గుప్పెడంత మనసు సీరియల్ టుడే ఎపిసోడ్ – బుధవారం,18-05-2022

0
guppedantha manasu serial today episode 18 may 2022

గుప్పెడంత మనసు సీరియల్ టుడే ఎపిసోడ్ | Guppedantha Manasu Serial Today Episode May 18

సీన్లోకి ఎంటర్ అయితే..

సాక్షి రిషి పై నువ్వు నాకు ఇవ్వన్ని టైం నువ్వు నాకు ఇవ్వన్ని ప్రిఫరెన్స్ ఇంకెవరికొ ఎలా ఇస్తున్నావ్ అని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు రిషి నేన్ ఎవరికీ ఇస్తున్నాను సాక్షి నువ్వు అలా అంటున్నావు అని అడిగితే ఇంకెవరికి ఆ వసుదార కి ఇస్తున్నావ్ కదా అని అంటుంది సాక్షి.

నీ మనసులో ఏదో ఉంది రిషి నీ ప్రాధాన్యత నేనే అవ్వాలి కానీ నువ్వు ఆ వసుధర కి ప్రాధాన్యత ఇస్తున్నావు అని అంటుంది. అప్పుడు రిషి  సాక్షి అని గట్టిగా అరుస్తాడు తను నాకు ప్రాధాన్యత ఏంటి అని అంటాడు రిషి. అప్పుడు సాక్షి ఇది నిజం  రిషి నువ్వు అవునన్నా కాదన్నా నీకు వసుదరా అంటే చాలా ప్రాధాన్యత ఎక్కువ అని అంటుంది సాక్షి.       

అప్పుడు రిషి తను కేవలం నా స్టూడెంట్ మాత్రమే అని అంటాడు దానికి సాక్షి కాలేజ్ లో అంత మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా ఎందుకు అంత ప్రత్యేక శ్రద్ధ నీకు అని అడుగుతుంది.

ఎవరికీ చెయ్యని హెల్ప్ నువ్వు వసుధార కి ఎందుకు చేస్తున్నావ్ అని అడుగుతుంది. నువ్వు ఆ వసుధార కి టైం ఇస్తూ నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావ్ అని అంటుంది. నువ్వు ఆ వసుధార స్నేహం కోసం తహతహలాడుతున్న నువ్వు కోరుకుంటున్నాం నువ్వు వసుధరా నీ ప్రేమిస్తున్నావ్ అని గట్టిగా అరుస్తుంది సాక్షి.

 షాట్ఆప్ సాక్షి ఇంకొకసారి అలా మాట్లాడితే బాగుండదు ఆ రోజు నువ్వు నన్ను కాదని వదులుకొని వెళ్లావు కదా మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతాడు రిషి. నేను నీకు దక్కను అని తెలిశాక నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఇంకెవరినో బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు సాక్షి అని అంటాడు. నువ్వు చెప్పిన దాంట్లో నిజాలు ఏమిలేదు సాక్షి అని అంటాడు రిషి.

నేను మాట్లాడడం తప్పు అయితే అని వెళ్లి వసుధారా రిషి దిగిన ఫొటోస్ ని చూపిస్తుంది రిషికి, అక్కడున్న వాళ్ళందరికీ చూపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏం లేదు అంటే నేను నమ్మాలా అని అంటుంది.

రిషిని వసుధార ని సాక్షి బ్లేమ్ చేస్తూ ఉంటుంది ఇంతలో జగతి ఇక ఆపుతావా సాక్షి అని వస్తుంది. రిషిని కాదనుకొని వెళ్ళిపోయావు కదా ఇన్నాళ్ళ తర్వాత నీకు రిషి ఎందుకు గుర్తుకొచ్చాడు అని అడుగుతుంది. సంవత్సరం తర్వాత మిస్ అయ్యావు అని నీకు తెలిసిందా.

  ఆంటీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు మీకేం సంబంధం అని అడిగితే ఏం సంబంధమో నాకు తెలుసు రిషి కి తెలుసు మాట్లాడే హక్కు నాకుంది సాక్షి అని అంటుంది జగతి.

నేను ఎందుకు మాట్లాడుతున్నానో ఇక్కడ అందరికీ తెలుసు అడిగే హక్కు నాకుంది, మధ్యలో నువ్వెందుకు వచ్చావు సడన్ గా నీకు ఎందుకు రావాలి అనిపించింది సాక్షి అని అంటుంది జగతి.

రిషి మనసులో నీకి ఏముందో తెలిసింది కదా రిషి ప్రియారిటి నువ్వు కాదా నీకు తెలిసింది కదా అయినా నీకు నీకు నీకు ఎందుకు ఇలా చేస్తున్నావ్,నీకు రిషి నటే ఇష్టం కదా అయితే నీ ప్రేమ గురించి చెప్పు నీ గురించి చెప్పు పక్క వారి మీద బురద ఎందుకు అనుకుంటున్నావు పక్కవారి మీద బురద జల్లే టప్పుడు మొదట నీ చేతికి అంటుకుంటుంది.

అది ఆలోచించావా సాక్షి, ఇంకో విషయం మారింది రిషి కాదు నువ్వు నీ ఆలోచనలు మారాయి నీ గోల్ మారాయి, అది ఎందుకో అది ఎవరి ప్రోత్సాహం నాకు బాగా తెలుసు అని అంటుంది.
ఇంతలో దేవయాని ఎంటర్ అవుతుంది నువ్వు ఎందుకు సాక్షి నీ ఆపుతున్న జగతి తన క్లారిటీ తనని తెచ్చుకునివ్వు అని అంటుంది.

అప్పుడు వెళ్ళింది నువ్వు ఇప్పుడు వచ్చింది నువ్వు ఇప్పుడు మారిపోయాడు అనీ రిషిని అంటున్నావా అలా అనద్దు సాక్షి అని జగతి సాక్షితో అంటుంది. అప్పుడు సాక్షి రిషి మనసులో ఎవరూ లేరు అంటే వసుధార కి ఎలాంటి ప్రూరిర్టి లేదంటే నన్ను యాక్సెప్ట్ చెయ్యొచ్చు కదా ఆంటీ అని అంటుంది.

దేవయాని సాక్షి ఇద్దరూ వసుధార కి ఎలాంటి ప్రియారిటి లేదు అంటే అది మా ఎదురుగా ప్రూవ్ చేయొచ్చు కదా అని రిషి తో అడుగుతారు. ఇంతలో అక్కడికి వసుధర వస్తుంది. మేడమ్ రిషి సార్ తో కొంచెం పనుండి వచ్చాను అని చెప్తుంది.

రిషి తన మనసులో వసుధారా ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. అక్కడ సాక్షి ని చూసి వసుధారా ఆశ్చర్యపోతుంది. అక్కడి నుండి సాక్షి వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోతారు.

సీన్ కట్ చేస్తే..

రిషి సాక్షి మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వసుధార వస్తుంది. వసుంధర తో నీకు కొంచెం కూడా మానర్స్ లేదా ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి  వచ్చేయడమే నా అసలు ఎందుకు వచ్చావు ఇంటికి అని అరుస్తూ ఉంటాడు.

అప్పుడు వసుధార ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి అని అంటుంది అప్పుడు రిషి నువ్వు చెప్పేది ఏంటి నేను వినేది ఏంటి, అప్పుడు వసుధారా నేను చేసిన తప్పేంటి సార్ అని అడుగుతుంది అప్పుడు రిషి నువ్వు ఇక్కడికి రావడం ఏ పెద్ద తప్పు వసుధర అని అంటాడు. ఇంతలో జగతి వసుధార కి కాల్ చేసి బస్సు నువ్వు మాట్లాడకుండా కిందికి వచ్చే అని కాల్ చేస్తుంది.

  అప్పుడు వసుధార రిషి సార్ పర్స్ ఇస్తుంది క్లాస్రూమ్లో మీ పర్స్ పడిపోయింది సార్ అందుకే మీ ఇంటికి వచ్చాను ఇవ్వడానికి అని చెప్తుంది. ఇందులో తప్పేముంది నాకు అర్ధం అవ్వటం లేదు సార్ అని చెప్పి కింద కి వచ్చేస్తుంది.

వాళ్ళ జగతి మేడం దగ్గరకు వచ్చి మేడం నేను చేసిన తప్పేంటి ఎందుకు నన్ను అలా తిడుతున్నాడు అని అడుగుతుంది. అప్పుడు నువ్వు రాంగ్ టైంలో వచ్చావు అని చెప్తుంది. ఇప్పుడు నేను నీకు ఏం చెప్పలేను వసుధారా చెప్పే సందర్భం కూడా రాలేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో  అని చెప్తుంది జగతి.

 ఇంతలో రిషి దగ్గరకు జగతి వస్తుంది. జగతి రిషి తో నీ పర్సనల్ విషయాలు మాట్లాడే హక్కు నాకు లేదని ఆ హక్కు నువ్వు నాకు ఇవ్వలేదు అని తెలుసు, అయినా నేను మహేంద్ర తరఫున మాట్లాడడానికి వచ్చాను.

ఇంతకు ముందు అంత పెద్ద చర్చ జరిగింది అందరూ ఏవేవో అన్నారు, ఏది నిజమో ఏది అబద్ధమో అందరి కన్నా నీకే క్లారిటీ గా తెలుసు రిషి, వసుధార నీ ప్రేమిస్తున్నానని నేను నీకు చెప్పాను అని జగతి అంటుంది. 

రేపటి ఎపిసోడ్ ప్రోమో: రిషి వసుంధర తో హాల్ టికెట్ తీసుకున్నావా సరే అయితే వెళ్ళు నువ్వు ఇంకా అని చెప్తాడు, అప్పుడు వసుధారా రిషితో ఏంటి సార్ మీరు నాతో పాటు రావడం లేదా అని అడుగుతుంది.

అప్పుడు రిషికి సాక్షి మరియు దేవయాని  చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు నేను రావటం లేదు వసుధారా నువ్వేం చిన్నపిల్లవి కాదు కదా వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి.

ఇవి కూడా చదవండి :-