గ్రామ వాలంటీర్లు – ఉద్యోగుల జీతాల్లో కోత- grama volunteer salary news

0

ఉద్యోగస్తులకు 50% జీతం:

గ్రామ వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్రంలోని ఇతర సంస్థల కింద పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులకు 50 నుంచి 60 శాతం జీతంలో కోత అని గత మూడు రోజుల నుంచి మనం వింటూ ఉన్నాం. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి అనేకంగా మెసేజ్ లు హల్ చల్ చేస్తున్నాయి.

ఫుల్ డీటెయిల్స్:-

దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే మొదటగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేశాడు.కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ సందర్భంగా రాష్ట్రానికి ఆదాయం బాగా తగ్గిపోవడం వల్ల మార్చి నెలకు సంబంధించిన జీతం ఏప్రిల్ నెలలో ఇవ్వడానికి రాష్ట్ర ఖజానాలో సరిపోయేటువంటి నిధులు లేవని పత్రికా ప్రకటన చేశాడు. ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మన రాష్ట్రంలో సీఎం జగన్ కూడా ఆ నిర్ణయాలే ఇక్కడ కూడా అనుసరిస్తున్నాడు.

అయితే ఉద్యోగస్తులకు సంబంధించి జీతం బిల్లును మార్చి 25, 26 తేదీల్లో నే ట్రెజరీ శాఖకు సబ్మిట్ చేయడం జరిగిందని తీరా ఏప్రిల్ నెలలో కి అడుగుపెట్టిన తర్వాత ఇప్పుడు ఆ బిల్లులను రద్దు చేస్తూ, మరో 50 శాతం జీతం బిల్లు కొత్తగా రెడీ చేసి రాష్ట్ర ఖజానాకు సబ్మిట్ చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి ఆదేశాలు వచ్చాయి అని అధికారులు తెలియజేస్తున్నారు.

ఈ విషయాలన్నిటికీ సంబంధించి అన్ని ప్రముఖ దినపత్రికల్లో ” వాయిదాల్లో వేతనం” – “అరకొర జీతం” అంటూ రకరకాల వార్తలు వచ్చాయి.
అంటే ఉన్నతాధికారులకు 60 శాతం గానూ ఇతర శాఖల్లో ఉండే క్రింది స్థాయి అధికారులకు 50 శాతం గానూ కోత విధించి జీతం బిల్లును సబ్మిట్ చేసి వచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే టోటల్ గా మార్చి నెలకు సంబంధించిన మొత్తం బిల్లును రెండు విడతలుగా చెల్లించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు తీసుకుంటున్నది.

ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే ప్రజాప్రతినిధులు అందరికీ కూడా జీతాలు పూర్తిగా నిలిపివేయడం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని ప్రతి తెల్ల రేషన్ కార్డుదారునికి కూడా ఒక వెయ్యి రూపాయలు ఉచితంగా గ్రామ సచివాలయం లోని వాలంటీర్ల ద్వారా అందజేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయానికి సంబంధించి కొంత మంది అధికారులు వాడివేడిగా చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లకు వారి యొక్క జీతంలో 10 శాతం కోత విధించి మిగిలిన జీతాన్ని ఏప్రిల్ ఒకటికే అందజేస్తున్నట్లు ఆదేశాలు వచ్చాయి.

ప్రతి ఒక్క ఉద్యోగికి కోత విధించిన జీతమును,ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మిగిలిన ఆ 50% జీతం చెల్లిస్తారు. అయితే ఇప్పటికే సబ్మిట్ చేసిన బిల్లులను రద్దు చేసి తాజాగా అంటే కొత్తగా ఉద్యోగ జీతంలో 50 శాతం మాత్రమే జీతం బిల్లును రూపొందించి వాటిని ట్రెజరీ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఏప్రిల్ ఒకటో తేదీకి అందాల్సిన జీతము ఉద్యోగులకు రాదు అని తెలుస్తోంది.

ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికీ 50% జీతం బిల్లు తయారు చేసి వాటిని ట్రెజరీకి సబ్మిట్ చేసి అవి CFMS నుండి బ్యాంకులకు వెళ్లి, అక్కడి నుంచి ఉద్యోగుల అకౌంట్ లోకి జీతం డబ్బులు పడడానికి కనీసం పది రోజుల సమయం పడుతుందని ఉద్యోగస్తులు బాధపడుతున్నారు. ఉద్యోగస్తులు జీతాల్లో 50 శాతం కోత విధించడం వల్ల ప్రభుత్వానికి దాదాపు 2800 కోట్లు మిగులు అవుతాయని చెపుతున్నారు. ఈ మిగులు గా ఉన్న కోట్ల రూపాయలు ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో అవసరాలకు వినియోగించడానికి ఖర్చు చేస్తున్నట్లు అధికారుల నుంచి సమాచారం వస్తోంది.

అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెయ్యి రూపాయలు అందజేస్తున్నట్లు అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఇందుకోసం దాదాపు పదమూడు వందల కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. కాబట్టి ఇందుకోసమే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ కూడా వాయిదాల పద్ధతిలో జీతం చెల్లిస్తున్నట్లు చెబుతోంది. అయితే మొదటగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే నిర్ణయాన్ని ఫాలో కావడం జరిగింది. అయితే ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి యొక్క జీతాన్ని నిలిపివేయి రాదని, ఎప్పటిలాగానే వారికి నిర్దేశించిన తేదీల్లో వారి యొక్క జీతాన్ని అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేస్తారు కదా. మీకు అందరికీ ఉపయోగపడే సమాచారం కోసం ఈ క్రింది వాటిని క్లిక్ చేయండి.

  1. గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీలో ఈ జిల్లానే ఫస్ట్ ! మరి మీ జిల్లా ఎక్కడో తెలుసుకోండి ?
  2. కరోనా వైరస్ సర్వే కి చెందిన మొబైల్ App ని ఇక్కడ డౌన్లోడ్ చేస్కొండి
  3. ప్రజా సచివాలయం App v2.4 వచ్చేసింది – డౌన్లోడ్ చేస్కొండి