వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తరువాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల విషయంలో చాలా మార్పులు జరిగాయి. ఇంతకుముందు ఏదైనా పథకం అమలు అవ్వాలి అంటే అది కేవలం అధికారుల ఆధ్వర్యంలో జరిగేది. మనం కొత్తగా రేషన్ కార్డ్ , ఆదార్ కార్డు, పించన్ లాంటివి పొందాలి అంటే చాలా సమయం పట్టేది. మరి ఇప్పుడు అలా కాదు. దేశంలోనే అత్యంత ప్రధానత సంతరించుకున్న గ్రామ-వార్డ్ వాలంటీర్ వ్యవస్థని మన cm జగన్ గారు ప్రవేశ పెట్టారు.
మరి గ్రామ వార్డ్ వాలంటీర్ అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధి గ ఉన్న ఒక గొప్ప సిస్టం. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పోస్ట్ లో ఉన్న ప్రతి వాలంటీర్ తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించారో లేదో మనం తెలుసుకోవచ్చు.అందుకోసం మనకు ఒక వెబ్సైటు ఉంది.ఈ కింది లింక్ ద్వార మన రాష్ట్రంలో లో ఉన్న ప్రతి జిల్లా, మండలం లెవెల్లో వాలంటీర్స్ అమలు చేసిన పథకాల వివరాలను తెలుసుకోవచ్చు.
మనకు కావాల్సిన లింక్ : https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GswsSchemesReport