ఇలాంటి వారికి నిద్ర లోనే ప్రాణం పోతుంది

0
Double chin health issues in telugu
Double chin health issues in telugu

Double chin health issues in telugu

డబల్ చిన్ అంటే ఏమిటి? ఇది ఎందుకు ప్రమాదం?

కొంతమంది బరువు పెరిగే టప్పుడు పొట్ట, తొడలు, చేతుల తో పాటు గొంతు కింద కూడా కండ భాగం పెరుగుదల అధికంగా ఉంటుంది. దీనినే డబల్ చిన్ అంటారు. ఒక్కోసారి ఇది విపరీతంగా పెరిగి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. శరీరంలో పొట్ట, తొడలు, మరియు సీట్ భాగంలో పెరిగే కొవ్వు కంటే గడ్డం కింది భాగంలో పెరిగే కొవ్వు చాలా ప్రమాదకరం.

దీనివల్ల రిస్క్ అనేది విపరీతంగా ఉంటుంది. ఎంత రిస్క్ ఉంటే గొంతు కింది భాగంలో కొవ్వు పేరుకోవడం వల్ల గాలి గొట్టం మీద ప్రెజర్ పెరిగిపోయి ఊపిరి ఆగి పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలాగంటే గాలి ప్రయాణం చేసే windpipe మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి గడ్డం కింది భాగంలో కొవ్వు పేరుకోవడం మంచిది కాదు.

దీని నుంచి ముఖ్యంగా మరొక సమస్య ఏమిటంటే ఇలాంటి వాళ్ళు పడుకున్నప్పుడు గురక ఎక్కువ శబ్దం తో వస్తుంది. గొంతు కింది భాగంలో కొవ్వు అధికంగా పేర్కొని పోయినప్పుడు దీని భారమంతా గొంతులోని గాలి గొట్టాలు మీద ఆధారపడి గొంతులో సరఫరా కష్టం గా మారిపోతుంది. అందుకు గాలి సరఫరాలో కొండ నాలుక మీద ఒత్తిడి పెరిగి పెద్ద శబ్దంతో గాలి బయటకు వస్తుంది. అంటే విపరీతమైన శబ్దంతో గురక ఉత్పత్తి అవుతుంది.

నిద్దట్లో ఉలిక్కిపడి లేచే సమస్య ఇలాంటి వారికి అధికంగా ఉంటుంది. ఈ సెకండ్ చిన్ ఉన్న వాళ్ళు రోజూ నిద్ర పోయే ముందు ఆల్కహాల్ తీసుకొని పడుకునే అలవాటు కనుక ఉంటే అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఎలాంటి అనుమానం లేకుండా ప్రాణం పోగొట్టుకుంటారు. నిద్ర పట్టక మానసిక ఒత్తిడితో మందు బిల్లలు కూడా ఉపయోగించుకునే వారు ఉన్నారు.

పొరపాటున నిద్ర కోసం ఏవైనా మందులు తీసుకుంటూ ఉంటే, నిద్ర మధ్యలో ఆక్సిజన్ అందక ఉలిక్కి పడి లేచే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నిద్ర మాత్రలు తీసుకుని ఉంటారో అలాంటప్పుడు, ఊపిరాడక నిద్ర లేవాల్సి న పరిస్థితుల్లో మందుల ప్రభావం వల్ల ఆ వ్యక్తి నిద్రనుండి లేవలేక పోతాడు. దీనివల్ల ప్రాణం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. కాబట్టి ప్రాణం మీదకు తెచ్చుకుంటారు.

ఇలాంటి ప్రమాదకరమైన సమస్య డబుల్ చిన్ వాళ్లకు అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ డబల్ చిన్ సమస్యతో బాధపడే వాళ్ళు తప్పకుండా ముఖ్యంగా ప్రాణాయామ పద్ధతులు పాటించాలి. ఉదయము సాయంత్రము తప్పకుండా ప్రాణయామం చేయాలి. ముఖ్యంగా గొంతు మరియు మెడకు సంబంధించిన సాధారణ ఎక్సర్సైజులు ప్రతిరోజు చేయవలసి ఉంటుంది.

ఇది మీకు తెలుసా :-  పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు ని కాకరకాయతో ఇలా కరిగించండి

ఈ డబల్ చిన్ సమస్యతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు కళ్ళు మూసుకుని మెడను కుడివైపుకు – ఎడమవైపుకు, ముందుకు – వెనకకు ఒక క్రమపద్ధతిలో ఆడిస్తూ సాధన చేయాలి. దీనివల్ల చాలా వరకూ గొంతు కింది భాగంలో పేరుకున్న కొవ్వు క్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది.

గొంతు కింది భాగంలో అధికంగా పేరుకున్న కొవ్వు భాగం వల్ల అక్కడ చర్మం వేలాడకుండా ఈ ఎక్సర్సైజులు వల్ల మజిల్ స్టిఫ్ గా తయారవుతుంది. కాబట్టి ఉదయం పూట 20 నిమిషాల సేపు మరియు సాయంకాలం కూడా 20 నిమిషాల సేపు వీటిని సాధన చేయడం వల్ల గొంతు కింది భాగంలో కొవ్వు కణజాలాలు తగ్గిపోతాయి.

Double chin exercises

కళ్లు మూసుకుని ప్రతిరోజు మీకు వీలైనన్నిసార్లు తలను గుండ్రంగా క్లాక్ వైస్ సవ్య దిశలోనూ మరియు యాంటీక్లాక్ వైస్ అపసవ్య దిశలో నిదానంగా తిప్పడం సాధన చేయాలి. మొత్తం గా ఇక్కడ తెలియజేసిన ఐదు రకాల ఎక్సర్ సైజులను ప్రతిరోజూ క్రమం తప్పకుండా మీరు చేసుకుంటే, మీరు గొంతు కింది భాగంలో అనవసరంగా పెరిగిపోయిన కొవ్వు కరిగి పోయే ప్రమాదం నుంచి కాపాడబడతారు. అంటే ఈ డబల్ చిన్ అనే సమస్య నుండి బయట పడతారు.

ప్రతిరోజు మీరు ఈ ఎక్సర్సైజులు పూర్తి చేసిన తర్వాత ప్రాణాయామం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రాణాయామం చేసేటపుడు గాలిని వేగంగా తీసుకుని, వేగంగా వదలడం వల్ల గొంతు కింది భాగంలో కదలికలు బాగా జరిగి కొద్ది రోజులకే మార్పును గమనిస్తారు.

ముఖ్యంగా double chin ఉన్నవాళ్లు కపాలభాతి ప్రాణాయామం మరియు భస్త్రిక ప్రాణాయామం తో పాటు సూర్యనాడి ప్రాణాయామాలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు భస్త్రిక ప్రాణాయామం చేసేటపుడు నెక్ మూమెంట్ తో పాటు గాలిని బలంగా లోపలికి పీల్చటం మరియు వదలడం ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేస్తే అతి తక్కువ కాలంలోనే గొంతుకింద అధికంగా పెరిగిన కొవ్వు భాగమంతా తగ్గిపోతుంది.

డబల్ చిన్ డైట్

ఈ ప్రాణాయామ మరియు ఎక్సర్సైజులు తో పాటు ఉదయం పూట తీసుకునే ఆహారంలో మార్పులు చేపట్టాలి. అంటే ఉదయం పూట వెజిటబుల్ సలాడ్ తో పాటు మొలకెత్తిన గింజలు ఆహారంగా తీసుకోవాలి. ఈ మొలకెత్తిన గింజలు లోకి మిరియాల పొడి లేదా కొద్దిగా మసాలా పొడి కలుపుకుని ఆహారంగా తీసుకోవాలి. ఈ ఆహారాన్ని ఫ్యాట్ బర్నింగ్ డైట్ అని కూడా అంటారు.

ఇది కూడా చదవండి :-  నరాల బలహీనత తగ్గడానికి ఇలా చేస్తే జన్మలో ఇక రాదు