Table of Contents
Zerodha అకౌంట్ అంటే ఏమిటి? ఈ అకౌంట్ ని ఎలా ఓపెన్ చేసుకోవాలి?
Zerodha Account In Telugu: ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో మనం జీరోధా అకౌంట్ అంటే ఏంటి? ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అంటే అర్హత ఏమి ఉండాలి, డాకుమెంట్స్ ఏమి కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
ఫ్రెండ్స్ ఈ జీరోధా అకౌంట్ అనేది ఒక డిమ్యాట్ అకౌంట్. సింపుల్ గా చెప్పాలి అంటే భారతదేశంలోని స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు BSE, NSE & MCXలో ఈక్విటీ, డెరివేటివ్‌లు, కమోడిటీ మరియు కరెన్సీ విభాగాలలో ట్రేడింగ్ సేవలను అందించే డిస్కౌంట్ స్టాక్ బ్రోకర్. Zerodha 2010లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. క్రింద ఈ అకౌంట్ గురించి ఇంకొంచం వివరంగా తెలుసుకుందాం.
Zerodha Account Eligibility In Telugu
ఫ్రెండ్స్ జెరోధా అకౌంట్ ని మనం ఓపెన్ చేసుకోవాలి అంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పౌరులై ఉండాలి.
- వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి.
- నెలకు కనీసం 15,000 రూ.. కంటే ఎక్కువ ఆదాయం ఉండాలి.
Zerodha Account Required Documents In Telugu
మనం ఈ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డ్.
- పాన్ కార్డ్.
- ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్.
- సంతకం ని స్కాన్ చేసిన కాపీ.
- మీ ఆదాయం 1 లక్ష కంటే ఎక్కువ ఉంటె ITR.
- మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్.
- ఫారం 16
Zerodha Account Features In Telugu
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ zerodha అకౌంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- భారత దేశంలోనే అతి పెద్ద స్టాక్ బ్రోకర్.
- ఈ అకౌంట్ లో ఫీజులు కూడా చాలా తక్కువ.
- ఇది 100% సురక్షితమైన అకౌంట్.
- ఇది క్లయింట్ డబ్బుతో యాజమాన్య వ్యాపారం చేయదు.
- 2-ఇన్-1 అకౌంట్ లాగా పని చేస్తుంది.దీనివల్ల ట్రేడింగ్ మరియు డీమ్యాట్ ఖాతాల మధ్య ఒకేరకమైన లావాదేవీలను అందిస్తుంది.
- స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్ కోసం తక్కువ ఛార్జీలు వసూలు చేస్తుంది.
How To Open Zerodha Account In Telugu
ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఈ zerodha అకౌంట్ యొక్క ఫీచర్స్, డాకుమెంట్స్, అర్హతల గురించి తెలుకున్నాం. ఇప్పుడు ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా జీరోధా మెయిన్ వెబ్సైట్ కి వెళ్ళండి.
- మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి continue పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ కి ఒక otp వస్తుంది దాన్ని ఎంటర్ చేసి continue పై క్లిక్ చేయండి.
- మీ పేరు, ఇ మెయిల్ ఐడి ని చేసి continue పై క్లిక్ చేయండి.
- మీ మెయిల్ కి ఒక otp వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి continue పై క్లిక్ చేయండి.
- మీ పాన్ కార్డు నెంబర్, డేట్ అఫ్ బర్త్ ని ఎంటర్ చేసి continue పై క్లిక్ చేయండి.
- తర్వాత పేమెంట్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకొని pay&continue పై క్లిక్ చేయండి.
- ఆధార్ kyc కోసం continue to Digilocker పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి next పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ కి otp వస్తుంది దాన్ని ఎంటర్ చేసి continue పై క్లిక్ చేయండి.
- తర్వాత allow పై క్లిక్ చేయండి.
- your profile ఓపెన్ అవుతుంది. ఇందులో మీ మ్యారిటల్ స్టేటస్, మీ తల్లితండ్రుల పేర్లు,మీ య్యనువల్ ఇన్కం ని ఎంటర్ చేసి continue పై క్లిక్ చేయండి.
- link bank account పేజి ఓపెన్ అవుతుంది. ఇందులో మీ బ్యాంకు అకౌంట్ బ్రాంచ్ యొక్క ifsc code, బ్రాంచ్ micr code, అకౌంట్ నెంబర్,ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిసన్స్ ని సెలక్ట్ చేసుకొని continue పై క్లిక్ చేయండి.
- కోన్ని పర్మిషన్స్ అడుగుతుంది. వాటిని allow చేసేయండి.
- వాళ్ళు ఒక నెంబర్ ని ఇస్తారు. దానిని ఒక పేపర్ లో రాసుకొని సెల్ఫి తీసుకొని capture పై క్లిక్ చేయండి.
- తర్వాత మీ డాకుమెంట్స్ ని అప్లోడ్ చేయండి. డాకుమెంట్స్ అంటే పాన్ కార్డు, మీ సంతకం వంటివి.
- నామిని ని కావాలంటే add చేసుకోవచ్చు. లేదంటే skip&continue పై క్లిక్ చేయండి.
- esign ని చేసుకోండి. అంటే మీరు esign పై క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్స్ వస్తాయి క్రింద proceed to esign అని ఉంటుంది.దాని పై క్లిక్ చేయండి.
- తర్వాత మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి send otp పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ కి ఒక otp వస్తుంది.దాన్ని ఎంటర్ చేసి verify otp పై క్లిక్ చేయండి.
- మీ ప్రొఫైల్ వెరిఫై అవుతుంది.క్రింద sign now పై క్లిక్ చేయండి.
- మల్లి మీరు మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి send otp పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ కి ఒక otp వస్తుంది.దాన్ని ఎంటర్ చేసి verify otp పై క్లిక్ చేయండి.
- మీ esign successfully అవుతుంది.
- తర్వాత esigned document పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి లేదా ఆ ఆప్షన్ క్రింద finish పై క్లిక్ చేయండి.
- 24 గంటల తర్వాత మన మెయిల్ కి యూసర్ id సెండ్ చేస్తారు. దాని ద్వారా మనం లాగిన్ అవ్వవచ్చు .
పైన తెలిపిన విధంగా మీరు ఆన్లైన్ లో zerodha అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు.