30 Good Morning Quotes In Telugu | గుడ్ మార్నింగ్ కొటేషన్స్
పొద్దున్నే లేవగానే చాలామందికి ఫ్రెండ్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పకుండా తెల్లరదు. అలాంటివారి కోసం ఇక్కడ కొని మంచి Good morning quotes in telugu అలాగే good morning images in telugu ఇచ్చాను.
ఇంకా ప్రతి రోజు కొత్తవి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకు ఈ మెసేజెస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి గుడ్ మార్నింగ్ తెలపండి.
- కోపాన్ని కూడా కరిగించేది నవ్వు
అందుకే నవ్వుతూ ఉంటే ఎన్నో కొత్త ఉదయాలు విచ్చుకుంటాయి ఈ లోకంలో

- రాత్రంతా మేలుకుని ఓ ఉత్తరం రాశాను
అందమైన నీ హృదయానికి అంతే అందమైన ఉదయం ఎదురవ్వాలని

- చీకటిపై రాత్రంతా నడిచిన కల
ఉదయమై తూర్పు వాకిట్లో విరిసింది నీకోసం

- వింటున్నావా అక్కడ పక్షులన్నీ మార్నింగ్ కోరస్ ఆలపిస్తున్నాయ్
మత్తు వదలి మార్నింగ్ చెప్పు వాటికి

- స్వర్గం నరకం
సంతోషం దుఃఖం అనేవి ఎక్కడో కాదు మన మనసులోనే మన ఆలోచనల్లోనే ఉంటాయి

- బతకడం అందరికి సాధ్యమవుతుంది కానీ జీవించడం కొందరికే సాధ్యం
ఎందుకంటే తృప్తి జీవించడంలోనే ఉంటుంది కాబట్టి

- నిన్ను చూసి ఎవరైనా మనస్ఫూర్తిగా నవ్వగలిగారంటే
నీ వ్యక్తిత్వం గొప్పదని అర్థం

- ఆకాశమంతా చీకటి నిండిపోయినా చందమామ ఒక ఆశ
జీవితమంతా సమస్యలు నిండిన ఓ సరికొత్త ఉదయం గొప్ప ఆశ

- ప్రతిరోజు అద్భుతంగా గడిచిపోవాలి అంటే ప్రతి ఉదయం అద్దం ముందు నిలబడి అందులో కనబడే వ్యక్తితో మాట్లాడాలి

- ప్రతిరాత్రి నిద్రించే ముందు మరణించడం నేర్చుకోవాలి ఎందుకంటే గడిచిపోయిన కాలం గురించి ఆలోచించకూడదు.
అలా చేస్తే
ప్రతి ఉదయం కొత్తగా మొదలుపెట్టడం సాధ్యమవుటుంది

- కాలం అందరికి ఓకేలాగా ఉంటుంది. కానీ ఆలోచనలే వేరువేరుగ ఉంటాయి. కాబట్టి ఆలోచనలు సరిచేసుకుంటే కాలాన్ని మనకు నచ్చినట్టు మలచుకోవచ్చు

- చీకటి మీద ఉదయం విచ్చుకుంది
తావి మీద మల్లె పువ్వులా
తెల్లతెల్లగా
చల్లచల్లగా
అచ్చం నీ మనసులాగే!!😉

- నిన్నటి కంటే ఈరోజును
అద్భుతంగా చూపించే అందమైన వారధి ఆహ్లాదకరమైన ఉదయం.

- జీవితాన్ని జీవిస్తూ అస్వాదించాలంటే ముందు నిన్ను నువ్వు ఆత్మవిమర్శ చేసుకుని సరిచేసుకోవాలి. అదే గొప్ప ఉదయం అవుతుంది.

- రోజంతా నీదైన ప్రపంచం నీతో నడవాలంటే మనస్ఫూర్తిగా నవ్వి చూడు!!

- చీకటికి, ఉదయానికి, కాలానికి నటించడం అంటే ఏమిటో తెలియదు.
అందుకే చీకటిలో శాంతంగా నిద్రపో
ఉదయాన్నే పసిబిడ్డలా నవ్వుతూ ఉండు
కాలంతో పాటు కర్తవ్యం వైపు సాగిపో!!

- మౌనంగా ఉండటం గొప్ప కళ
మౌనం నుండి ఎన్నో గొప్ప ఆలోచనలు పుడతాయి
మౌనం ఉదయం లాంటిదే సుమా!!

- ఎప్పుడైనా ఏ పనైనా నిన్ననే చేయాల్సిందని అనిపిస్తే చింతించకు
ఆ పనని మొదలెట్టడానికి మరొక మంచి సమయం ఆ క్షణమే అని గుర్తించు చాలు!!

- దేవుడు ఎక్కడో ఉండడు నీ చుట్టూ నలుగురికి సహాయం చేసే మనిషితో కలసి నడుస్తుంటాడు

- మొదట నీకు నువ్వు గౌరవం ఇచ్చుకోగలిగితే దాని విలువ నీకు బాగా అర్థమవుతుంది

- మనిషి సంతోషంగా ఉండటానికి పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదు

- సూర్యుడు అయినా చిన్న వెలుగుతోనే ఉదయాన్ని మొదలు పెడతాడు
మనిషి ఎదుగుదల చిన్నగానే మొదలవ్వాలి

- కల కనడం గొప్ప కాదు
దానిని సాధించడం గొప్ప కాదు
ఆ రెండింటి మధ్య యుద్ధంలో నిలవడం గొప్ప

- నీ చుట్టూ సమస్యలు చీకటిలా ముసురుకున్నాయని చింతించకు
వెలుగులా నువ్వు మరగలనని ధైర్యం తెచ్చుకో

- ప్రతిరోజు కొత్తగా సూర్యుని తొకిరణంతో ఎలా మొదలవుతుందో
అలాగే స్వచ్ఛమైన ఖాళీ పేజిలా ప్రతీరోజును మొదలుపెట్టాలి

- అదృష్టం చెట్టు మీద పక్షి లాంటిది అది ఎప్పుడైనా ఎగిరిపోతుంది. అందుకే కష్టాన్ని నమ్ముకోవాలి

- రాత్రంతా చుక్కలను ఏరి బాణం సంధించాను
నీ ముందు ఉదయమై మెరిసింది.

28. చలి ఉదయం
వేడివేడి కాఫీ
ఆహ్లాదకరమైన నవ్వు
కూసే పిట్టలు
మన రోజు మొత్తాన్ని ఉల్లాసంగా మార్చేస్తాయి

29. జీవితం అనేది లక్ష్యం కాదు అదొక ప్రయాణం
గెలుపు ఓటమిలను పట్టుకుని వేలాడితే ప్రయాణం గందరగోళం అవుతుంది

- ఏదైనా సాధించగలమనే ఆత్మవిశ్వాసంతో రోజును మొదలుపెడితే రోజంతా సవ్యంగా జరిగిపోతుంది

- ఒకరిని మెప్పించాలని కాదు తమకు నచ్చినట్టు బతకడంలోనే తృప్తి ఉంటుంది

32. శుభోదయం. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో..మంచి ఆలోచనలతో నిండిన మనస్సు కూడా అంతే అందంగా ఉంటుంది.
33 . ఎప్పుడూ నవ్వుతూ ఉండు..అప్పుడు ఈ ప్రపంచంలో ఎవరూ… నీకన్నా అందంగా ఉండరు. గుడ్ మార్నింగ్ మిత్రమా!
34. కొందరు మనల్ని ఇష్టపడతారు.కొందరు మనల్ని ద్వేషిస్తూ వుంటారు.ద్వేషించే వాళ్లను క్షమించండి. ఇష్టపడే వాళ్ళను ప్రేమించండి.శుభోదయం నేస్తమా !
35. మంచి కోసం చేసే పోరాటం పోరాటంలో ఓడిపోయినా అది గెలుపే అవుతుంది. శుభోదయం
36. అందమైన ఉదయం… అందరికి ఆనందాలను తేవాలని.. కోరుకుంటూ.. శుభోదయం
37. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటేచింతలేని జీవితం నీ సొంతమవుతుంది..శుభోదయం..
38. నీ చిరునవ్వు మాత్రమే తెలిసిన మిత్రుని కన్నా.. నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న.. గుడ్ మార్నింగ్ మిత్రమా.
39. గమ్యం చేరుకోవడానికి మార్గం కాదు.మనస్సు ఉండాలి.శుభోదయం
40. ఓటమి గురువులాంటిది.. ఏం చేయాలో.. ఏం చేయకూడదో అదే మనకు నేర్పిస్తుంది.. శుభోదయం..
41.ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనినీ నమ్మడు.శుభోదయం
42. కాలమే జీవితం కాలం వృధా చేయటం అంటే జీవితాన్ని వృధా చేయటమే.శుభోదయం
43. Good Morning బంగారం
44. జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం.శుభోదయం.
45. నీ జీవితంలో ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచనల నుండి మొదలవుతుంది.శుభోదయం.
ఇది కూడా చదవండి :-