highest grossing movies 2019 telugu
టాలీవుడ్ రంగంలో చిన్న పెద్ద వెరసి దాదాపు 200 చిత్రాలు విడుదల అవుతూ ఉంటాయి. కొన్ని డిజాస్టర్ గా మిగిలిపోతే మరికొన్ని అత్యధిక కలెక్షన్లను రాబడుతాయి. కొన్ని సినిమాలైతే ఫ్లాప్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు సాధించినవి కూడా ఉన్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఎంతో కుతూహలంతో విడుదలైంది. సుజిత్ దీనికి దర్శకుడు.
కథ ,కథనంలో లోపాలు ఉన్నప్పటికీ యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. అందువల్ల మరియు ప్రభాస్ వర ల్డ్వై డ్ క్రేజ్ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది.
తెలుగులో ఫ్లాప్ చిత్రంగా మిగిలిపోయింది అప్పటికీ కూడా హిందీలో భారీ వసూళ్లు రాబట్టింది.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ ,మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 433.6 కోట్లు రాబట్టి highest grossing telugu movies 2019 లో టాప్ ప్లేస్ లో నిలిచింది.
ఆ తర్వాత తొలి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథనంతో విడుదలైన చిత్రం సైరా నరసింహారెడ్డి.
ఇందులో ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, నయనతార ,అమితాబచ్చన్ జగపతిబాబు ,విజయ్ సేతుపతి,సుదీప్ వంటి ప్రముఖులంతా నటించారు. ఈ సైరా సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో హీరో రామ్ చరణ్ నిర్మాతగా మారి దీన్ని నిర్మించాడు. ఈ సైరా సినిమా హిందీలో తప్పితే మిగతా అన్ని భాషల్లోనూ విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 250 కోట్లు వసూళ్లు రాబట్టింది. అందుకే ఈ సినిమా top collection movies in telugu 2019 లో టాప్ 2 గా నిలిచింది.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం మహర్షి ఇది. తన సినీ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గా చెప్పవచ్చు.
యాక్షన్, మెసేజ్ ,ఎమోషన్ లాంటి అన్ని హంగులతో ఈ మూవీ గొప్పగా నిర్మించబడింది. అందుకే ఇది బెస్ట్ మూవీగా నిలబడి ,175 కోట్లు వసూలు చేసి top collection movies in telugu 2019 లో టాప్ 3 మూవీగా నిలిచింది.
విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం F2 అనిల్ రావిపూడి దర్శకుడు. 2019 సంవత్సరం సంక్రాంతి బరిలో నిలబడి, గొప్ప సినిమాలు ఐన వినయ విధేయ రామ, పేట లాంటి చిత్రాలను సైతం వెనక్కు నెట్టి , ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా గట్టి పోటీ ఇచ్చింది. 2019 సంక్రాంతి పండుగకు గొప్ప బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది f2 సినిమా. అంతే కాక ప్రపంచ వ్యాప్తంగా 137.6 కోట్లు వసూలు చేసింది. telugu box office collection 2019 లో ఇది కూడా ఒక గొప్ప మూవీ అని చెప్పుకోవచ్చు.
మాస్ తరహా మూవీ రంగస్థలం తర్వాత రామ్ చరణ్ చిత్రం వినయ విధేయ రామ బోయపాటిశ్రీను దర్శకత్వంలో తెరకెక్కింది. మాస్ ఎలిమెంట్స్ మస్తుగా ఉన్న ఈ చిత్రంపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే వినయ విధేయ రామ రిలీజ్ అయిన తర్వాత అవి అన్ని నీరుగారిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 97.9 కోట్లు రాబట్టి హైయెస్ట్ గ్రాస్ లెవల్లో ఒకటిగా పేరుపొందింది.
ఇస్మార్ట్ శంకర్, ఈ సినిమాకు ముందు దర్శకుడు పూరి జగన్నాథ్ ,హీరో రామ్ పోతినేని తో కలిసి నిర్మించిన చిత్రాలన్నీ వరుస ఫ్లాపులతో వచ్చాయి. అయితే ఈ మూవీ విడుదలైన మొదటి రోజునే మంచి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా ఇద్దరికీ మంచి కిక్ ఇచ్చింది.పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 83 కోట్లు రాబట్టి హైయెస్ట్ గ్రాస్స్ లెవెల్ లో టాప్ లో ఒక మూవీ గా నిలబడింది.
నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం మజిలీ. శివ నిర్వాణ దర్శకుడు.అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించగా రావు రమేష్ పోసాని కృష్ణమురళి సుబ్బరాజు తదితరులు నటించారు. కుటుంబ కథా చిత్రాల నిర్మించడంలో తానేంటో చూపించిన శివ నిర్వాణ దర్శకుడు. కాగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లు రాబట్టింది.
ఇక విమర్శకుల నోట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా పేర్కొనదగినది, నాని నటించిన జెర్సీ సినిమా. అర్జున్ అనే పాత్రలోకి నాని పరకాయప్రవేశం చేసి మరీ నటించాడని ప్రేక్షకులు ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా 51.7 కోట్లు రాబట్టి వరుస ప్లాపులతో సతమతమైన నాని కి ఈ చిత్రం మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. highest grossing tollywood movies 2019 లో చోటు సంపాదించింది.
విక్టరీ వెంకటేష్ ,నాగచైతన్య కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం వెంకీ మామ. దర్శకుడు కేఎస్ రవీంద్ర ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్ టైనర్గా దీన్ని నిర్మించాడు. రాశీఖన్నా మరియు పాయల్ రాజపుత్ హీరోయిన్ లుగా నటించారు. ఎమోషన్స్, కామెడీ, సెంటిమెంట్ వంటివి పుష్కలంగా ఉండడంతో ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్లు రాబట్టిన ట్లు తెలుస్తోంది.
తమిళ రీమేక్ ని వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ చిత్రం. పూర్తి నెగటివ్ రోల్ లో వచ్చినటువంటి చిత్రం . హరీష్ శంకర్ దీనికి దర్శకుడు. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్తో వచ్చి భారీగా విజయాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 42.5 కోట్లు రాబట్టింది.