EMI, CREDIT CARD పేమెంట్స్ 3 నెలలు కట్టాల్సిన పనిలేదు – RBI గుడ్ న్యూస్

0
emi moratorium in telugu

Emi Moratorium in Telugu : RBI గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడిన సమావేశం వివరాలు స్వయంగా RBI ట్విట్టర్లో తెలియజేసింది. COVID -19 దెబ్బకు సామాన్య జనానికి ప్రాథమిక సౌకర్యాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం 1.70 లక్షల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఇంకా 24 గంటలు కాకముందే, శక్తి కాంత దాస్ యొక్క ప్రెస్ మీట్ కు బాగా ప్రచారం వచ్చింది.

ఎందుకంటే భారతదేశం మొత్తం ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంలో ఉండడంవల్ల ఎవరూ ఏ పని కి వెళ్లక పోవడం వల్ల ప్రతి సామాన్య వ్యక్తి తాను చెల్లించాల్సిన నెలవారీ పేమెంట్ పైన గురించి మాట్లాడుతాడు అని ఊహాగానాలు ముందుగానే రేకెత్తించాయి. ప్రజలందరూ ఊహించినట్లుగానే EMI లు క్రెడిట్ కార్డు చెల్లింపులను దాదాపు మూడు నెలల పాటు వాయిదా వేస్తూ భారీగా సడలింపు ఇచ్చారు. కరోనా దెబ్బకు చెల్లింపులు చేయలేక దుకాణాలు మూసి వేసుకున్న వ్యాపారస్తులు తాము తీసుకున్న లోన్లు కట్టలేమని చేతులు ఎత్తి వేయడం జరిగింది.

కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న రంగాలు :-

టూరిజం, ఆతిథ్య రంగాలు, రియల్ ఎస్టేట్ లాంటి పెద్ద పెద్ద వ్యాపారాలు దీని దెబ్బకు కుప్పకూలిపోయాయి. ఎన్నో పరిశ్రమలు మూత వేయడంతో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ సిచువేషన్ లో ఉండడం వల్ల ఏ వ్యక్తి కూడా తాము తీసుకున్న లోన్లు, పర్సనల్ లోన్ లు, హోమ్ లోన్ లు వెహికల్ లోన్లను, ఇలాంటి వాళ్లు చెల్లించలేని పరిస్థితిలో ఉండడంవల్ల శక్తికాంత దాస్ ఈ ప్రకటన చేయడం ఎంతోమందికి ఊపిరిపీల్చుకున్నట్లు అయింది.

ప్రతిక్షణం మన తెలుగు వారి “తెలుగు న్యూస్ పోర్టల్ వెబ్సైట్” మీకోసం బ్రేకింగ్ న్యూస్ అందజేస్తూ ఉంటుంది