రూపాయి బలం కోసం ఆర్బీఐ టానిక్

0

కరోనా వైరస్ లాంటి భయంకరమైన అంటువ్యాధుల వల్ల ప్రపంచవ్యాప్తంగా కలిగిన ఒత్తిడి మూలంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్న స్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి ఆర్థిక వ్యవస్థలో చర్యలు తీసుకునే విధంగా మీడియా సమక్షంలో ప్రకటించాడు. అందులో భాగంగా ఆర్థిక మందగమనం ని తగ్గించే టట్లుగా liquidity పెంచాడు. మరియు క్యాష్ ఫ్లో కు సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చాడు.

నేషనల్ హౌసింగ్ బ్యాంక్, నాబార్డ్, sidbi వంటి పెద్ద పెద్ద ఆర్థిక సంస్థలకు 50 వేల కోట్లకు రీ ఫైనాన్సింగ్ window, రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లకు మార్చి కొన్ని చర్యలు తీసుకున్నది ఆర్బీఐ. శక్తికాంత్ దాస్ మీడియా సమావేశం జరుగుతున్నట్లు గానే sensex 1000 పాయింట్లకు పైగా పెరిగి ప్రస్తుతానికి 563 పాయింట్లు లాభానికి చేరుకున్నది. ఇక నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో9149వద్ద 9200 స్థాయికి దిగువకు చేరింది.

పై విధంగా కరోనా వైరస్ దెబ్బకు అల్లకల్లోలమైన రూపాయి పరిస్థితి , డాలర్ మారకంలో 45 పైసలు పెరిగింది. 76.59 వద్ద ప్రారంభమైన రూపాయి ఆర్.బి.ఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియా సమావేశం తర్వాత మరింత ముందుకు పరుగుపెట్టి 76.42 కు చేరుకున్నది. గురువారం నాటికి అమెరికా డాలర్ తో పోలిస్తే మన రూపాయి 76.87 స్థాయి దగ్గర స్థిరపడింది. రూపాయి బలం కోసం ఆర్బీఐ తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని ప్రముఖ వ్యాపార వేత్తలు వారి అభిప్రాయాలు తెలియజేశారు. ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి.