Home remedy for joint pain in knees in telugu
కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలకు అద్భుతమైన చిట్కా – శరీరంలో అన్ని నొప్పులు మాయం. వాత దోషాలను తొలగించుకోవడానికి ఈ చిట్కా ప్రయత్నించండి.
మన శరీరంలో వాయువు ఎక్కువగా పెరిగి పోవడం వల్ల ఈ వాతం అనేది శాతం పెరిగి కీళ్లు , మోకాళ్ళ లో చేరుకోవడం వల్ల నొప్పులు అధికమవుతాయి. కూర్చున్నా, నిలబడినా కీళ్ల నుండి రకరకాల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి.
శరీరంలో వాతం పెరగడం వల్ల కీళ్ల వద్ద ఉండే గుజ్జు కరిగిపోయి నొప్పులు మొదలవుతాయి. చేతులు, మోచేతులు, కాళ్లు, మోకాళ్ళు, వెన్నెముక మరియు భుజాలలో కూడా ఈ నొప్పులు బాధ పెడుతూ ఉంటాయి.
కీళ్ళ నొప్పులకు కారణాలు
సాధారణంగా కీళ్ల మధ్య లో మనకు లూబ్రికెంట్ పదార్ధం ఉంటుంది ఈ పదార్థం పరిమాణం తగ్గడం వల్ల కీళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. దీనివల్ల భయంకరమైన కీళ్లనొప్పులు అనుభవించడం జరుగుతూ ఉంటుంది.
కీళ్ళ నొప్పుల కోసం నివారణ చిట్కాలు
ఇప్పుడు ఈ చిట్కాను కనుక మీరు పాటిస్తే, శరీరం లో ఉన్న నొప్పులు తగ్గిపోతాయి. చాలా వరకూ ఉపశమనం కలుగుతుంది. ప్రశాంతత లభిస్తుంది. ఆర్థరైటిస్ వంటి వ్యాధి నొప్పులను కూడా తగ్గిస్తుంది.
కావలసిన పదార్థాలు
50 గ్రాముల సొంఠి తీసుకోవాలి. 50 గ్రాములు మెంతులు తీసుకోవాలి. ఇవి రెండూ కూడా శరీరంలో వాతాన్ని మరియు కఫాన్ని తగ్గిస్తాయి. తరువాత వాము 50 గ్రాములు తీసుకోవాలి. వాము శరీరంలో వాతాన్ని తగ్గిస్తుంది మరియు జీర్ణశక్తిని పెంచుతుంది.
ఈ పదార్థాలు మూడింటినీ మిక్సీలో వేసి మెత్తటి పౌడర్ తయారు చేసుకోవాలి.ఇందులోకి ఒక చెంచా బెల్లం పొడి కలపాలి. ఈ పౌడర్ ను గోరువెచ్చటి నీళ్ళలో ఒక చెంచా చొప్పున వేసుకుని ప్రతి రోజూ తాగాలి. తర్వాత దీని వల్ల శరీరానికి మంచి పుష్టి కలుగుతుంది. మంచి ఎనర్జీ ఇస్తుంది.
రక్తహీనతను తగ్గిస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. ప్రతి రోజూ టిఫిన్ తినడానికి అరగంట ముందు పదిహేను రోజులు వాడాలి. దీన్ని ఇలా తీసుకుంటే కీళ్ల మధ్య ఉండే కార్టిలేజ్ పెరగడం ప్రారంభిస్తుంది.
ఈ 15రోజులు మసాలా పదార్థాలు తినకూడదు.
నివారణ చర్యలు
కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. కాల్షియం మరియు విటమిన్ డి కోసం ప్రతిరోజు ఉదయం పూట అరగంటసేపు సూర్యకిరణాలు ప్రసరించే విధంగా ఎండలో కూర్చోవాలి. పాలు, పాల కూర, బెండకాయ తప్పకుండా తీసుకోవాలి.
రాగులు, సజ్జలు, నువ్వులు తప్పనిసరిగా తీసుకోవాలి. తెల్ల నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. నాన బెట్టి న బాదంపప్పులు , acrotes కూడా తినాలి. వీటి వల్ల కీళ్ల మధ్య ఉండే లూబ్రికెంట్ శాతం బాగా పెరుగుతుంది. కీళ్ల మధ్య ఉండే కార్టిలేజ్ తగ్గిపోయి టక్ టక్ మని శబ్దం వస్తూ ఉంటే acrotes తప్పనిసరిగా తినాలి.
ప్రతిరోజూ తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ మరియు లంచ్ లు సమయానికి అనుగుణంగా తీసుకుంటూ ఉండాలి. రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఫిజికల్ యాక్టివిటీస్, వాకింగ్, రన్నింగ్ చేయాలి. రాత్రిపూట నిద్ర పోయే ముందు పసుపు పాలు తాగాలి.
గమనిక:- ఈ చిట్కాలు పాటించే పదహైదు రోజులు పుల్లని పదార్థాలను తినకూడదు. మరియు చల్లని తినుబండారాలు, చల్లని ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదు.
ఇవి కూడా చదవండి :-
- ఒక్క నిమిషంలో పసుపు పచ్చగా ఉండే మీ పళ్ళను తెల్లగా మార్చుకోండి
- మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు
- ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి
- ఇలాంటి వారికి నిద్ర లోనే ప్రాణం పోతుంది
- మీ చర్మ నిగారింపు కోసం కేవలం రూ.15 చాలు
- ఒక్క నిమిషంలో మీ దురదను ఇలా పోగొట్టండి !