బాగ్యనగరం లో భారి వర్షాలు

0

హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తుతున్న వర్షాలు. వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో, హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలన్నీ,జలమయం అయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనాలు స్తంభించిపోయాయి.                                                                                                                                                 

గుడిమల్కాపూర్ లో అత్యధికంగా 14.8 సెంటీమీటర్లు వర్షం నమోదయింది.శివరాంపల్లి, సికింద్రాబాద్, మోండా మార్కెట్ ఏరియాలో13.9 సెంటీమీటర్ల వర్షం నమోదయింది.రెడ్ హిల్స్ కాలనీ,విజయనగర్ కాలనీలో 13.4 సెంటీమీటర్ల వర్షం నమోదయ్యింది. వీటిలోనే దాదాపు వంద కాలనీలు.చాలా చోట్ల ధ్వంసమైన రోడ్లు,రాష్ట్రంలో మరో 48 గంటల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం.రాత్రి 11 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు,వర్షం కుండపోతగా  కురుస్తోంది.కొన్ని చోట్ల అయితే, వర్షం ధాటికి పెద్దపెద్ద చెట్లు కూడా విరిగిపోయాయి.హుస్సేన్ సాగర్ అయితే, ఒక మహా సముద్రం గా మారింది.అందులోని నీరు 10 తూముల ద్వారా వదలడం జరుగుతుంది. మునుపెన్నడూ లేని విధంగా, ఈసారి భారీ వర్షాలు కురవడంతో, భాగ్యనగరం, అంతా జలమయంగా కనిపిస్తుంది.

ముఖ్యంగా కార్యాలయాల నుండి ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్,నాంపల్లి,కోటి,దిల్షుక్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్,తదితర ప్రాంతాలలో భారీ వర్షం పడుతోంది.పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. మోకాళ్ళ పైకి నీళ్లు వస్తుండటంతో,ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.పరిస్థితిని సమీక్షిస్తున్న నగర మేయర్ బొంతు రామ్మోహన్. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని జి హెచ్ ఎంసి జోనల్ కమిషనర్లకు నగర మేయర్ ఆదేశాలు జారీ చేశారు .

ఎటు చూసినా చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారులు. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనా రాకపోకలు .నీటమునిగిన రాజ్ భవన్ రోడ్డు .ఉస్మాన్ గంజ్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలోకి నీళ్లువరద నీళ్లతో విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు పడుతునారు .