Disco raja Collection – మొదటి రోజు ఎంత రాబట్టాడో తెలుస్తే షాక్ అంతే ..!

0

ఆంధ్ర ప్రేక్షకులలో మాస్ మహారాజ గా పేరు తెచ్చుకున్న రవితేజ మరియు విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విఐ ఆనంద్ కాంబో చిత్రం డిస్కో రాజా. డిస్కో రాజా చిత్రం మొదటి టీజర్ విడుదల తోనే ప్రత్యేకమైన ఎంటర్ టైనర్ గా పేరుతెచ్చుకుంది. అంతేకాకుండా ఈ చిత్రంలో కథ కథనం అంతా కొత్త గా ఉండడం వల్ల ప్రేక్షకులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు.

ప్రేక్షకుల ఆశలను నిజం చేస్తూ ఈ చిత్రం జనవరి 24 వ తేదీ శుక్రవారం విడుదలైన మొదటి రోజునే బ్రహ్మాండమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇప్పటికే బరిలో ఉన్న సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు మరియు బన్నీ నటించిన అల వైకుంఠ పురం లో చిత్రాల బాక్స్ ఆఫీస్ లో జోరుగా ముందుకు సాగిపోతున్న తరుణంలో డిస్కో రాజా విడుదలైంది.

విడుదలైన మొదటి రోజు ప్రేక్షకుల నుండి రవితేజ యాక్టింగ్ కొత్త లుక్ మొదలైన అంశాలతో సినిమా మొత్తం హాలీవుడ్ తరహాలో ఉన్నదని బాగా ప్రచారం జరిగిపోయింది. సినిమా బాగా కిక్ ఇస్తుందని ప్రేక్షకుల నుండి అభినందనలు అందుకుంటున్నది.

Disco raja collection day 1 :

discoraja మొదటి రోజు కలెక్షన్స్ ఓ సారి చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ను బాగా ఊపు ఇస్తున్న ఈ చిత్రం 3.2 కోట్ల నుంచి 3.5 కోట్ల రేంజ్లో వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు, సినీ మార్కెట్ నిపుణులు తెలియజేశారు. ఇప్పటికే ఆఫ్లైన్లో అమ్ముడుపోయిన టికెట్లను కూడా కలుపుకుంటే దాదాపు 3.8 కోట్ల రేంజ్లో ముందుకు సాగిపోతున్నది. కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది సినిమా వర్గాలు అంచనాకు వచ్చాయి.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఓవరాల్ గా చూసుకుంటే 4.2 కోట్ల నుండి 4.5 కోట్ల వరకు రాబడి సాధించినట్లు సమాచారం తెలుస్తోంది. ఇక డిస్కోరాజా మొదటి రోజు రాబట్టిన కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే.

నైజాంలో1.08 కోట్లు,
సీడెడ్36 లక్షలు
ఉత్తరాంధ్ర31 లక్షలు
ఈస్ట్ 19 లక్షలు
వెస్ట్ 15 లక్షలు
గుంటూరు
17 లక్షలు
కృష్ణా18 లక్షలు
నెల్లూరు10 లక్షలు

ఈ లెక్కన మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుంటే 2.54 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.