ఆదార్ నెంబర్ తెలియదా ? అయితే ఇలా డౌన్లోడ్ చేసుకోండి.

0

How to download aadhaar card in telugu 2022

మొదటగా ఆధార్ నెంబర్ ద్వారా ఆధార్ కార్డు ను ఆన్లైన్ లో eAadhar పేరుతో డౌన్లోడ్ చేసి ఇ-ప్రింట్ తీయాలనుకుంటే ప్రతి ఒక్కరూ ఈ క్రింది విధంగా స్టెప్ బై స్టెప్ తప్పకుండా అనుసరించాలి.

స్టెప్1: ఆధార్ అధికారిక వెబ్సైట్ https://uidai.gov.in/ ని సందర్శించండి.
స్టెప్2: ఇప్పుడు Get Aadhaar ఆప్షన్ లో “download aadhar ” ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లేదా https://eaadhaar.uidai.gov.in/ లింకును సందర్శించండి.
స్టెప్3:  I have కింద ఉన్న ” Aadhaar Number ” ను సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్4: ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి . ఇక్కడ మీ ఆధార్ నెంబర్ యొక్క పూర్తి అంకెలను ఇతరులకు చూపించకూడదు అనుకుంటే masked aadhar ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.
స్టెప్5: ఇప్పుడు క్యాప్చర్ వెరిఫికేషన్ కోడ్ ను ఎంటర్ చేసి ” Send OTP ” అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి.

స్టెప్6: ఇప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వన్ టైం పాస్ వర్డ్ అందుతుంది దీన్ని ఆ OTP స్థానంలో ఎంటర్ చేయండి.
స్టెప్7: ఇప్పుడు మీరు కోరుకున్న eAadhaar కార్డును download చేయడానికి వివరాలు పూర్తి చేసి ” Confirm and Download “అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

Download aadhar card by virtual id :

ఆన్లైన్లో వర్చువల్ ఐడి ని ఉపయోగించి ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడానికి క్రింద పేర్కొన్న విధంగా ప్రాసెస్ ను స్టెప్ బై స్టెప్ అనుసరించాలి.

స్టెప్1: UIDAI యొక్క ఆన్లైన్ పోర్టల్ ను సందర్శించండి.
స్టెప్2: ఇప్పుడు “download aadhar” ను క్లిక్ చేయండి .

స్టెప్3: ” I Have ” విభాగం నుండి Virtual ID (VID) ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.
స్టెప్4: మీ వర్చువల్ ఐడి పూర్తి పేరు, పిన్ కోడ్, మరియు సెక్యూరిటీకోడ్ ను ఎంటర్ చేయండి.
స్టెప్5: ఇప్పుడు మన మొబైల్ కు ఓటిపి రావడం కోసం ” Send OTP ” ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
స్టెప్6: ఇందులో ప్రత్యామ్నాయంగా మీరు మీ రిక్వెస్ట్ ను నిర్ధారించుకోవడానికి ఓ టి పి ని ఉపయోగించుకోవచ్చు.
స్టెప్7: ఇక eAadhar మీ సిస్టమ్ కు లేదా మొబైల్ కు డౌన్ లోడ్ చేయబడుతుంది.
దశ8: మీరు ఆధార్ కార్డ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయడం ద్వారా దాన్ని యాక్సెస్ చేయవచ్చు.
స్టెప్9: PDF ఫైళ్లను తెరవడానికి ఎనిమిది అంకెల పాస్వర్డ్ను ఎంటర్ చేయండి.
ఈ ఎనిమిది అంకెల లో మీ పేరు యొక్క “మొదటి నాలుగు క్యాపిటల్స్ అక్షరాలు” మరియు ” పుట్టిన సంవత్సరం నాలుగంకెలు” గా ఉంటాయి.

Download aadhar card by enrolment id :

ఒకవేళ మీకు ఇంకా మీ Aadhar card రాకపోతే లేదా మీ ఆధార్ నెంబర్ ని మర్చిపోయి ఉంటే మీరు ఇప్పుడే ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ (EID) ఎంటర్ చేసి మీ ఇ- ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. EID ద్వారా ఈ ఆధార్ కార్డు డౌన్లోడ్ కోసం క్రింద ఇచ్చిన ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అనుసరించాలి.

స్టెప్ 1: www.uidai.gov.in ని సందర్శించండి.
స్టెప్2: ఇప్పుడు Get Aadhaar ఆప్షన్ లో “download aadhar ” ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3: ఇందులో https://eaadhaar. uidai.gov.in/ సైట్కు వెళ్లడం జరుగుతుంది.
స్టెప్4: ఇప్పుడు మీ 14 అంకెల EID సంఖ్య మరియు 14 అంకెల సమయం మరియు తేదీ లను ఎంటర్ చేయండి.
స్టెప్ 5: మీ పూర్తి పేరు పిన్ కోడ్ ఇమేజ్ captcha code లను ఎంటర్ చేయండి.
స్టెప్ 6: ఓటిపి రావడం కోసం ” Request OTP ” మీద క్లిక్ చేయండి .
స్టెప్7:” Confirm ” ను నొక్కండి.
స్టెప్ 8: మీరు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ లో ఓటీపీ ని రిసీవ్ చేసుకుంటారు.
స్టెప్ 9: ఓటిపి ఎంటర్ చేసి ” Download Aadhar ” క్లిక్ చేయండి.
అంతే aadhaar card download అవుతుంది.

Download Aadhar by Date of birth and Name :

ఒకవేళ మీకు మీ ఆధార్ నెంబర్ లేదా ఇఐడి( EID) గుర్తు లేకపోతే మీ పేరు మరియు పుట్టిన తేదీ ఎంటర్ చేసి మీరు ఇ- ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ పద్ధతిలో ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం కోసం ఈ క్రింది విధంగా ఫాలో కావాలి.


స్టెప్1: ఆధార్ వెబ్సైట్ https://resident.uidai.gov.in/find- uid-eid ని సందర్శించండి.
2: మీ పూర్తి పేరు మరియు మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ మరియు సెక్యూరిటీ కోడ్ను ఎంటర్ చేయండి.
3: ఈ దశలో “సెండ్ ఓటిపి ” క్లిక్ చేయండి.
4: మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అందుకున్న ఓటిపి ఎంటర్ చేసి “confirm ఓటీపీ ” క్లిక్ చేయండి.
5: ఇప్పుడు వెంటనే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు మీ యొక్క ఆధార్ నెంబర్ పంపబడుతుంది అనే మెసేజ్ కనిపిస్తుంది.
6: మీ మొబైల్ లో ఆధార్ నమోదు సంఖ్యను పొందిన తర్వాత అధికారిక యుఐడిఎఐ వెబ్సైట్లోని ఇ- ఆధార్ పేజీని సందర్శించండి.
7: “నాకు ఆధారం ఉంది” అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
8: ఆధార్ నమోదు సంఖ్య పూర్తి పేరు పిన్ కోడ్ ఇమేజ్ కోడ్ ను ఎంటర్ చేయండి.
9: “రిక్వెస్ట్ ఓటీపీ” మీద క్లిక్ చేయండి.
10: మీ మొబైల్ నెంబర్ కు ఓటిపి పంపించబడుతుంది ఓటిపి ఎంటర్ చేసి ఇ- ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడానికి “డౌన్లోడ్ ఆధార్” ను క్లిక్ చేయండి.
ఇక ఇప్పుడు ఆధార్ కార్డు డౌన్లోడ్ అవుతుంది.

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎంతో అట్టహాసంగా ప్రచారం చేసి అమలులోకి తీసుకు వచ్చిన డిజి లాకర్ ఖాతా గురించి తెలిసే ఉంటుంది.డిజి లాకర్ ఖాతాను ఆధార్ తో లింక్ చేయడం పై కార్డుదారులకు అందుబాటులో ఉంచడానికి డిజి లాకర్ సంస్థ ఆధార్ సంస్థ అయిన యుఐడిఎఐ తో సహకరించింది.

Digi Locker : అంటే డిజిటల్ రూపంలో ముఖ్యమైన పత్రాలు మరియు సర్టిఫికెట్స్ వీటిని నిల్వ చేయడం మరియు ఇవ్వడం, భాగస్వామ్యం మరియు కన్ఫామ్ కోసం క్లౌడ్- ఆధారిత వేదిక. ఇది భారత దేశ పౌరులకు కేటాయించిన డిజిటల్ లాకర్ లో ఎలక్ట్రానిక్ లేదా ఇ- కాపీలను అందించడానికి ఎంపిక చేసుకున్న రిజిస్టర్డ్ సంస్థకు అనుమతిని ఇస్తుంది.

Download aadhar card by digilocker :

డిజి లాకర్ ఖాతా నుండి ఆధార్ డౌన్లోడ్ చేయడానికి క్రింద తెలిపిన విధంగా అనుసరించండి.
1: మీ డిజి లాకర్ ఖాతాకు లాగిన్ అవ్వండి https://digilocker.gov.in/
2: సైన్ ఇన్ బటన్ పైన క్లిక్ చేసి మీ 12 అంకెల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి.
3: ఓటిపి పొందడం కోసం “confirm” మీద క్లిక్ చేయండి.
4: ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయండి.
5: “confirm OTP” మీద క్లిక్ చేయండి.
6: “Issued document” అనే పేజీ కనిపిస్తుంది.
సేవ్ సింబల్ ఉపయోగించి ఇ- ఆధార్ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడు మీ aadhaar card download అవుతుంది.

download masked aadhaar card :

దీన్ని masked aadhaar అని కూడా అంటారు.ఇది చూడ్డానికి సాధారణ ఆధార్ కార్డు మాదిరిగానే ఉంటుంది. అయితే ఈ రెండింటికీ తేడా ఏమిటంటే ఈ ముసుగు ఆధార్ కార్డు లో మీ ఆధార్ సంఖ్య పాక్షికంగా దాచిపెడుతుంది. మరియు మీ ఆధార్ సంఖ్య యొక్క కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఇది మీ ఆధార్ నెంబర్ ను ఇతరులకు వెల్లడించకుండా రక్షించడం కోసం ఇలా రూపొందించారు. ఈ masked aadhaar కూడా మీ సాధారణ ఇ- ఆధార్ కార్డు వలె చెల్లుబాటు అవుతుంది.

ఇప్పుడు ముసుగు ఆధార్ కార్డును డౌన్లోడ్ చేయడానికి క్రింద పేర్కొన్న విధంగా ఒక్కొక్కటిగా అనుసరించండి.


1: ఆధార్ వెబ్సైట్ అయిన https://eaadhaar.uidai.gov.in/ లింక్ మీద క్లిక్ చేయండి.
2: “మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయండి” అనే విభాగంలో మీ యొక్క ఆధార్ వి ఐ డి లేదా నమోదు సంఖ్య ఎంపిక చేసుకోండి.
3: select your preparence అనే విభాగంలో “ముసుగు ఆధార్” ను ఎంచుకోండి.
మరియు మీ ఆధార్ సంఖ్య, పూర్తి పేరు, పిన్కోడ్ మరియు సెక్యూరిటీ కోడ్ వంటి ఇతర వివరాలను ఎంటర్ చేయండి.
4: UIDAI తో లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ కు ఓటిపి పంపడం కోసం “Request OTP” మీద క్లిక్ చేయండి.
5: మీ వ్యక్తిగత వివరాలను ఉపయోగించి authentication కోసం UIDAI కి పర్మిషన్ ఇవ్వడానికి “I agree” అనే బటన్ మీద క్లిక్ చేయండి.
6: మీ మొబైల్ నెంబర్ కు OTP పంపడం కోసం “confirm” అనే బటన్ మీద క్లిక్ చేయండి.
7: masked ఆధార్ కార్డును డౌన్లోడ్ చేయడానికి ఓటిపి ఎంటర్ చేసి “డౌన్లోడ్ ఆధార్” పైన క్లిక్ చేయండి.
ఇప్పుడు ముసుగు ఆధార్ కార్డు డౌన్లోడ్ అవుతుంది.

Download aadhar without mobile number 2020

రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండా మీరు మీ ఆధార్ కార్డు ఆన్లైన్ లో పొందడానికి వీలు లేదు.
అయితే మొబైల్ నెంబర్ లేకుండానే ఆధార్ కార్డు పొందడానికి మీరు కింద పేర్కొన్న విధంగా దశలను అనుసరించి ఆధార్ను పొందవచ్చు.
1: మీ ఆధార్ నెంబర్తో సమీప ఆధార్ కేంద్రాన్ని సందర్శించండి.
2: మీ యెుక్క బొటనవేలు కన్ఫర్మ్, రెటీనా స్కాన్, మొదలైన అవసరమైన బయోమెట్రిక్ వివరాలు వారికి అందించండి.
3:పాన్ మరియు గుర్తింపు కార్డు ఇలాంటి ఇతర ID proofs తీసుకువెళ్లి చూపండి.
4: ఆధార్ కేంద్రంలో సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డు ప్రింట్ అవుట్ ఇస్తాడు. ఇందుకోసం సాధారణ పేపర్ ఫారం కు 50 రూపాయలు వసూలు చేస్తారు. పివిసి వెర్షన్ లో ఉన్న ఆధార్ కార్డు కు నూరు రూపాయలు వసూలు చేస్తారు.

Download aadhar with umang app 

ఉమాంగ్ యాప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడానికి దరఖాస్తుదారులు క్రింద పేర్కొన్న సాధారణ విధానాలు ఫాలో కావాలి.
స్టెప్ 1: ఉమంగ్ యాప్ ని డౌన్లోడ్ చేసి తెరవండి.
స్టెప్ 2: “All services” అనే టాబ్ కింద ఆధార్ కార్డు మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3: డిజి లాకర్ నుండి “view ఆధార్ కార్డు” మీద క్లిక్ చేయండి.
స్టెప్ 4: మీ డిజి లాకర్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.
స్టెప్ 5: మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అందుకున్న ఓటీపీ ఎంటర్ చేయండి.
స్టెప్ 6: confirm OTP మీద క్లిక్ చేయండి.
స్టెప్ 7:ఇప్పుడు మీరు Down load పై క్లిక్ చేయడం ద్వారా మీ ఆధార్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

How to Know Your Aadhaar Number on Mobile 


మీ మొబైల్ ఫోన్ ద్వారా మీ ఆధార్ నెంబర్ను తెలుసుకోవాలంటే ఈ క్రింది దశలను అనుసరించాలి.


1: UIDAI యొక్క అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. https://resident. uidai.gov.in/get-aadhaar
దశ2:మీ 14 అంకెల EID మరియు మీ రసీదు స్లిప్పు లో పేర్కొన్న నమోదు తేదీ మరియు సమయాన్ని కూడా ఎంటర్ చేయండి.
3: మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చేయండి.
4: ఇప్పుడు ఓటిపి పంపండి అనే బటన్ మీద క్లిక్ చేయండి.
5: మీరు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఆరు అంకెల ఓటీపీ అందుకుంటారు.
7: ఇప్పుడు మీరు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ లోని ఆధార్ నెంబర్ను text SMS గా స్వీకరిస్తారు.
—————————————————————————————

ఆధార్ కార్డు డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ప్రింట్ ఎలా తీసుకోవాలి?

డౌన్ లోడ్ అయిన ఆధార్ కార్డు ప్రింట్ తీసుకోవడానికి ముందుగా ఎనిమిది అంకెల పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి.
ఈ పాస్ వర్డ్ లో మీ పేరు యొక్క మొదటి నాలుగు క్యాపిటల్స్ అక్షరాలు మరియు మీరు పుట్టిన సంవత్సరం ఉంటాయి.
మీరు యుఐడిఎఐ యొక్క వెబ్ సైట్ నుండి మీ ఆధార్ కార్డును పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు మీ ఆధార్ కార్డు ను ఆన్లైన్ లో ప్రింట్ తీసుకోవచ్చు.