Table of Contents
SBI బ్యాంకు నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవటం ఎలా?
SBI బ్యాంకు : SBI బ్యాంకు గురించి తెలియని వారు అంటూ ఎవ్వరు ఉండరు. మన దేశంలోనే అతి పెద్ద బ్యాంకు. ఈ బ్యాంకు తన కస్టమర్లకి చాలా రకాల సేవలను అందిస్తుంది. వాటిలో లోన్స్ కూడా ఒక భాగం.
ఈ బ్యాంకు పర్సనల్ లోన్స్, హోం లోన్స్ తో పాటు ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ప్రోవైడ్ చేస్తుంది. ఈ లోన్స్ వలన స్టూడెంట్స్ లోన్స్ తీసుకొని వారికీ నచ్చిన చదువుని అంటే కోర్స్ లను చేసుకోవచ్చు. వడ్డీ కూడా తక్కువగానే ఉంటుంది. ఈ ఆర్టికల్ లో మనం ఈ SBI ఎడ్యుకేషన్ లోన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
SBI Education Loan Eligibility In Telugu
ఫ్రెండ్స్ మనం sbi లో ఎడ్యుకేషన్ లోన్ పొందాలి అంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పోరులై ఉండాలి.
- మీరు ప్రవేశ పరీక్ష లేదా ఎంపిక ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిన ప్రీమియర్ సంస్థల్లో ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులకు అడ్మిషన్ పొంది ఉండాలి.
- బ్యాంకు లో అకౌంట్ ఉండాలి.
SBI Education Loan Required Documnets In Telugu
ఈ క్రింద మనం sbi ఎడ్యుకేషన్ లోన్ పొందాలి అంటే మన వద్ద ఏ డాకుమెంట్స్ ఉండాలో తెలుసుకుందాం.
- ఆధార్ కార్డ్.
- పాన్ కార్డ్.
- SSC మరియు ఇంటర్ యొక్క మార్క్‌షీట్.
- ప్రవేశ పరీక్ష ఫలితం అంటే మీరు ఏవైనా కోర్సు ఎంట్రెన్స్ ఎక్షమ్ రాసిఉంటే దాని రిసల్ట్ కాపి.
- ఆఫర్ లెటర్ లేదా అడ్మిషన్ లెటర్ లేదా ID కార్డ్ వీటిలో ఏదో ఒకటి ఉండాలి.
- కోర్సు ఖర్చుల షెడ్యూల్.
- స్టూడెంట్, తల్లిదండ్రులు,సహ రుణగ్రహీత, హామీదారుని యొక్క పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ఒక్కొక్కటి ఉండాలి.
- మీరు స్యాలరి పర్సన్ అయితే స్యాలరి స్లిప్స్.
- మీరు బిజినెస్ పర్సన్ అయితే itr ఉండాలి.
- పేరెంట్ ఉంటె వారి కి సంబంధిన అకౌంట్ యొక్క ఆరు నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ ఉండాలి.
- ఒకవేళ పేరెంట్స్ లేకపోతే గార్డియన్ లేదా గ్యారెంటర్ యొక్క గత ఆరు నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ ఉండాలి
- మీరు విదేశాలలో చదవాలి అనుకుంటే పాస్‌పోర్ట్ ఉండాలి.
SBI Education Loan Features In Telugu
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం sbi ఎడ్యుకేషన్ లోన్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- ఫ్రెండ్స్ మనకి sbi బ్యాంకు 7 రకాల ఎడ్యుకేషన్ లోన్స్ ని ప్రోవైడ్ చేస్తుంది అవి:
Student Loan :
ఫ్రెండ్స్ ఈ టైప్ లోన్ లో మనం 20 లక్షల వరకు లోన్ పొందవచ్చు.కోర్సు పూర్తయిన ఒక సంవత్సరం తర్వాత తిరిగి చెల్లింపు అంటే రీ పేమెంట్ ప్రారంభమవుతుంది. తిరిగి చెల్లించడం ప్రారంభించిన తర్వాత 15 సంవత్సరాలలో రుణాన్ని తిరిగి చెల్లించాలి.Scholar Loans :
ఫ్రెండ్స్ ఈ రకమైన లోన్ లో ప్రాసెసింగ్ ఫి ఉండదు. ఇందులో మనం 50 లక్షల వరకు లోన్ పొందవచ్చు. 15 సంవత్సరాలలో రుణాన్ని తిరిగి చెల్లించాలి.- Studies Abroad :
sbi ప్రోవైడ్ చేసే ఎడ్యుకేషన్ లోన్స్ లో ఇది హై అమౌంట్ ని ప్రోవైడ్ చేసే లోన్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇందులో 1.50 కోట్ల ను లోన్ గా పొందవచ్చు. ప్రాసెసింగ్ ఫి 10,000 ఉంటుంది. లోన్ ని 15 సంవత్సరాలలో తిరిగి చెల్లించాలి. Skill Loan :
sbi ప్రోవైడ్ చేసే ఎడ్యుకేషన్ లోన్స్ లో ఇది కూడా ఒకటి. ఇందులో 1,50,000 వరకు లోన్ పొందవచ్చు. మీరు లోన్ 50,000 తీసుకుంటే 3 సంవత్సరాలలో లోన్ రీపేమెంట్ చేయాలి. అదే 1 లక్ష రూ..లోన్ తీసుకుంటే 7 సంవత్సరాలలో లోన్ రీపేమెంట్ చేయాలి.Guidelines of Dr. Ambedkar Central Sector Scheme of Interest Subsidy on
Educational Loans for Overseas Studies for Other Backward Classes (OBCs) and
Economically Backward Classes (EBCs)- PADHO PARDESH – SCHEME OF INTEREST SUBSIDY ON EDUCATIONAL
LOANS FOR OVERSEAS STUDIES FOR THE STUDENTS BELONGING TO THE
MINORITY COMMUNITIES - పైన తెలిపిన 6,7 లోన్స్ కి ఇంకా అప్లై ఆప్షన్ రాలేదు.
- ఫ్రెండ్స్ పైన తెలిపిన వాటిలో మీకు కావలిసిన దానికి లోన్ అప్లై చేసుకోవచ్చు.
- వడ్డీ రేటు 10.90% నుంచి 11.50% మధ్య ఉంటుంది.
SBI Education Loan Apply Process In Telugu
ఈ క్రింద మనం sbi ఎడ్యుకేషన్ లోన్ ని ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్ గా తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా sbi బ్యాంకు మెయిన్ వెబ్సైట్ కి వెళ్ళండి.
- Education Loan పై క్లిక్ చేయండి.
- Education Loans లో మీకు కావాల్సిన లోన్ ని సెలెక్ట్ చేసుకొని Apply పై క్లిక్ చేయండి.
- మీ డిటైల్స్ ని ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి.
- లోన్ అప్లై చేసుకోండి.
- లోన్ వస్తే బ్యాంకు అధికారి మిమ్మల్ని కలుస్తారు.