How to increase eyesight home remedies in telugu 2021
కరివేపాకుతో కంటి చూపు — కళ్ళజోడు తో పనిలేదు !!
నేటి కాలంలో పిల్లలు చదువులు మరియు ఆన్లైన్ చదువుల వల్ల అతి చిన్న వయసులోనే కళ్ళజోడు ఉపయోగించడం చాలా దురదృష్టకరం. బాధ్యత కలిగిన తల్లిదండ్రులు గా మీ పిల్లలు చిన్న వయస్సులోనే కళ్ళజోడు ధరించకూడదు అని అనుకుంటున్నారా? అలా అయితే ప్రకృతి వైద్యంలో తెలియజేసిన ఈ చిట్కాలు పాటించండి.
కంటి చూపు తగ్గిపోకుండా చూడటానికి మనం తీసుకునే ఆహార పదార్థాలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. కంటి చూపు మెరుగు కావడానికి అవసరమైన ఆహార పదార్థాల గురించి ఈ రోజు ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
కంటి చూపు తగ్గిపోవడానికి గల కారణాలు
1. పుస్తకాలలోని చిన్న అక్షరాలు
2. ఆన్లైన్ చదువులకోసం సెల్ఫోన్, ట్యాబ్, కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ తెరల మీద ఆధారపడటం.
3. సరైన నిద్రలేకపోవడం.
4. కంటికి అవసరమైనంత విశ్రాంతి ఇవ్వకపోవడం.
150 సంవత్సరాల పాటు చూపును ఇవ్వాల్సిన కన్నులు, నేటి పరిస్థితుల వల్ల పిల్లలకు అతి చిన్న వయసులోనే కళ్ల జోడు అలవాటు అవుతున్నది. కళ్ళు బాగా పనిచేయాలంటే కంటి చూపుకు అవసరమైన ప్రధానమైన విటమిన్- A.
కేవలం జంతు సంబంధ పదార్థాల నుండి మాత్రమే విటమిన్ A నేరుగా లభిస్తుంది. కానీ శాకాహార పదార్థాలలో కెరోటిన్ రూపంలో విటమిన్ A లభిస్తుంది. ఈ కెరోటిన్ ముఖ్యంగా క్యారెట్ లలో మరియు పసుపు రంగులో ఉన్న కూరగాయల్లో లభిస్తుంది. మన శరీరంలో ఉండే లివరు ఈ కెరోటిన్ ను విటమిన్ A గా మారుస్తుంది. మీ పిల్లల్లో కంటి చూపు మెరుగు కావడానికి ప్రతి రోజు ఉదయం పూట ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ ఇవ్వాలి.
మంచి కంటి చూపు కోసం జ్యూస్ తయారీ విధానం
3 క్యారెట్లు, మూడు టమాటాలు, చిన్న కీరా దోసకాయ, బీట్రూట్ కొన్ని ముక్కలు సిద్ధంగా ఉంచుకోవాలి. మిక్సీలో ముందుగా టమాటాలు, కీరా దోసకాయ ముక్కలు వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత క్యారెట్లు, బీట్రూట్ ముక్కలు వేసి మిక్సీలో జ్యూస్ తయారు చేసుకోవాలి.
దీనిని వడగట్టి పిల్లలకు నేరుగా ఉదయం పూట తప్పనిసరిగా ఇవ్వాలి. పిల్లలు మొదట్లో తాగడానికి ఇబ్బంది పడితే ఈ జ్యూస్ లో కి తేనె లేదా నిమ్మరసం కలిపి తాగే టట్లు అలవాటు చేయించాలి. ఎండు ఖర్జూరం పొడిని కూడా ఈ జ్యూస్ లోకి కలిపి ఇవ్వవచ్చు.
1) ఈ జ్యూస్ తాగడం వల్ల రక్తం అభివృద్ధి చెందుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు మలబద్ధకం తొలగిపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా కంటి చూపు అభివృద్ధి చెందుతుంది. ఒక సంవత్సరం వయసు కలిగిన పిల్లల నుండే ఈ జ్యూస్ తాగించడం అలవాటు చేయిస్తే వారికి భవిష్యత్తులో కంటి చూపు మందగించి కళ్ళజోడు అవసరం రాదు.
2) ఈ జ్యూస్ తాగడం బాగా అలవాటు చేసుకున్న తర్వాత జ్యూస్ లో కి కరివేపాకు బాగా గ్రైండ్ చేసి కలిపి ఇవ్వాలి. మునగాకు కూడా గ్రైండ్ చేసి కలిపి ఇవ్వొచ్చు. ఎందుకంటే కరివేపాకు తో పాటు మునగాకు లో కూడా విటమిన్ A సమృద్ధిగా లభిస్తుంది.
3) మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా ఏదో ఒక రకమైన ఆకుకూర ఆహారంగా తీసుకోవాలి. ఆకుకూరల్లో కావల్సినంత విటమిన్ A లభిస్తుంది. పళ్ళు, కూరగాయలు మరియు గింజలలో విటమిన్ A ఎక్కువగా లభించదు. కేవలం ఆకుకూరల్లో నుండి నేరుగా విటమిన్ A లభిస్తుంది. ప్రతిరోజు ఒక రకం ఆకుకూర తప్పనిసరిగా ఆహారంలో భాగంగా ఏర్పాటు చేసుకోవాలి.
కంటి చూపు మందగించ కుండా మెరుగవడానికి కావలసిన ఆహార పదార్థాలు ఉన్నాయి కానీ కళ్లజోళ్లు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని శ్రద్ధతో గమనించాలి.
ఇవి కూడా చదవండి :-
- ఒక్క నిమిషంలో పసుపు పచ్చగా ఉండే మీ పళ్ళను తెల్లగా మార్చుకోండి
- మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు
- ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి
- కేవలం ధనియాల నీళ్ళు తాగితే 18 రకాల రోగాలు మాయం
- ఈ రసం తాగితే 50 రకాల జబ్బులు మీ దరి చేరవు
- ఒక్క నిమిషంలో మీ దురదను ఇలా పోగొట్టండి !