభివృద్ధి లేకున్నప్పటికీ, కేవలం అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ లో మాత్రమే కొంత మేరకు సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాల్లో సింథటిక్ వైరస్ ను సృష్టించి దాని ద్వారా, దాని నివారణకు వ్యాక్సిన్ ను కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. అయితే ఎక్కడో విదేశాల్లో మందు తయారై మనదేశానికి రావడానికి చాలా సమయం తీసుకుంటుంది. అందుకోసమే మనదేశంలోనే మందు తయారీ కోసం ప్రభుత్వ వర్గాలు మరియు ఇతర పరిశ్రమవర్గాలు ముందుకు వస్తే మేము అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ప్రకటన చేసింది.
వ్యాక్సిన్ తయారీ ప్రాసెస్ :–
మామూలుగా ఏదైనా వ్యాధికి కొత్తగా మందు కానీ వ్యాక్సిన్ కానీ తయారు చేసి దానిని రోగుల మీద ప్రయోగించి వచ్చేటువంటి రిపోర్ట్స్ ఆధారంగా వాడవచ్చా లేదా అని ఫైనల్ డిక్లరేషన్ తర్వాత మందుకు డ్రగ్ కంట్రోల్ వారి అనుమతి వచ్చిన తర్వాత, ఈ వ్యాక్సిన్ తయారీకి వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. మామూలుగా అయితే ఇదంతా పూర్తి కావడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది.
వీటన్నిటినీ దాటవేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వ్యాక్సిన్ తయారీ కోసం DCGI కొన్ని సూచనలు చేసింది:-
ఏదైనా ఔషధ సంస్థ కరోనా వ్యాధి నివారణకు మందు తయారీ కోసం ప్రయత్నాలు చేస్తుంటే అలాంటి వారు నేరుగా తమ సలహాలు సూచనల కోసం కలవాలని DCGI తెలిపింది. ఇప్పటికే ఏ సంస్థ దగ్గర అయినా ఈ వ్యాధికి మందు ఉన్నట్లయితే వాళ్లు అనుమతి కోసం మొదటగా వస్తే వారికే ప్రాధాన్యత ఇస్తామని కూడా తెలిపింది. ఒకవేళ విదేశాలలో తయారైన మందులు మన దేశంలోకి దిగుమతి చేసుకుని స్వదేశీ విక్రయాలు జరపాలని అనుమతి కోరితే మేం వారికి ప్రాధాన్యత ఇస్తామని DCGI తెలిపింది. వ్యాక్సిన్ కోసం చేసే పరీక్షల్లో బయో అవైలబిలిటీ మరియు బయో ఈక్వలెన్స్ లాంటి రీసెర్చ్ ల కోసం కేవలం ఏడు రోజుల లోపలే అనుమతి ఇస్తామని కూడా తెలిపింది. ముఖ్యంగా covid- 19 వ్యాధిని గుర్తించడానికి మెడికల్ కిట్లు తయారీకి తాము వెంటనే అనుమతి ఇస్తామని DCGI పేర్కొన్నది.
ప్రస్తుతం మన దేశంలోని ఈ వైరస్ వ్యాధి నిర్ధారణకు చేస్తున్న పరీక్షల్లో పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వారు అభివృద్ధి చేసిన కిట్లనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాడుతున్నారు. ప్రస్తుతం భారత దేశంలో రోజురోజుకు ఈ వ్యాధి తీవ్రంగా ప్రబలుతున్న కారణంగా , ఈ కిట్ లకు డిమాండ్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో వేరే ఇతర సంస్థలు ఈ కిట్ల తయారీకి ముందుకు వస్తే తాము అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది.
ప్రస్తుతానికి మన దేశంలో రోజుకి కేవలం ఐదు లేక ఆరు వేల మందికి మాత్రమే వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయగల కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో రోగుల సంఖ్య పెరిగితే ఈ కిట్లకు అధిక డిమాండ్ ఏర్పడుతుందని వీటిని తయారు తయారు చేసే సంస్థలకు ఎక్కువ మొత్తంలో కరోనా మెడికల్ కిట్లు తయారుచేయాలని సూచనలు చేసింది.
కరోనా కు సంబంధించి ఎలాంటి సమాచారం కోసమైనా క్లిక్ చేయండి “తెలుగు న్యూస్ పోర్టల్ వెబ్సైట్ “