EMI గురించి డౌట్స్ :
★ కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా RBI వారు EMI ల చెల్లింపుల మీద మూడు నెలల మారటోరియం విధించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది.
★ మనదేశంలో చాలావరకు EMI లు ప్రతినెలా మొదటివారంలో ఆటోమేటిక్ గా కస్టమర్ బ్యాంక్ అకౌంట్ నుండి కట్ అవుతుంటాయి. కస్టమర్ లు అందరూ ఈ EMI లను గుర్తు ఉంచుకొని తమ అకౌంట్లో క్యాష్ బ్యాలెన్స్ గా ఉంచుకుంటారు.
★ అయితే, RBI మారటోరియం నేపథ్యంలో system software లో మూడు నెలల మారటోరియం ను lock చేశామని, దీనితో ఆటోమేటిక్ గా EMI నిలిచిపోతుందని SBI తెలిపింది.
అంతేగాని… మారటోరియం అమలు చేయమని ప్రత్యేకంగా ఏ బ్యాంక్ కి లెటర్ పంపాల్సిన అవసరం లేదు అని తెలిపింది.
★ ఒకవేళ EMI కట్ అయితే…(కట్ కాకూడదని మీరు అనుకుంటే )… ఆందోళన పడాల్సిన పని లేదని…మీకు వచ్చిన సదరు మినహాయింపు మొబైల్ మెసేజ్ ని కస్టమర్ యొక్క బ్యాంక్ బ్రాంచ్ కు మెయిల్ చేసినా లేదా స్వయంగా సంప్రదించి వివరాలు తెలిపి, తిరిగి మన అకౌంట్ లో ఆ సొమ్ము జమ కాగలదని SBI వెల్లడించింది.
ఒకవేళ EMI ల వాయిదా వద్దు అని ఎవరైనా అనుకుంటే:
★ ఎవరైనా లోన్ తీసుకున్న ఖాతాదారులు మూడు నెలల మారటోరియం వద్దనుకుంటే మాత్రం… ఖాతాదారులే స్వయంగా కానీ లేదా మెయిల్ ద్వారా కానీ మాకు మారటోరియం వర్తింపజేయవద్దు అంటూ… సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించాలి.
★ ఉదా : బ్యాంకు ఖాతా SBI లో ఉండి లోన్ HDFC లో ఉన్న ప్పుడు…. ECS (Electronic clearing services) ద్వారా EMI కట్ అయ్యే సందర్భాలలో
★ బ్యాంక్ అకౌంట్ SBI లో ఉండి … వాహన /గృహ /వ్యక్తిగత ఋణం HDFC లో ఉన్న సందర్భాలలో మీరు కింది విధంగా చేయాలి.
★ EMI లు ECS ద్వారా కట్ అయ్యేది SBI లోనే కనుక…… కస్టమర్లు మారటోరియం ఆప్షన్ ను ఎంచుకోవాలనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా కానీ, మెయిల్ ద్వారా కానీ సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించాలి.
★ అంతేగాని, బ్యాంకే స్వయంగా ECS ను నిలుపుదల చేసే నిర్ణయాన్ని తీసుకోబోదు.
★ కొసమెరుపు : ఎవరైనా కస్టమర్లు మాకు మూడు నెలల మారటోరియం వద్దు… ఒక నెల చాలు లేదా రెండు నెలలు చాలు.. అని అనుకున్నా సరే దానినే ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది.
💁🏻♂️ EMI చెల్లింపులపై బ్యాంకులు ఇస్తున్న ఆప్షన్లు ఇవే!
🛑 కెనరా బ్యాంకు– డిఫాల్ట్ ఆప్షన్ : డిమాండ్ పై మాత్రమే రిలీఫ్ ఉంటుంది.
EMI చెల్లింపును నిలిపివేయాలంటే SMS ద్వారా ‘NO’ అని పంపాల్సి ఉంటుంది.
🛑 IDFC ఫస్ట్ బ్యాంకు : డిమాండ్ పై మాత్రమే రిలీఫ్ ఉంటుంది.
– ఈమెయిల్ ద్వారా మారటోరియాన్ని కస్టమర్లు అడగవచ్చు.
🛑 PNB (పంజాబ్ నేషనల్ బ్యాంకు) : ఆటోమాటిక్ గా రిలీఫ్ పొందవచ్చు..
– ఒకవేళ చెల్లింపు కొనసాగించాలంటే బ్రాంచ్ కు వెళ్ళాల్సి ఉంటుంది.
🛑 SBI : ఆటోమాటిక్ గా రిలీఫ్ పొందవచ్చు..
– ఒకవేళ చెల్లింపు కొనసాగించాలంటే బ్రాంచ్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
🛑 HDFC : కస్టమర్ డిమాండ్‌పై మాత్రమే రిలీఫ్ పొందొచ్చు.
– ఈమెయిల్ ద్వారా కస్టమర్లు బ్యాంకును అడగవచ్చు.
🛑 ICICI బ్యాంకు : కొన్ని లోన్లపై డిమాండ్ రిలీఫ్ మాత్రమే
– ఈ విధానం ఎంపికల నిర్ణయంపై బ్యాంకులు పనిచేస్తున్నాయి.
🛑 IDBI బ్యాంకు : ఆటోమాటిక్ గా రిలీఫ్ పొందవచ్చు.
– బ్యాంకు వెబ్ సైట్ లేదా ఈమెయిల్ ద్వారా కస్టమర్లు సంప్రదించవలయును.
జనరల్ బ్రేకింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి “తెలుగు న్యూస్ పోర్టల్ వెబ్సైటు “