హరితగృహ ప్రభావం వాటికీ నివారణ మార్గాలు !

0
green hous efffect in telugu

Greenhouse effect in telugu | హరితగృహ ప్రభావం అంటే ఏమిటి?

ఒక గ్రహంపై సూర్యుని నుండి వచ్చే శక్తి దాని వాతావరణం గుండా వెళ్లి ఆ  గ్రహం యొక్క ఉపరితలం వేడెక్కినప్పుడు ఏర్పడే ప్రక్రియను గ్రీన్‌హౌస్ ప్రభావం గా చెప్పుకోవచ్చు

భూమి యొక్క ఉపరితలం సూర్యుని శక్తిలో సగం శక్తి ని  గ్రహిస్తుంది, అయితే వాతావరణం 23 శాతం గ్రహిస్తుంది మరియు మిగిలినది తిరిగి అంతరిక్షంలోకి ప్రతిబింబిస్తుంది. సహజ ప్రక్రియలు ఇన్‌కమింగ్ మరియు అవుట్‌గోయింగ్ శక్తి మొత్తం సమానంగా ఉండేలా చూస్తాయి, గ్రహం యొక్క ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది.

హరితగృహ ప్రభావం ఎలా ఉంటుంది ?

గ్రీన్‌హౌస్ ప్రభావానికి నీటి ఆవిరి అతి పెద్ద మొత్తంలో దోహదపడుతుంది. అయినప్పటికీ, వాతావరణంలోని దాదాపు  నీటి ఆవిరి సహజ ప్రక్రియల నుండి వస్తుంది.

ముఖ్యముగా కార్బన్ డయాక్సైడ్ (CO2), మీథేన్ మరియు నైట్రస్ ఆక్సైడ్ ఆందోళన చెందాల్సిన ప్రధాన (GHG)గ్రీన్ హౌస్ వాయువులు.  (CO2) కార్బన్ డయాక్సైడ్  వాతావరణంలో 1,000 సంవత్సరాల వరకు ఉంటుంది, మీథేన్ దాదాపు ఒక దశాబ్దం పాటు మరియు నైట్రస్ ఆక్సైడ్ సుమారు 120 సంవత్సరాల వరకు ఉంటుంది.

20-సంవత్సరాల కాలంలో కొలిస్తే, గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే CO2 కంటే మీథేన్ 80 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది, అయితే నైట్రస్ ఆక్సైడ్ 280 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది.

ఈ గ్రీన్ హౌస్ వాయుల వలన  వాతావరణములో కాలుష్యం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. కావున మనము ఎంత తక్కువ మోతాదులో ఈ గ్రీన్ హౌస్ వాయువులను తగ్గిస్తే మనకు మంచింది. అంటే వీటి వాడకము మరియు వీటిని వాడె పెద్ద దేశాల సహకారముతో వీటిని అతి తక్కువ మోతాదులో వాడితే మనకు బాగుంటుంది.

భూతాపం అధిక  స్థాయికి పెరిగితే అది తీవ్రమైన కరువు, కార్చిచ్చు, వరదలు లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది.

వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తున్న ఐక్యరాజ్యసమితి ‘ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్'(ఐపీసీసీ) భూమి ఉపరితల ఉష్ణోగ్రత 12 ఏళ్లలో పారిశ్రామిక విప్లవం ముందు ఉన్నప్పటి దాని కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగిందని  తెలిపింది.

హరితగృహ ప్రభావం వాటికీ నివారణ మార్గాలు

భూమిపై ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటకుండా అదుపు చేయడంలో పౌరులు చాలా కీలకమైన పాత్ర పోషించాలి మరియు వాటి నివారణ లో మనము ముందు అడుగు వేయాలి అంటే మనము ఖచ్చితముగా వీటిని పాటించాలి

  • మీరు గ్రీన్ హోసే ఎఫెక్ట్ ను తగ్గించాలీ అంటే మీరు వాహనాలను ఎంత తక్కువ ఉపయోగిస్తే అంత వాటి నుంచి వచ్చే కాలుష్యంను  నివారణ చేయవచ్చు.
  • ఈ విధముగా చేయటం వలన మనకు ఆరోగ్యం తో  పాటు మనకు హాని కలిగించే కర్బన ఉద్గారాలు విడుదల కావడం కూడా తగ్గుతుంది.
  • ఈ వాహనానలకు బదులుగా మీరు ఎలక్ట్రిక్ వాహనాలు లేదా సైకిల్ ను వాడితే  చాల మేర వాయు కాలుష్యం తగ్గించవచ్చు.
  • ఇవే కాక మీరు ఇది కూడా చేస్తే అంటే విద్యుత్ వాడకాన్ని కూడా మీరు తగిస్తే బట్టలు ఆరేయడానికి వాషింగ్ మెషిన్ డ్రయ్యర్ ఉపయోగించడం కంటే ఒక తాడుపై వాటిని ఆరేయడం మంచిది.
  • చల్లబడడానికి ఏసీని ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం, వేడెక్కడానికి హీటర్లను తక్కువ ఉష్ణోగ్రతలో ఉపయోగించడం వల్ల కూడా చాలా విద్యుత్ ఆదా అవుతుంది.
  • చలికాలాల్లో ఇంట్లో వేడిని కోల్పోకుండా మీ పైకప్పుకు ఫైబర్ లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి వాటితో మరింత రక్షణ కల్పించడం మంచిది.
  • ఏవైనా విద్యుత్ పరికరాలను ఉపయోగించనప్పుడు వాటి స్విచ్ ఆఫ్ చేయండి. ప్లగ్ నుంచి తీసివేయండి.
  • ఇక తిండి విషయానికి వస్తే మాంసము తినే వాళ్ళు దీనిని తగ్గిస్తే  బాగుంటుంది.
  • పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యం ఉత్పత్తి కంటే మాంసం ఉత్పత్తి వల్ల గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువగా విడుదలవుతాయి.
  • మాంసం తినడం తగ్గించండి. దాని బదులు మరిన్ని కూరగాయలు, పండ్లు తినండి.
  • పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడాన్ని తగ్గించడం వల్ల, వీగన్‌గా మారడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి.
  • ఇక చివరి విషయానికి వచ్చే సరికి నిటి వాడకము తగిస్తే  వాటి వలన కూడా మనం కర్బన ఉద్గ్రాలు తగించే అవకాశము ఉంది
  • రీసైక్లింగ్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనకు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.
  • ఇలా ఉత్పత్తి తగ్గించి, వస్తువులను మళ్లీ మళ్లీ ఉపయోగించడం వల్ల వనరుల నష్టం తగ్గించడానికి సాయం చేయచ్చు.
  • మనం వర్షపు నీటిని సేకరించాలని అనుకున్నప్పుడు, వాటిని కచ్చితంగా సంరక్షించాలి, మళ్లీ, మళ్లీ వినియోగించాలి” అని కొంత మంది నిపుణల అభిప్రాయము.
  • ఇక ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి తెలియని వారికి దిని గురించి తెలియ చేసి వాటి యొక్క లాభాలు వాళ్ళకు తెలియ చేయలి.
  • పంటల పద్ధతులు, విద్యుత్ ఆదా చిట్కాలు, రీసైకిల్ ప్రయోజనాలు లాంటివి అందరికీ తెలిసేలా ‘షేర్డ్ నెట్‌వర్క్’ గ్రూపులు ఏర్పాటు చేయండి.
  • ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఇలాంటి చిన్న చిన్న మార్పులను ప్రతి రోజూ పాటిస్తే.. అది వారి సంక్షేమంపై చాలా ప్రభావం చూపిస్తుంది. అభివృద్ధి స్థిరంగా ఉండేలా చేస్తుంది.
  • భూతాపం తగ్గించడానికి, రాబోవు తరాలకు మెరుగైన, సురక్షితమైన భవిష్యత్తు అందించడానికి సాయం అవుతుంది.

ఇవే ఇంకా చదవండి