గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ విశేషాలు !

0
guppedantha manasu 19th may 2022

గుప్పెడంత మనసు సీరియల్ టుడే ఎపిసోడ్ | Guppedantha Manasu Serial Today Episode

సీన్ లోకి ఎంటర్ అయితే..
జగతి రిషి దగ్గరికి వచ్చి నేను మా ఆయన తరపున నీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అందరూ ఏదేదో అన్నారు కానీ “ఏది అబద్ధమో ఏది నిజమో అది ఎంతవరకు నిజమో అనేది నీకు మాత్రమే తెలుసు, నువ్వు వసుధార ప్రేమిస్తున్నావు అనే విషయం నేను నీకు ఎప్పుడో చెప్పాను, కానీ ఆరోజు నువ్వు నా మీద అరిచావు” ఈరోజు కూడా నువ్వు కాదని అంటావా అంటూ, ఒకవేళ ఆ విషయం అబద్ధమైతే ఇదేంటి అని ‘తను రాసిన ప్రేమలేఖ రిషితో చూపిస్తూ అడుగుతుంది.

చించేసిన ప్రేమ ముక్కల్ని అతికించుకునే ఎంత అభిమానం, దాచుకునేంత గౌరవం దీన్నేమంటారు’ అని అంటుంది జగతి. నోటి మాట అబద్ధం కావచ్చు గానీ చేతిరాత అబద్ధం కాదు కదా రిషి అని చెప్పి నిజమో అబద్ధమో  ఎవరికీ చెప్పాల్సిన అవసరం ఉందో లేదో తెలియదు.

కానీ నీకు నువ్వు మాత్రం ఎప్పుడు అబద్ధాలు చెప్పుకో వద్దు నీ మనస్సును నువ్వే మోసం చేసుకోవద్దు రిషీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి పోతుంది. రిషి ఆ ప్రేమలేఖను కాల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, వసుధర గురించి ఆలోచిస్తూ నేను అనవసరంగా తిట్టాను తొందరపడానేమోఅని అనుకుంటూ ఉంటాడు.

సీన్ కట్ చేస్తే..

వసుధార సాక్షి గురించి ఆలోచిస్తూ తను అసలు అక్కడ ఎందుకు ఉంది తన ఫ్యామిలీ ఫ్రెండా అని అనుకుంటూ ఉంటుంది. రిషి సార్ కి ఎందుకు అంత కోపం వచ్చింది నేను చాలా సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ ఈ రోజు మాత్రం కొత్తగా ఎందుకు వచ్చావు అని తిట్టారు, అని ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళుతుంది. ఇంతలో అక్కడికి జగతి  రిషి కార్ వేసుకుని వస్తుంది.

మేడం మీ రా నేను రిషి సార్ అని అనుకున్నాను అని చెప్తుంది. మేడమ్ రిషి సార్ కి ఏమైంది ఎందుకు నా మీద అలా కోపం పడ్డారు అని అంటుంది, అప్పుడు జగతి రిషి కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నాడు అందుకే నీతో అలా కోపం గా మాట్లాడాడు అని చెప్తుంది జగతి. రిషి ని కూడా వివరాలు ఏమి అడగకు అని చెప్తుంది. ఎదుటివారి కోసం ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా గొప్ప విషయం వసు అని జగతి చెప్తుంది. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది వసు అని చెప్పి సరే మనం ఇంకా వెళదాం పద అని కార్లో ఇద్దరు వెళ్తారు.

సీన్ కట్ చేస్తే..

రిషి వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు కాలేజీలో, ఇంతలో అటెండర్ వచ్చి సార్ మీకు కొరియర్ వచ్చింది అని చెప్తాడు అది ‘వసుధారా హాల్ టికెట్’. ఇంతలో వాళ్ళ డాడీ వచ్చి రిషి కాఫీ తాగుదామా అని అంటాడు అప్పుడు రిషి నాకు కాఫీ తాగాలని లేదు డాడీ అని చెప్పి తనకు వచ్చిన కొరియర్ ను ఇది జగతి మేడమ్ కి ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు.

సీన్ కట్ చేస్తే..

సాక్షి దేవయాని ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటారు నన్ను మా అమ్మ నాన్న ఇద్దరు తిడుతున్నారు ఆంటీ లండన్ కి వెళ్ళిపో అని చెప్పారు, ఆంటీ అని సాక్షి దేవయానితో చెప్తూ ఉంటుంది. రిషి మనసులో ఎవరు ఉన్నారు నువ్వు లేవు ఆ మనిషిని పక్కకు జరిపి రిషి మనసులోకి నువ్వు వెళ్ళాలి సాక్షి అని దేవయాని చెప్తుంది. మనం ప్రయత్నం చేస్తే మనకు కావలసిన ఫలితం దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు అన్నీ సవ్యంగా జరుగుతాయి అని మనకు అనుకూలంగా జరుగుతాయి నువ్వే గెలుస్తావ్ సాక్షి అని చెప్తుంది.

సీన్ కట్ చేస్తే..

వసుధార కి జగతి మేడం హాల్ టికెట్ ఇచ్చి ఈ ఎగ్జామ్ గురించి రిషి సార్ చాలా నమ్మకం పెట్టుకున్నారు, చాలా బాగా రాయాలి వసుధారా అని చెప్తుంది. రిషి సార్ క్యాబిన్ కి హాల్ టికెట్ తీసుకొని వసుధార వెళ్తుంది. రిషి వసుధార తో ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవ్వు వసుధారా అని చెప్తాడు. సరే హాల్ టికెట్ తీసుకున్నావా అయితే ఎగ్జామ్ రాయడానికి ఎప్పుడు వెళ్తున్నావ్ అని అడుగుతాడు. అప్పుడు వసుధర అది ఏంటి సార్ మీరు నాతో పాటు రావడం లేదా అని అంటే లేదు నేను రాను నువ్వు వెళ్ళు అని చెప్తాడు.

అప్పుడు రిషి వసుధార నేను నిన్ను ప్రతిసారీ వేలు పట్టి నడపాల్సిన అవసరం లేదు, వసుధార చెప్తున్న కదా ఈసారి నేను రావడం లేదు నువ్వు వెళ్తున్నావ్ అని చెప్తాడు. మీరు నాతో పాటు రావడం నాకు ఒక సెంటిమెంట్ సార్ మీరు నా పక్కన ఉంటే నాకు నా బలం పెరుగుతుంది సార్ అని చెప్తుంది. ప్లీజ్ సర్ మీరు రావచ్చు కదా సార్ అని రి బతిమాలుతోంది. అప్పుడు ఋషి నువ్వేం చిన్న పిల్లవి కాదు కదా వసుధార అని అంటాడు.

అప్పుడు వసుధర మీరు నా నమ్మకం సార్ మీ నమ్మకం నాకు  వెయ్యేనుగుల బలం ఇస్తుంది. ప్లీజ్ సర్ మీరు రండి అని అంటుంది. అప్పుడు రీషి తన మనసులో ప్లీజ్ వసుధర నన్ను  రమ్మని పిలవకు నాకు రావాలని ఉన్నా నేను నీతో రాలేని పరిస్థితుల్లో ఉన్నాను అని అనుకుంటూ ఉంటాడు. రీషి అప్పుడు నేను ఒకసారి చెప్తే నా మాటకు తిరుగు ఉండదు నువ్వు వెళ్తున్నావా ఎగ్జామ్ రాస్తున్నావ్ గెలుస్తున్న అంతే వసుధార అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి పోతాడు.

జగతి మహేంద్ర లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి వసుధారా చాలా బాధ పడుతూ వస్తుంది. రా వసు రిషి సార్ ఏమన్నాడు అని అడిగితే వసుధార నేను వెళ్తాను మేడం ఈరోజు క్లాస్ లు ఏమి లేకుండా ఉన్నాయి అని చెప్తుంది. అప్పుడు వసుధార రిషి సర్  స్కాలర్షిప్ ఎగ్జామ్ దగ్గరికి రాను అని అంటున్నాడు మేడం అని అంటుంది.

అప్పుడు మహేంద్ర మనసులో ఇదేంటి వీడు ఏదో కొంచెం మారాడు అని అనుకుంటే మళ్లీ మొదటికి వచ్చినట్టున్నాడు అని అనుకుంటాడు. అప్పుడు జగతి ఏమోలే వసు రిషి కి ఏమైనా వేరే పనులు ఉండొచ్చు కదా నువ్వు ఎందుకు అలా బాధ పడుతున్నావ్ అని అంటుంది జగతి.

ప్రోమో: వసుధార జగతి తో ఎప్పుడు రిషి రాకపోతే ఏం వసు నువ్వు వెళ్లి ఎగ్జామ్ రాసి వచ్చేయ్ అని అంటుంది. అప్పుడు వసుధారా కనీసం నాకు ఆల్ ద బెస్ట్ అయినా చెప్పడానికి రావాలి కదా మేడం అని అంటుంది. వసుధార బస్సు ఎక్కి వెళ్ళిపోతుంది ఎగ్జామ్ రాయడానికి,అక్కడే రీషికార్ లో ఉంటాడు. ఇది తెలుసుకున్న దేవయాని సాక్షి వసుధార నీ డిస్టర్బ్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

ఇవి కూడా చదవండి : కార్తిక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ యొక్క విశేషాలు !