కన్నతల్లిని నరికి చంపినా కసాయి కొడుకు

0

గుంతకల్లు, అనంతపురం జిల్లా, గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్ లోదారుణం .తిలక్ నగర్ కు చెందిన సంజమ్మ[65]  ను కుమారుడు శ్రీనివాసులు వేట కొడవలితోనరికి చంపేశడు.తిలక్ నగర్ లోఉంటున్న సంజమ్మ ఒక ప్రభుత్వరైల్వే ఉద్యోగి భార్య.వారి సంతానం ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, ఆమె భర్త అనారోగ్యంతో మరణించాడు,వారిలో శ్రీనివాసుల  రెండవ కుమారుడు.వాళ్ల నాన్న ఉద్యోగం వాళ్ళ అన్న కు రావడం తో,శ్రీనివాసులు వేరే నగరానికి వెళ్ళి ఒక ఫ్యాక్టరీ లో పని చేస్తూ ఉండేవాడు.

గత పది నెలల ముందు అక్కడ ఎవరితోనూ గొడవ పడి ఉద్యోగం వదిలి వచ్చేశాడు.గత పది నెలలుగా ఖాళీగా కూర్చున్నాడుఅందువలన తన తల్లి పని కి వెళ్లమని చెప్పడంతో ఆగ్రహించు కున్నాడు.కాకపోతే వీరి కుటుంబంలో ఇంతకుముందే కుటుంబకలహాలు ఉండడంతో అవి మనసులో పెట్టుకుని తన కన్నతల్లి అయినా సంజమ్మ ను వేట కొడవలితో 40 సార్లునరికి చంపాడు.

పట్టణ పోలీసులు వీరిపై విచారణ చేపట్టగా.చుట్టుపక్కల వాళ్లంతా కుటుంబ కలహాలే కారణమని అంటున్నారు.తన రెండవ కుమారుడైన శ్రీనివాసులు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.కాలనీ అంతా జనసంద్రంగా మారిపోయింది.ఏది ఏమైనా కూడా పోలీసులు శ్రీనివాసులు  నీ వదిలే ప్రసక్తే లేదంటున్నారు.