మీ సిబిల్ స్కోర్ / క్రెడిట్ స్కోర్ ని పెంచే 10 ఉత్తమ మార్గాలు 2022

0
సిబిల్ స్కోర్ వెంటనే మెరుగుపరచడం ఎలా
సిబిల్ స్కోర్ వెంటనే మెరుగుపరచడం ఎలా

How to increase my cibil score in telugu | how to increase credit score in telugu | సిబిల్ స్కోర్ వెంటనే మెరుగుపరచడం ఎలా ?

మీ సిబిల్ క్రెడిట్ స్కోర్ ను పెంచుకోవటానికి మార్గాలు : మీరు ఏ బ్యాంక్ అయినా ఏ సంస్థ నుండైనా లోన్ తీసుకుంటే మన యొక్క పూర్తి వివరాలు వారి దగ్గర ఉంటాయి. మనం తీసుకున్న లోన్ అమౌంట్ సకాలంలో వారికి చెల్లించకపోతే వారు మన యొక్క సిబిల్ స్కోర్ ను తగ్గించి చూపిస్తూ ఉంటారు.

ఈ సిబిల్ స్కోర్ సాధారణంగా 300 పాయింట్స్ నుండి 900 పాయింట్స్ వరకు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. మన యొక్క సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే మన ర్యాంకు మంచిగా ఉన్నట్లు లెక్క. ఒకవేళ 750 కంటే తక్కువగా ఉంటే మన లోన్ విషయంలో మనం చెడుగా ఉన్నట్లే.

కాబట్టి మన బిల్స్ EMI సకాలంలో చెల్లిస్తూ ఉంటే మన సిబిల్ స్కోర్ రేటు పెరుగుతూ ఉంటుంది. సరైన టైంకి చెల్లించకపోతే సిబిల్ స్కోర్ రేటు తగ్గిపోతుంది. మనం ఈ సిబిల్ స్కోర్ ని చాలా సులువుగా చేక్చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు.

సిబిల్ స్కోర్ పెంచుకోవటానికి మార్గాలు

cibil score website

* మీరు తీసుకున్న లోన్ కు ఈ ఎం ఐ సకాలంలో చెల్లించడానికి ప్రయత్నించాలి.

* మీరు కట్టాలి అనుకుంటున్న EMI లు సాధారణంగా ఒక నిర్దిష్టమైన తేదీ కంటే కొంచెం ముందుగా చెల్లించి నట్లైతే, మీ సిబిల్ స్కోర్ రేటు తప్పకుండా పెరుగుతుంది.

*మీరు చెల్లించే ఈ EMI ల గురించి ముందుగానే గూగుల్ క్యాలెండర్ లో రిమైండర్ సెట్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.

*మీ సేవింగ్స్ బ్యాంక్ బ్రాంచీలు సంప్రదించి, మీ EMI లకు సంబంధించిన పేమెంట్స్ అన్నింటికీ కూడా ఆటో డెబిట్ పే అయ్యే విధంగా చేస్తే మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది.

*క్రెడిట్ కార్డును ఉపయోగించి ఆన్ టైం కన్నా కొంచెం ముందుగా పేమెంట్స్ చేయడంవల్ల ఆటోమేటిక్ గా సిబిల్ స్కోర్ పెరుగుతుంది.

*మీ దగ్గర క్రెడిట్ కార్డు లేకపోతే, ఒకవేళ మీ దగ్గర ఉన్న కేవలం ఒక లక్ష రూపాయల డబ్బును ఏదైనా ఒక బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా క్రెడిట్ కార్డు పొందవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ సహాయంతో చిన్న చిన్న EMI లను చెల్లించవచ్చు. ఇలా చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ వేగంగా పెరుగుతుంది.

*మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డు ద్వారా కేవలం 30% వరకు మాత్రమే బిల్ పేమెంట్ చేసే విధంగా నేర్చుకోవాలి.
ఒకవేళ 30% కంటే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటే ఇది ఇది సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది.

*లోన్ తీసుకున్న బ్యాంకుకు వెళ్లి, EMI అమౌంట్ను కాస్త తగ్గించి, లోన్ యొక్క టెన్యూర్ ను పెంచమని ఒక రిక్వెస్ట్ లెటర్ అందచేయాలి. ఇలా చేయడం వల్ల తక్కువ పేమెంటు ను ఈ EMI ద్వారా చెల్లించొచ్చు. దీనివల్ల మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది.

*ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ సిబిల్ రిపోర్ట్ ను చెక్ చేసుకోవాలి. దీని ద్వారా అనవసరమైన లోన్ల కు సంబంధించిన రాంగ్ ఎంట్రీలు మీ రిపోర్టులో రాకుండా చూసుకోవచ్చు.

*మీ మిత్రులు, బంధువులు లేదా ఇతరులకు లోన్ కోసం షూరిటీ గా సంతకం చేసి పాన్ కార్డ్ ఇవ్వడం వల్ల మీకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే మీ సపోర్ట్ తో లోన్ తీసుకున్న వారు EMI లను సరిగా చెల్లించకపోతే దీని ఫలితంగా మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది.

*మీకు పర్సనల్ లోన్ అవసరమైనప్పుడు దాదాపు మూడు లేదా నాలుగు బ్యాంకులకు వెళ్లి లోన్ కోసం అప్లై చేయకూడదు. ఇలా చేస్తే ఆ బ్యాంకులన్నీ మీయొక్క సిబిల్ రిపోర్ట్ ను ఎంక్వయిరీ చేసినప్పుడు దానిని హార్డ్ ఎంక్వయిరీ అని అంటారు. ఇది మీ సిబిల్ రిపోర్ట్ ను తగ్గిస్తుంది.

*మీరు గతంలో పాత మొబైల్ నెంబర్ తో లేదా పాత ఈమెయిల్ ఐడి నెంబర్ తో తీసుకున్న క్రెడిట్ కార్డ్స్ వాడకుండా ఉంచినప్పటికీ, ఆ క్రెడిట్ కార్డుల కు సంబంధించిన మెయింటెనెన్స్ ఛార్జ్ గురించి మీకు సమాచారం మొబైల్ నెంబర్ కు కానీ ఈమెయిల్ రూపంలో గాని వస్తూ ఉంటుంది.

*ఈ విషయం మీకు తెలియక పోవడంతో మీరు ఆ మెయింటినెన్స్ చార్జెస్ చెల్లించకపోవడం వల్ల, మీకు తెలియకుండానే సిబిల్ స్కోర్ రేటు తగ్గిపోతుంది. కాబట్టి పాత క్రెడిట్ కార్డ్స్ అకౌంట్స్ ను వెంటనే బ్యాంకు కు వెళ్లి క్యాన్సిల్ చేయించుకోండి.

*క్రెడిట్ కార్డ్స్ తీసుకున్న బ్యాంకు కు మీ మొబైల్ నెంబర్ మార్చినప్పుడు లేదా ఈ మెయిల్ ఐడి మార్చినప్పుడు వెంటనే తెలియజేయండి.

ఇది కూడా చదవండి :-