ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీ గురించి తెలుసా?

0

 

రష్మీ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం. రష్మీ పూర్తి పేరు రష్మి గౌతమ్. రష్మి గౌతమ్ ఒక సినీ నటి మరియు టీవీ యాంకర్  ఈటీవీ లో ప్రసారమౌతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో కి యాంకర్ గా వ్యవహరిస్తుంది. సినిమాల కన్నా క్రేజ్ టీవీ షోలకు సొంతం కామెడీ షో లు, రియాల్టీ షోలు, కు యువతలో చాలా అభిమానం ఉంది . ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో లో ఎంతో పేరు సంపాదించుకుంది  మన రష్మిగౌతమ్ తన కోసమే షో చూసే అభిమానులను సంపాదించుకుంది.మరి 2001లోనే ఇండస్ట్రీకి వచ్చిన రష్మి 2013లో గుర్తింపు వచ్చింది ఈ మధ్యలో రశ్మి ఏం చేసింది. ఎక్కడ పుట్టింది. ఎక్కడ పెరిగింది. కష్టాలను ఎదుర్కొంద ఆఫర్స్ ఎలా వచ్చాయో. రశ్మి కుటుంబానికి వస్తే తల్లి ఒడిషా రాష్ట్రంలోని వరాహం  పూర్ కి చెందింది.తండ్రి ఉత్తర ప్రదేశ్ కు చెందిన వాడు. రశ్మి విశాఖపట్టణం లో పుట్టి పెరిగింది. అయితే రష్మీ తల్లిదండ్రులు రష్మీ 12 సంవత్సరాలలో తల్లిదండ్రులు వివాదాలతో విడిపోయారు. రశ్మి తండ్రి ఈ మధ్యనే చనిపోయాడు.

రష్మీ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. పేరెంట్స్ విడిపోయిన తర్వాత రేష్మి  అమ్మ,తాతయ్య, అమ్మమ్మ దగ్గరే పెరిగింది. రష్మీ తో పాటు రశ్మి పిన్ని కుమారుడు,కుమార్తె కూడా, తాతయ్య ఇంట్లో పెరిగారు. తాతయ్య వీరందరినీ ఎంతో బాగా చూసుకున్నారు. చిన్నప్పటినుండి  చదువు అంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. రష్మీ కి ఎలాగో అలాగా సి బి ఎస్ సి లో పాఠశాలలోవిద్య పూర్తి చేసింది. తర్వాత కళాశాల చదువు దూరవిద్యలో చదివింది చిన్నప్పటినుండి స్కూల్కు వెళ్లి రాగానే స్పోర్ట్స్ ఎక్కువగా ఆడేది ఎక్కువగా ట్రావెల్ చేయడం ఇష్టం .ఎక్కువగా స్విమ్మింగ్ చేసేది,ఇంట్లో ఎవరి బర్త్డే అయినా  వేడుకలు తనే చేసేది.చిన్నప్పటినుండి సినిమా లోకి వెళ్లాలని చాలా ఉండేది అని అని చాలా సార్లు రష్మి చెప్పింది.ఇక చిన్నప్పటినుండి సినిమాల్లోకి రావాలన్నా ఆశ,2001లో ఒక్కతే హైదరాబాద్ కి వచ్చేసింది.అలా అవకాశాలను ఎదురు చూసింది.

2002లో  సవ్వడి అనే సినిమాతో ఆమె సినిమా కెరియర్ ప్రారంభమైంది .కానీ ఆ సినిమా విడుదల కాలేదు.తర్వాత ఉదయ్ కిరణ్ కథానాయకుడుగా నటించిన హోలీ సినిమా లో సహాయ పాత్ర నటించింది.ఇందులో సునీల్ కు జోడిగా నటించింది. తర్వాత యువ అనే సీరియల్ లో నటించింది.2010లోతెలుగులో వచ్చిన ప్రస్థానం చిత్రంలో రశ్మి సహాయ నటిగా చేసింది తరువాత.2011లో తమిళంలో వచ్చిన కందం అనే శృంగార చిత్రంలో నటించింది.తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. రశ్మిమీ ఇక 2012లో తన తల్లికి ఆరోగ్యం బాగ లేకపోవడంతో వైజాగ్ కి వెళ్ళిపోయింది. 

2013లో ఎక్స్ ట్రా జబర్దస్త్ లో అడుగు పెట్టింది.రశ్మి కి ఈ ఆఫర్ ఎలా వచ్చిందంటే ,అప్పటికే 13  ఎపిసోడ్ లు జరిగాయి.కానీ అనసూయ అప్పటికే ప్రెగ్నెంట్ గ ఉండడంతోరష్మీ ని సంప్రదించారు.అలా అసలు ఊహించకుండాఆఫర్ వచ్చిందటవచ్చిన అవకాశాన్ని సద్వినియోగం  చేసుకుంది రశ్మి ఈ షో ద్వారా ఎంతో పేరు తెచ్చుకుంది.అలా మళ్లీ అనసూయ రీ ఎంట్రీ ఇవ్వడం తోజబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్,అంటూ గురువారం, శుక్రవారం,ఈ షో లు వస్తున్నాయి.ఎక్స్ ట్రా జబర్దస్త్ కు రశ్మి యాంకరింగ్ చేస్తోంది.ఇప్పుడు ఈ షో చాలా పేరుతెచ్చుకుంది.