మెంతులు గురించి తెలుగులో పూర్తిగా తెలుసుకోండి!

0
fenugreek seeds in telugu

మెంతులు అంటే ఏమిటి? | Fenugreek Seeds Benefits In Telugu

Fenugreek Seeds In Telugu : మెంతుల మొక్కలు  సంవత్సరానికి ఒకసారి పండిచే పంట.ఈ మొక్కల యొక్క ఎత్తు రెండు లేదా మూడు అడుగులు ఉంటుంది. దీని కాయలు మూంగ్ దాల్ లాగా ఉంటాయి. వీటి రుచి కూడా చేదుగా ఉంటుంది. మెంతుల మొక్కల ఆకులను చూస్తే లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

వీటి యొక్క పువ్వులు తెలుపు రంగులో ఉంటాయి. వీటి కాయలలో 10 నుండి 20 వరకు చిన్న పసుపు గోధుమరంగు విత్తనాలు ఉంటాయి.  ఇది చాలా తక్కువ నాణ్యత తో కలిగి ఉంటుంది. వీటిని ఎక్కువగా పశువుల కోసం వాడతారు.

మెంతులను ఎలా నిల్వ చేయాలి?

  • వీటిని చల్లని ప్రదేశములో ఉంచుతారు. గాలి దూరని ప్రాంతాలలో ఉంచుతారు.
  • మెంతులు చూడటానికి చిన్నవిగా ఉన్న వాటిలో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, ఖనిజాలు మరియు అనేక రకాల పోషకాలు కలిగి ఉంటాయి.
  • సహజంగా మెంతులలో ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఇనుము, ఫైబర్, మెగ్నీషియం, భాస్వరం, విటమిన్ సి, థియామిన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, పొటాషియం, సోడియం, జింక్, విటమిన్-బి 6, విటమిన్-ఎ, విటమిన్ కె కలిగి ఉంటాయి.
  • అంటే కాకుండా ఇందులో ఫోలేట్, శక్తి, యాంటీఆక్సిడెంట్, సెలీనియం, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

మెంతు గింజలను ఎలా తినాలి? | How To Eat Fenugreek Seeds

  • కొన్ని మెంతు గింజలను నీటితో కలిపి దానిని ముద్దగా చేసి దాల్చిన చెక్క మరియు అల్లెం వేసి ఉడికించి అ తర్వాత  తాగాలి.
  • అలాగే మరుగుతున వేడి నీటిలో మెంతులు మరియు తేనే కలిపి అ తర్వాత నిమ్మ రసం కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది.

మెంతు గింజలను ఎంత మోతాదులో తినాలి | Dosage of fenugreek seeds

  • మెంతులు రోజు 5 నుంచి 30 గ్రాముల వరుకు తిసుకోవచ్చు.
  • ఇది భోజనం తర్వాత తినడం ఉత్తమం.
  • ఇది ముఖ్యముగా రక్త పోటు ఉన్న వారు 25 నుంచి 50 గ్రాముల తీసుకొంటె ఇది రక్షణగా  పనిచేస్తుంది.
  • కావున ఇవి వాడేటప్పుడు డాక్టర్ను అడిగి వేసుకోవాల్సి ఉంటుంది.

మెంతులు వాటి ఉపయోగాలు | Uses of fenugreek seeds

మన దైనందిక రోజువారీ ఆహారంలో మెంతులు ఎంతో కీలకం. వీటి ఉపయోగాలు ఏంటో ఇపుడు తెలుసుకుందాం.

  1. మెంతికూర ప్రభావం వేడిగా ఉంటుంది, కాబట్టి మెంతిని రాత్రిపూట నీటిలో నానబెట్టి అ తర్వాత తాగాలి.
  2. మెంతులతో  నానబెట్టిన నీటిని ఉదయం ఒకసారి ఏది తినక ముందే తీసుకోవాలి.
  3. నల్ల మిరియాలు మరియు తేనె కలిపి మెంతులను  నీటిలో ఉడకబెట్టడం ద్వారా  మెంతుల టీ మాదిరి తయారు అవుతుంది. ఈ టీని ఉదయం మరియు సాయంత్రం తీసుకోవచ్చు. 
  4. మెంతి ఆకులతో చేసిన పరోటాలు మరియు రోటీలను ఉదయం తినవచ్చు.
  5. మొలకెత్తిన మెంతుల గింజలను తినడం చాలా మంచిది.
  6. మెంతుల కషాయం జీర్ణకోస సంభంద సమస్యలు ఉన్న వారికి ఇది చాల బాగా పని చేస్తుంది.
  7. నానబెట్టిన మెంతులు for hair మెంతులతో జుట్టుని పొడవుగా చేసుకోవచ్చు.
  8. మెంతులతో చుండ్రును తొలగించండి.
  9. రక్తములో చక్కెర స్టాయిని  తగ్గిస్తుంది.
  10. వ్యాయమ తీరును మెరుగు పరుస్తుంది.
  11. కీళ్ళ వ్యాపు లక్షణాలను తగ్గిస్తుంది.
  12. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడం.
  13. జలుబును తగ్గిస్తుంది.
  14. ఆకలి పెంచుతుంది.
  15. గుండె ఆరోగ్యంగా ఉంచడం.

మెంతులు వాటి దుష్ప్రభావాలు | Side effects of fenugreek seeds

  • దీన్ని పిల్లలు సప్లిమెంట్‌గా ఉపయోగించకూడదు. మెంతి యొక్క సంభావ్య దుష్ప్రభావాలు అతిసారం, వికారం మరియు ఇతర జీర్ణవ్యవస్థ లక్షణాలు మరియు అరుదుగా, తల తిరగడం మరియు తలనొప్పి.
  • పెద్ద మోతాదులు రక్తంలో చక్కెరలో హానికరమైన తగ్గుదలకు కారణము కావచ్చు.
  •  మెంతులు కొందరిలో అలర్జీని కలిగిస్తాయి. మెంతులతో పాటు ఇతర మూలికలతో కలిపి తీసుకునే వ్యక్తులలో కాలేయ విషపూరితం అయ్యే ప్రమాదము ఉంది.
  • మెంతులు గర్భధారణ సమయంలో ఆహారంలో లభించే వాటి కంటే ఎక్కువ మోతాదులో ఉపయోగించడం సురక్షితం కాదు.
  • దీని ఉపయోగం జంతువులు మరియు వ్యక్తులలో పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాల పెరుగుదలతో ముడిపడి ఉంది.
  • తల్లిపాలు ఇస్తున్నప్పుడు ఆహారంలో కనిపించే దానికంటే ఎక్కువ మోతాదులో మెంతులు ఉపయోగించడం సురక్షితమేనా అనే దాని గురించి తెలుసుకొని వాడాలి.

ఇవే కాక ఇంకా చదవండి