ప్రజలందరికీ షాకిస్తున్న బంగారం ధర – gold price today

0
gold price

gold price today : బంగారం చాలా రోజుల నుండి రేటు విషయంలో పరుగుల పందెం పెట్టుకొని మరీ రేస్ లో పాల్గొంటున్నది అన్నట్లుగా ఉంది బంగారం ధర. ఎందుకంటే అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గుతున్నది. ఇప్పటికీ భారతదేశంలో మాత్రం బంగారం ధర పెరుగుతూనే ఉన్నది. ఇలా పెరగడం భారతదేశంలోనే ఇది ఏడవ సారి. ఇకపోతే వెండి ధర మాత్రం తగ్గినది. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం బంగారం కొనక పోవడమే మంచిదని అనిపిస్తున్నది.

నేటి శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 180 రూపాయలు పెరిగి 44,810 కి చేరుకున్నది. ఇదే విధంగానే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 180 రూపాయలు పెరిగి 41,260 కు చేరింది.

కొసమెరుపు:-

అయితే బంగారం ధర పెరిగింది కానీ మార్కెట్లో వెండి ధర మాత్రం తగ్గింది. మార్కెట్లో కేజీ వెండి ధర మూడు వందల పది రూపాయలు తగ్గి 41,500 కి చేరుకొన్నది. వెండి నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం వల్ల వెండి ధర కూడా తగ్గిందని చెప్పవచ్చు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర తగ్గింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గానూ 180 రూపాయలు పెరిగి 43,250 కి చేరింది.
అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గానూ 180 రూపాయలు పెరిగి 42,050 కి చేరింది. అయితే కేజీ వెండి ధర మూడు వందల పది రూపాయలు తగ్గి 41,500 కు క్షీణించింది.

ధరల మార్పులకు గల కారణాలు:-

  1. గ్లోబల్ మార్కెట్
  2. ద్రవ్యోల్బణం
  3. పసిడి ధర లో మార్పు
  4. వడ్డీ రేట్లు
  5. జువెలరీ మార్కెట్ లు
  6. బ్యాంకులలో నిల్వ ఉన్న బంగారం
  7. భౌగోళిక మార్పులు మొదలగు అంశాలు బంగారం ధర పై ప్రభావాన్ని చూపుతున్నాయి.

మన తెలుగు వారి కోసం “తెలుగు న్యూస్ పోర్టల్ వెబ్ సైట్” ను క్లిక్ చేస్తూ ఉండండి. మీకు కావలసిన ఎలాంటి సమాచారం కోసమైనా కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ ఆర్టికల్ మీకు నచ్చితే మీ మిత్రులకు, బంధువులకు మర్చిపోకుండా షేర్ చేయండి.