Table of Contents
ICICI బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ రకాలు, వాటి వివరాలు
ICICI బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ రకాలు:
మన అందరికి icici బ్యాంకు గురించి తెలిసే ఉంటుంది. మన దేశంలో ఉన్నటువంటి బ్యాంక్స్ లో ఇది కూడా ఒక పెద్ద బ్యాంకు. ఈ బ్యాంకు తన కస్టమర్లకి చాలా రకాల అకౌంట్స్ ని ప్రోవైడ్ చేస్తుంది. వాటిలో సేవింగ్స్ అకౌంట్స్ గురించి మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Icici Bank Savings Account Types In Telugu
ఫ్రెండ్స్ ఈ బ్యాంకు 8 రకాల సేవింగ్స్ అకౌంట్స్ ని ప్రోవైడ్ చేస్తుంది. అవి:
- Basic Savings Account
- Instant Savings Account
- Privilege Savings Accounts
- Savings Accounts for women
- Family Savings Accounts
- 3-in-1 Accounts
- Salaried Accounts
- NRE/NRO Accounts
ఇప్పుడు మనం వీటిలో ఒక్కోదాని గురించి వివరంగా తెలుసుకుందాం.
1.Basic Savings Account In Telugu
icici బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లో బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఒకటి. ప్రస్తుతం ఈ బ్యాంకు అకౌంట్స్ లో ఈ అకౌంట్ కే ఎక్కువగా వాడుతున్నారు.ఇందులో ఫీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ అకౌంట్ లో డిపాజిట్ చేస్తే వాటిపై వడ్డీ కూడా పొందవచ్చు.
Basic Savings Account Features In Telugu
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Minimum Balance
ఈ సేవింగ్స్ అకౌంట్ ఉన్న ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్. ఎందుకంటే ఈ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఉండదు. అంటే మినిమం బ్యాలెన్స్ 0.
2.Transaction Limit
ఫ్రెండ్స్ ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్. కాబట్టి మనం 1 లక్ష వరకు ట్రాన్స్ యాక్షన్స్ చేసుకోవచ్చు.
3 ఫ్రీగా పాస్ బుక్ పొందవచ్చు.
4. ఫ్రీగా atm కార్డు అంటే డెబిట్ కార్డు పొందవచ్చు.
5.మనం డిపాజిట్ చేసిన అమౌంట్ పై వడ్డీ పొందవచ్చు.
2.Instant Savings Account In Telugu
ఫ్రెండ్స్ ఈ సేవింగ్స్ అకౌంట్ కూడా బేసిక్ సేవింగ్ అకౌంట్ లాగానే ఉంటుంది. ఈ అకౌంట్ మీరు ఆన్లైన్ చాలా త్వరగా ఓపెన్ చేసుకోవచ్చు. కేవలం ఆధార్ కార్డు ఉంటె చాలు ఈ అకౌంట్ ని చాలా సులభంగా ఓపెన్ చేసుకోవచ్చు.
Instant Savings Account Features In Telugu
ఈ క్రింద మనం ఈ అకౌంట్ లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ లో మనం మినిమం బ్యాలన్స్ ని మైంటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ అకౌంట్ లో మనం మినిమం బ్యాలెన్స్ 10,000 రూ..ఉంచాలి.
2.ATM Withdrawals
మనం ఒక నెలలో 5 atm విత్ డ్రా లను ఫ్రీగా చేసుకోవచ్చు. ఇలాంటి ఆఫర్ ఏ అకౌంట్ లోను లేదు.
3. Insurance cover
ఫ్రెండ్స్ ఇందులో ఇన్సురెన్స్ కూడా పొందవచ్చు. మనకి ఏదైనా ఎయిర్ యాక్సిడెంట్ అయితే 50,000 రూ.. వరకు ఇన్సురెన్స్ ప్రోవైడ్ చేస్తుంది.
4.నెలనెల ఇమెయిల్ స్టేట్మెంట్ ని ఫ్రీ గా పొందవచ్చు.
5.ఫ్రీగా స్మార్ట్ షాపర్ సిల్వర్ డెబిట్ కార్డ్ ని పొందవచ్చు.
3.Privilege Savings Accounts In Telugu
icici బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లో ప్రివిలేజ్ సేవింగ్స్ అకౌంట్ ఒకటి. ఈ అకౌంట్ కూడా ఒక బెస్ట్ అకౌంట్. ఇప్పుడు మనం ఈ అకౌంట్ లో ఏ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
Privilege Savings Accounts Features In Telugu
క్రింద మనం ఈ అకౌంట్ లో ఏ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ లో మనం 50,000 రూ.. మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. ఇప్పుడు ఉన్నటువంటి సేవింగ్స్ అకౌంట్స్ లో ఇది చాలా తక్కువ అమౌంట్.
2.Transaction Limit
ATM లలో 75,000 విత్ డ్రా చేసుకోవచ్చు. దేశీయ, విదేశీ రెండింటిలో 1,25,000 రూ.. వరకు షాపింగ్ లో ఖర్చు పెట్టుకోవచ్చు.
3. ఫ్రీగా డెబిట్ కార్డు పొందవచ్చు.
4. పాస్ బుక్ కూడా ఫ్రీగా పొందవచ్చు.
4. Savings Accounts for women In Telugu
ఫ్రెండ్స్ ఈ సేవింగ్స్ అకౌంట్ ని ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేయండం జరిగింది. మహిళలో స్వయం సమృద్ధి పై అవగాహన కల్పించడమే ఈ అకౌంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. క్రింద ఈ సేవింగ్స్ అకౌంట్ గురించి ఇంకొంచం వివరంగా తెలుసుకుందాం.
Savings Accounts for women Features In Telugu
ఈ క్రింద మనం ఈ అకౌంట్ లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ లో 10,000రూ..మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. ఈ అకౌంట్ ఉన్న ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్.
2.Transaction Limit
ఈ సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నువంటి ఫీచర్స్ లో దీనిని బెస్ట్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో ఎక్కడైనా ఈ బ్యాంకు atm లో అమౌంట్ ని విత్ డ్రా చేసుకోవచ్చు. అమౌంట్ కి లిమిట్ అంటూ ఏమి ఉండదు. ఎంతైనా డ్రా చేసుకోవచ్చు.
3.మనం చేసిన డిపాజిట్ పై 4% వడ్డీ ని కూడా అందిస్తుంది.
4.మల్టి సిటి చెక్ బుక్ ని కూడా ఫ్రీగా అందిస్తుంది.
5.మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ని కూడా చేసుకోవచ్చు.
6. ఫ్రీగా పాస్ బుక్ ని కూడా ప్రోవైడ్ చేస్తుంది.
5.Family Savings Accounts In Telugu
icici బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్ లో ఫ్యామిలీ సేవింగ్స్ అకౌంట్ ఒకటి. ఈ అకౌంట్ ఫ్యామిలి లోని మెంబెర్స్ అందరికి ఉన్నటువంటి అకౌంట్స్ అన్నింటికి కలిపి ఒకే సేవింగ్స్ అకౌంట్ ని ప్రోవైడ్ చేస్తుంది. ఇలా అకౌంట్ జారి చేయకపోయినా మీ ఫ్యామిలీ మొత్తానికి ఒకే id ఇస్తుంది. ఇందులో ఇద్దరూ లేదా ఆరు మందికి కలిపి అకౌంట్ క్రియేట్ చేస్తారు.
Family Savings Accounts Features In Telugu
ఈ క్రింద మనం ఫ్యామిలీ సేవింగ్స్ అకౌంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ ఈ సేవింగ్స్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ ఇంత ఉంచాలి అని ఏమి లేదు. మీ ఫ్యామిలీ స్థాయిని బట్టి నెలనెలా కొంచం అమౌంట్ ని అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ లాగా వేసుకోవచ్చు.
2.Transaction Limit
ఈ అకౌంట్ నుంచి రోజు 1 లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. విత్ డ్రా చేసుకోకుండా ఏవైనా కొనుగోలు చేస్తే 1,50,000 రూ.. వరకు స్పెండ్ చేసుకోవచ్చు.
3. ఫ్యామిలి బ్యాంకింగ్ అవసరాలన్నింటిని ఒకే అకౌంట్ ద్వారా చేసుకోవచ్చు.
4. డెబిట్ కార్డు ని ఫ్రీగా పొందవచ్చు
6.3-in-1 Account In Telugu
ఫ్రెండ్స్ icici బ్యాంకు సేవింగ్స్ అస్కోంట్ లో 3 ఇన్ 1 అకౌంట్ కూడా ఒకటి. ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలని అనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సేవింగ్స్ అకౌంట్‌తోనే డీమ్యాట్ సేవలను పొందవచ్చు. ఈ అకౌంట్ ద్వారా ఈజీగా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
3-in-1 Account Features In Telugu
ఈ క్రింద మనం ఈ సేవింగ్స్ అకౌంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఒకో ప్రాంతం లో ఒకోలా ఉంటుంది.
- సెమి అర్బన్ ప్రాంతంలో 5000 మినిమం బ్యాలెన్స్ ఉంచాలి.
- రూరల్ ప్రాంతంలో 2000 మినిమం బ్యాలెన్స్ ఉంచాలి.
- గ్రామీణ ప్రాంతాలలో 1000 మినిమం బ్యాలెన్స్ ఉంచాలి.
2 . మనం ఈ అకౌంట్ ని ఓపెన్ చేసుకొని వేరేవారికి రిఫర్ చేస్తే 750 రూ రెఫరల్ అమౌంట్ వస్తుంది.
3 సేవింగ్స్ అకౌంట్ గా ఓపెన్ చేసుకొని ఈక్విటి మార్కెట్లలలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
4. మనం ఈ అకౌంట్ ఓపెన్ చేసిన కొన్ని గంటలలోనే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు.
7.Salaried Accounts In Telugu
icici బ్యాంకు ప్రోవైడ్ చేసే సేవింగ్స్ అకౌంట్స్ లో స్యాలరిడ్ అకౌంట్ ఒకటి. ఈ అకౌంట్ ని స్యాలరి పర్సన్స్ ఎక్కువగా use చేస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలి అంటే స్యాలరి పర్సన్స్ సేవింగ్స్ చేసుకోవడానికి ఈ అకౌంట్ ఉపయోగపడుతుంది.
ఈ అకౌంట్ ని సంస్థ యొక్క యజమాని ఓపెన్ చేయాలి అంటే కనీసం 20 మంది ఉద్యోగులను కలిగి ఉండాలి.
Salaried Accounts Features In Telugu
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ అకౌంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ ఉన్న ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మినిమం బ్యాలెన్స్ 0.
2.Transaction Limit
ఈ సేవింగ్స్ అకౌంట్ లో రోజుకు 25,000 రూ.. వరకు ట్రాన్స్ యాక్షన్స్ చేసుకోవచ్చు.
3. ఈ అకౌంట్ ద్వారా లోన్స్, క్రెడిట్ కార్డు ఆఫర్స్ కూడా పొందవచ్చు.
4. బ్రాంచ్ లలో ఫ్రీగా డిపాజిట్ చేసుకోవచ్చు.
5. ఈ అకౌంట్ ఉంటె లోన్స్ చాలా సులభంగా పొందవచ్చు.
8. NRE/NRO Accounts In Telugu
ఫ్రెండ్స్ nri లకు బ్యాంకింగ్ అవసరాలు తీర్చడం కోసం ఈ అకౌంట్ ని ఏర్పాటు చేశారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే nri లి మన దేశంలో రూపాయిలలో డిపాజిట్లను చేసుకోవడానికి ఈ సేవింగ్స్ అకౌంట్ ఉపయోగపడుతుంది.
nre అకౌంట్ లో విదేశీ కరెన్సీని డిపాజిట్ చేసుకొని భారతీయ కరెన్సీలో విత్ డ్రా చేసుకోవచ్చు. అదే nro అకౌంట్ లో విదేశీ మరియు భారతీయ కరెన్సీలో డిపాజిట్ చేయవచ్చు. భారతీయ కరెన్సీలో విత్ డ్రా చేసుకోవచ్చు.
NRE/NRO Accounts Features In Telugu
ఈ క్రింద ఈ అకౌంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ లో మనం 10,000 రూ.. మినిమం బ్యాలెన్స్ గా ఉంచాలి. మిగతా అకౌంట్స్ పోలిస్తే ఇది కొంచం ఎక్కువే. అయినా ఆఫర్స్ ఎక్కువగా ఉంటాయి.
2.Transaction Limit
ఫ్రెండ్స్ ట్రాన్స్ యాక్షన్స్ లిమిట్ ఒకో డెబిట్ కార్డు కి ఒకోలాగా ఉంటుంది. అవి:
- NRO డెబిట్ కార్డు లో 50,000 రూ.. ATM లలో విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఏవైనా కొనుగోలు చేస్తే 1 లక్ష వరకు ట్రాన్స్ యాక్షన్ చేసుకోవచ్చు.
- సీనియర్ సిటిజన్ గోల్డ్ డెబిట్ కార్డు లో 75,000 రూ.. ATM లలో విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఏవైనా కొనుగోలు చేస్తే 1.25,000 వరకు ట్రాన్స్ యాక్షన్ చేసుకోవచ్చు.
- సీనియర్ సిటిజన్ సిల్వర్ డెబిట్ కార్డు లో 50,000 రూ.. ATM లలో విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఏవైనా కొనుగోలు చేస్తే 1 లక్ష వరకు ట్రాన్స్ యాక్షన్ చేసుకోవచ్చు.
- యాంగ్ స్టార్ డెబిట్ కార్డు లో 5000 రూ.. ATM లలో విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఏవైనా కొనుగోలు చేస్తే 5000 రకు ట్రాన్స్ యాక్షన్ చేసుకోవచ్చు.
3.మనం ఈ అకౌంట్ ని ఓపెన్ చేయడానికి అప్లికేషన్ ఇస్తే బ్యాంకు రెండు రోజులలోనే అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకింగ్ సేవలు అందిస్తుంది.
4. ఈ అకౌంట్ లో 4 రకాల డెబిట్ కార్డు లను పొందవచ్చు.