క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి ? క్రెడిట్ కార్డ్ వలన ఉపయోగాలు ఏమిటి !

0
Credit Card Meaning In Telugu

క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి | What Is Credit Card In Telugu 

Credit Card Meaning In Telugu :-ఒక క్రెడిట్ కార్డ్ అనేది ఒక ప్రీ-సెట్ క్రెడిట్ పరిమితితో బ్యాంకుల ద్వారా జారీ చేయబడిన ఒక ఆర్థిక సాధనం, ఇది మీకు నగదురహిత లావాదేవీలు చేయడానికి సహాయపడుతుంది.

క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుండి మీరు డబ్బు తీసుకోవడానికి మరొక రకం కార్డు. బ్యాంకు దానిలో క్రెడిట్ పరిమితిని కూడా పెడుతుంది. ఈ పరిమితి మీ ఆదాయం ఆధారంగా ఉంటుంది.

ఎప్పటికప్పుడు పెరుగుతుంది, బ్యాంకు మీ క్రెడిట్ కార్డ్ ఖర్చులను బిల్లు చేస్తుంది. మీరు దానిని గడువు తేదీలోగా చెల్లించాలి. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ రుణాన్ని చెల్లించలేకపోతే, బ్యాంకు తీసుకున్న డబ్బుపై వడ్డీ రేటును వసూలు చేస్తుంది.

క్రెడిట్ కార్డ్ వలన లాభాలు ఏమిటి | What Is Credit Card Uses In Telugu

క్రెడిట్ కార్డ్ ఉపయోగించుకోవడం వలన వివిధ లాభాలు ఉన్నాయి ఆ లాభాలు అంటి అనేది తెలుసుకొందం.

  •  క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లు క్రెడిట్ కార్డులను దాదాపుగా చాలా చోట్లు ఉపయోగించొచ్చు. చేతిలో డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు.
  •  ప్రతి లావాదేవీలపై రివార్డు పాయింట్లను పొందొచ్చు. వీటిని రిడీమ్ చేసుకొని వోచర్లను పొందొచ్చు.
  •  ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సదుపాయం కూడా ఉంది. ఏ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లైనా డబ్బులు తీసుకోవచ్చు
  •  40 నుంచి 50 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్ సౌకర్యం ఉంది.
  • ఎప్పుడు అవసరం అయినా కార్డును ఉపయోగించొచ్చు. టైమ్ లిమిట్ అంటూ ఉండదు.
  •  ఆకర్షణీయ వడ్డీ రేట్లకు పర్సనల్ లోన్స్ కూడా పొందొచ్చు. క్రెడిట్ కార్డుపై ఉపయోగించని క్రెడిట్ లిమిట్‌పై ఈ లోన్ తీసుకోవచ్చు. లేదంటే ట్రాక్ రికార్డ్ ప్రాతిపదికన కూడా లోన్ లభిస్తుంది.
  • స్మార్ట్‌ఫోన్, ఫ్రిజ్, టీవీ లేదంటే ఇతర ప్రొడక్టులు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినప్పుడు, వాటిని ఈఎంఐ రూపంలోకి మార్చుకోవచ్చు.
  • విదేశాల్లో కూడా క్రెడిట్ కార్డ్ ని ఉపయోగించవాచు.
  • క్రెడిట్ కార్డు బిల్లును క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తే క్రెడిట్ స్కోరును మెరుగుపరుచుకోవచ్చు.
  • ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉంటే.. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సదుపాయం కూడా లభిస్తుంది.
  • మీరు షాపింగ్‌కు వెళ్తే జేబులో వేలకు వేలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు క్రెడిట్ కార్డ్ ఒకటి ఉంటె చాలు.
  • మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడినా రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మీ యూసేజ్‌ను బట్టి రివార్డ్స్ వస్తుంటాయి. వాటిని రీడీమ్ చేసుకొని ఓచర్లు, వస్తువులు తీసుకోవచ్చు.
  • కొన్ని క్రెడిట్ కార్డులపై కాంప్లిమెంటరీగా నెలకు రెండు సినిమా టికెట్లు ఉచితంగా లభిస్తాయి. లేదా ఆఫర్స్ అనేవి ఉంటాయి.

క్రెడిట్ కార్డ్ ఎలా తీసుకోవాలి | How To Get Credit Card

క్రెడిట్ కార్డ్ ఎలా తీసుకోవాలి అనేది కొంత మందికి తెలుసు, మరికొంత మందికి తేలిక పోవచ్చు, అయ్యితే ఇప్పుడ ఈ క్రెడిట్ కార్డ్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకొందం.

  •  క్రెడిట్ కార్డు పొందానికి మీ కుబుంబ సభ్యుల్లో ఎవరికైనా ఒకరికి క్రెడిట్ కార్డు ఉంటే.. సప్లిమెంటరీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో ఇతరులు కూడా క్రెడిట్ కార్డు పొందొచ్చు.
  • బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ కలిగి ఉన్నా కూడా సులభంగానే క్రెడిట్ కార్డు పొందొచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌ ఎఫ్‌డీ మొత్తంలో 85 శాతం వరకు క్రెడిట్ లిమిట్ లభిస్తుంది. అయితే అన్ని బ్యాంకులు ఈ సేవలు అందించకపోవచ్చు.
  • ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తే ఈజీగానే క్రెడిట్ లభిస్తుంది. మిగతా ఉద్యోగులు కూడా క్రెడిట్ కార్డు పొందొచ్చు. అయితే ఎంఎన్‌సీ ఉద్యోగులకు పొందినంత సులువుగా అయితే పొందలేరు. కొన్ని బ్యాంకులు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి.

క్రెడిట్ కార్డ్ పొందడానికి ఒక్కో బ్యాంకు కి ఒక్కో రూల్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ అన్ని బ్యాంక్స్ ఒకే పద్ధతిలో ఇవ్వడం అనేది జరగదు, వేరు వేరు విధాలుగా ఉంటాయి.

మరి కొన్ని వివరాలు

  • క్రెడిట్ కార్డ్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు క్రెడిట్ కార్డు బ్రోకర్లతో టచ్‌లో ఉండండి.
  • మల్టిపుల్ కార్డులు ఉపయోగించొద్దు.
  • సిబిల్ స్కోరు చెక్ చేసుకుంటూ ఉండండి.
  • లగ్జరీ కొనుగోళ్లు చేయవద్దు. అవసరమైన ఖర్చులనే చేయండి.
  • బిల్లింగ్ సమాచారాన్ని చూసుకుంటూ ఉండండి.

క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ | Credit Card Bill Payment In Telugu

అత్యవసరంగా డబ్బులు కావాలంటే క్రెడిట్ కార్డు అవసరం ఎంతో ఉంటుంది. క్రెడిట్ కార్డు బిల్లును నిర్దిష్ట గడువులోగా చెల్లిస్తే ఎలాంటి నష్టం ఉండదు. కానీ గడువు దాటితే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అంటే చెల్లింపులు ఎక్కువగా చేయవలసి ఉంటుంది.

గడువు దాటితే ముప్పై శాతం నుండి నలభై శాతం వరకు వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. ట్రాన్సాక్షన్స పైన వడ్డీ లేని సమయాన్ని రద్దు చేయవచ్చు కూడా అందుకే క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించాలి. ఎవరైనా మరిచిపోయే అవకాశం ఉంటే వారికి ఈఎంఐ సౌకర్యాన్ని కూడా కల్పించే సంస్థలు ఉన్నాయి.

క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ అనేది ఒక్కో బ్యాంకు కి ఒక్కో రకంగా బిల్ పేమెంట్ అనేది ఉంటది. అన్ని బిల్ పేమెంట్స్ అనేవి ఒకేవిధంగా అనేవి ఉండవు. బిల్ పేమెంట్స్ చేయడానికి బ్యాంక్స్ వారు కొంత సమయనo  ఇవ్వడం జరుగుతుంది.

క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నెంబర్ | Credit Card Customer Care Number

Axis Bank Customer Care Number :- 1860 500 5555.

HDFC Bank Customer Care Number :-1860 267 6161.

SBI Bank Customer Care Number :- 080-26599990.

ICICI Bank Customer Care Number :- 1860 120 7777.

Union Bank Customer Care Number :- 080 6181 7110.

ఇవి కూడా చదవండి :-