Table of Contents
H3N2 Symptoms And Treatment In Telugu
ఫ్రెండ్స్ ప్రస్తుతం వాతావరణంలోని మార్పులు, ఇతర కారణాల వలన మనం కొన్ని వైరేస్ లకు గురి అవుతున్నాము. ఆ వైరేస్ లలో ఇటివల మనం ఎక్కువగా h3n2 బారిన పడుతున్నాము. ఈ h3n2 వైరేస్ ను హాంగ్‌కాంగ్ ఫ్లూ అని పిలుస్తారు. మన దేశంలో ప్రస్తుతం ఈ వైరేస్ వలన ఎక్కువ మంది భాదపడుతున్నారు
ఈ వైరేస్ వలన మొదట హరియాణా, కర్ణాటకల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇటివల వెల్లడించింది. ఫ్రెండ్స్ ఈ క్రింద మనం h3n2 యొక్క లక్షణాలు,దీనికి ఎలా చికిత్స తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
H3N2 యొక్క లక్షణాలు
H3N2 ఫ్లూ లో ఈ క్రింద పేర్కొనబడిన లక్షణాలు ఉంటాయి. ఈ వైరస్ బాధితుల్లో కోవిడ్-19 మాదిరి లక్షణాలే ఉంటాయి.
- జ్వరం
- గొంతు నొప్పి
- దగ్గు
- గొంతు మంట
- అలసట
- తల నొప్పి
- ముక్కు కారడం
- చలి ఎక్కువగా ఉండటం.
- వొళ్ళు నొప్ప్పులు
- వాంతులు
- జలుబు
నోట్: పైన పేర్కొన్న లక్షణాలు మీలో ఉంటె వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.
H3N2 చికిత్స ఎలా చేసుకోవాలి?
ఫ్రెండ్స్ H3N2 అంటూ వ్యాధి. ఇది ఒకరి నుండి ఒకరికి చాలా సులభంగా వ్యాపిస్తుంది.ఈ క్రింద మనం ఈ వైరేస్ కి చికిత్స ఎలా చేస్తారో? లేదా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
ఫ్రెండ్స్ హాంగ్‌కాంగ్ ఫ్లూ కు నాలుగు రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక దాని ద్వారా చికిత్స చేయండం జరుగుతుంది. అవి :
- పెరమివిర్
- బాలోక్సావిర్ మార్బాక్సిల్
- ఒసెల్టామివిర్ ఫాస్ఫేట్
- జనామివిర్
ఈ వైరేస్ కు చికిత్స కనీసం 5 రోజులు సిఫార్సు చేయబడుతుంది. ఇంకా కొందరికి నయం అవ్వడానికి ఎక్కువ రోజులు పట్టవచ్చు.
H3N2 ఫ్లూ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఫ్రెండ్స్ మనం క్రింది పేర్కొన్న జాగ్రత్తలను పాటిస్తే చాలా వరకు ఈ వైరేస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
- బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడం.
- రెగ్యులర్ హ్యాండ్ వ్యాష్ చేసుకోవడం.
- జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి.
- ఇతర వ్యక్తులు ముక్కు ఒళ్ళు తుడిచిన వస్తువులను మనం వాడకుండా ఉండాలి.
- తుమ్మినప్పుడు, దగ్గేటప్పుడు నోరు, ముక్కును కప్పి ఉంచుకోండి.
- ఆక్సిజన్ లెవెల్స్ తగ్గకుండా చూసుకోవాలి.
- ఆక్సిజన్ స్థాయి 95 శాతం కంటే తక్కువ ఉంటే వైద్యుడ్ని సంప్రదించాలి. ఒకవేళ 90కి కంటే తక్కువ ఉంటె ఐసీయూలో చికిత్స అవసరమవుతుంది.
- అనారోగ్య సమస్యలున్నవారు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
- బయటకు వెళ్ళినప్పుడు సామాజిక దూరం పాటించాలి.
- మీ వ్యక్తిగత డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం మానుకోండి
- ముఖ్యంగా ఇలాంటప్పుడు వాష్‌రూమ్‌ని ఉపయోగించిన తర్వాత, తినడానికి ముందు మరియు మీ ముఖం, నోరు మరియు కళ్లను తాకడానికి ముందు మీ చేతులను సబ్బు, నీటితో తరచుగా కడగాలి.
- విటమిన్ సీ ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం.
- ఉప్పు నీళ్ళు నోటిలో వేసుకొని పుక్కలించడం
- ఇతరులకు అంటే బయటకి వెళ్ళినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వవద్దు.
ఇవీ కూడా చదవండి