ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఔట్:-

0

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాజకీయంగా క్రింది స్థాయిలో కూడా తమ పార్టీ మరింత బలం కావడం కోసం స్థానిక సంస్థల ఎన్నికలను మొదటి నుంచి కూడా ఒక పండుగలాగా భావించింది. అయితే జగన్ ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల కమిషన్ అధికారి రమేష్ కుమార్ వాయిదా వేయడంతో తో వాడివేడిగా చర్చలు జరిగాయి. చివరకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కు కూడా వెళ్ళింది. అప్పుడు ఎన్నికల కమిషనర్ క రోనా వైరస్ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో తనకున్న ప్రత్యేక అధికారాలను వినియోగించి ఈ ఎన్నికలను వాయిదా వేసినట్లు వివరణ ఇచ్చుకున్నాడు. అంతే సుప్రీం కోర్టు కూడా వాయిదా కు ఓకే చెప్పింది.

అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ రమేష్ రావు మీద నివురుగప్పిన నిప్పులా చెలరేగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ విషయం గురించి ఎన్నికల అధికారి రమేష్ కుమార్ తనకు ప్రాణహాని ఉందని సెక్యూరిటీ పెంచాలని కోరుతూ, తర్వాత తను ఏపీలో ఉండలేనని హైదరాబాదుకు వచ్చి తలదాచుకున్నాడు. రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మొదలైన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మీద నీళ్లు చల్లినట్లు అయ్యింది. ఈ పరిస్థితులు అన్నింటినీ జీర్ణం చేసుకోలేని రాష్ట్రప్రభుత్వం రమేష్ కుమార్ కు వీడ్కోలు చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనలకు సంబంధించిన మార్పులకు ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదం తెలపడంతో ఏపీ ప్రభుత్వం ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జీవో జారీ చేసింది. ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక అధికారంతో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఈ జీవోను జారీ చేసింది. కానీ ప్రభుత్వం ఈ రెండు జీవోలను రహస్యం గా ఉంచింది.

You may like this links:

1.Top 10 Movie Download Sites 2020

2.Top 10 Telugu Movies 2019 – తప్పక చూడాల్సిన సినిమాలు