Table of Contents
మీ శరీరంలోని వేడిని నిమిషాల్లో పోగొట్టే చిట్కాలు
బాడి హిట్:- ఫ్రెండ్స్ మన అందరికి ఈ బాడి హీట్ గురించి తెలిసే ఉంటుంది.ఎందుకంటే మనమందరం ఎప్పుడో ఒక్కసారి దీని బారినపడి ఉంటాం. ఇంతకు ముందు వేసవి కాలంలో దినిబారిన ఎక్కివగా పడేవాళ్ళం. కానీ ఇప్పుడు మారుతున్న జీవన శైలి, ఉష్నోగ్రతలలో మార్పుల వలన మనం ఎప్పుడు పడితే అప్పుడు ఈ సమస్యతో బాధపదుతున్నాం.
ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తిన్నా, జంక్ ఫుడ్, నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలను తిన్నా, మద్యం ఎక్కువగా సేవించినా, మాంసాహారం ఎక్కువగా తిన్నా మన శరీరంలో వేడి చేస్తుంది. శరీరానికి సరిపడు నీళ్లు తాగకపోయినా కూడా వేడి అవుతుంది.
ఇప్పుడు మనం మన శరీరంలోని వేడిని ఎలా తగ్గించుకోవాలి?, వాటికీ ఏమైనా చిట్కాలు ఉన్నాయా? అనే విషయాల గురించి ఈ ఆర్టికల్ లో క్లియర్ గా తెలుసుకుందాం.
Body Heat Reduce Tips Telugu
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శరీరంలోని హిట్ ని తగ్గించే కొన్ని చిట్కాలు గురించి క్రింద వివరంగా తెలుసుకుందాం.
1.గోరువెచ్చని పాలు:
మన శరీరంలోని వేడిని తగ్గించడానికి గోరోవేచ్చని పాలు బాగా ఉపయోగపడతాయి. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కొంచం పచ్చి కర్పూరం, యాలకుల పొడి, గసగసాల పొడి కలుపోని తాగితే మన శరీరంలోని వేడి మొత్తం మాయం అవుతుంది.
2.మెంతులు :
ఫ్రెండ్స్ మెంతులు కూడా బాడి హిట్ ని తొందరగా తగ్గిస్తాయి, శరీరంలో వేడి చేసినవారు ఉదయం లేవగానే ఒక చెంచా మెంతులు తింటే వెంటనే ఉపసమనం కలుగుతుంది. ఇంకా మీరు రాత్రి మెంతులను నానబెట్టి ఉదయం ఆ నీటిని, మెంతులని తింటే ఇంకా ప్రయోజనంగా ఉంటుంది.
3.నిమ్మరసం:
నిమ్మరసం శరీరాన్ని చల్లగా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది, ఉదయం లేవగానే గ్లాసుడు నిమ్మరసం తాగితే ఒంట్లో వేడి తొందరగా తగ్గుతుంది. ఉప్పు, లేదా పంచదార వేసుకుని కూడా నిమ్మకాయ రసంను తాగొచ్చు.
4.ఎండు ఖర్జూరం
ఒక మూడు లేదా నాలుగు ఎండు ఖర్జురాలను తీసుకుని రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే వేడి తగ్గుతుంది. ఇవి మనకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి.
5.పుట్టగొడుగులు:
పుట్టగోడుగులనే మనం మసృమ్స్ అని పిలుస్తాం.వీటి వలన మన శరీరంలోని వేడి నిమిషాల్లో మాయం అవుతుంది. ఎలా అంటే వీటిలో 15 రకాల విటమిన్స్ ఉంటాయి.కాబట్టే వేడి తొందరగా తగ్గుతుంది.
6.గంధం:
గంధం అంటే మన అందరికి తెలిసే ఉంటుంది దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంధాన్ని చల్లని నీటిలో కానీ లేదా పాలలో కానీ కలిపి నుదుటకు రాసుకుంటే వేడి మటుమాయం అవుతుంది.
7.మజ్జిగ:
మజ్జిగ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి, రోజూ లేదా కుదిరితే రోజుకు రెండుసార్లు మజ్జిగ తాగడం వల్ల మన శరీరం తొందరగా చల్లబడుతుంది. స్త్రీ లలో ఎవరైతే ఈ వేడి బారిన ఎక్కువగా పడుతుంటారో వారు మజ్జిగను క్రమం తప్పకుండా రోజు తాగితే ఈ సమస్య నుంచి తొందరగా ఉపసమనం పొందుతారు.
8.కొబ్బరి నీరు :
మనలోని వేడిని తగ్గించడంలో కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. ప్రతి రోజు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు తాగటం వలన మన శరీరంలోని వేడి తొందరగా తగ్గుతుంది.
9.స్విమింగ్:
మన బాడిలోని వేడిని తగ్గించుకోవడానికి చేసే పనులలో ఈ స్విమింగ్ కూడా ఒకటి. ఎందుకంటే స్విమ్మింగ్ చేయటం వల్ల శరీర ఉష్ణోగ్రత కొంచం తగ్గుతుంది. వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
10.కలబంద
ఫ్రెండ్స్ కలబంద కూడా మన శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. కలబంద యొక్క రసం (జెల్) ను మన శరీరానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో స్నానం చేస్తే మన బాడిలోని వేడి తొందరగా తగ్గుతుంది.
11.మంచి నీరు:
మనం నీళ్ళు సరిగా తాగకపోయినా కూడా మన శరీరంలో వేడి చేస్తుంది. అందుకే మనం నీటిని ఎక్కువగా తాగాలి. నిపుణుల ప్రకారం మన రోజును కనీసం 3 లీటర్ల నీటిని తాగాలి.ఇలా రోజు తాగితే ఈ వేడి అనేదే మన జోలికి రాదు.
శరీరంలో వేడి చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మనం ఈ క్రింది జాగ్రత్తలను పాటిస్తే మన బాడిలో వేడి చేయకుండా ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం.
- నాన్ వెజ్, స్పైసీ, జంక్ ఫుడ్ మరియు ఆల్కహాల్ కి దూరంగా ఉండటం. అంటే వీటిని అతిగా తినకుండా లిమిట్లో తినాలి.
- రోజు ఉదయం లేవగానే దానిమ్మ జ్యూస్ తాగటం.
- అరటి పళ్లు, పుచ్చకాయ, బయాపిల్, గసగసాలు, ఎండుద్రాక్ష, వంటివి రోజు తినటం.
- ప్రతిరోజు మన శరీరానికి అవసరమైన నీటిని త్రాగటం.
- మీకు వేడి అనిపించినప్పుడు ఫ్యాన్, కూలర్ల వద్ద కొన్ని నిమిషాలు కూర్చుని సేదతీరాలి.
గమనిక: పైన తెలిపిన సమాచారం మొత్తం మాకి ఇంటర్నెట్ లో దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము. వీటి ద్వారా ఫలితం రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి మీరు వీటిని పాటించే ముందు డాక్టర్ ని ఒక్కసారి కలవండి.
Also Read
Belly Fat Reduce Tips In Telugu 2024