ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్లో శుక్రవారం తొలి 20 సిరీస్ ప్రారంభం కానున్నది. ఈ మ్యాచ్ సరిగ్గా నేడు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. చాలా గ్యాప్ తర్వాత న్యూజిలాండ్ గడ్డపై భారత్ మూడు ఫార్మాట్లలో సిరీస్ లు ఆడనున్నది.
చాలా రోజుల పాటు సాగే ఈ టూర్లో భాగంగా న్యూజిలాండ్ భారత్ జట్ల మధ్య 5 టి20 లు, మూడు వన్డేలు , రెండు టెస్ట్ మ్యాచ్లు జరగబోతున్నాయి. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ విశేషం ఏమిటంటే ఈ పోటీలో భారత్ గెలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్మెన్ dean jones జాతకం చెప్పాడు!
ఈ మ్యాచ్లో కివీస్ జట్టును కోహ్లీ సైన్యం చిత్తుగా ఓడించ బోతున్నదని కూడా చెప్పాడు. ఈ విషయాన్ని జోన్స్ ట్విట్టర్లో తెలిపాడు ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్వీట్ తో టీమిండియా అభిమానులు అంతా సంతోషంతో గంతులు వేస్తున్నారు.
జోన్స్ తన ట్విట్టర్లో ఇలా కూడా చెప్పాడు. ఈ తొలి టీ-20 మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు ఓడిన తర్వాత స్కాట్ స్టైరిస్, మైక్ హెసన్ లు ఎలాంటి సాకులు చెబుతారా అని నేను ఎదురు చూస్తున్నాను.
ఈ సంవత్సరమే అతి పెద్ద టోర్నీ అయిన టి20 వరల్డ్ కప్ ఉన్నందువల్ల ప్రస్తుతం ఈ మ్యాచ్ చాలా ప్రిస్టేజి ఇష్యూ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ కు గురయింది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్ను 0-3 తో కోల్పోయి వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నది.
అంతే గాక ఈ ఓటమి పరిణామంతో కివీస్ కెప్టెన్ విలియంసన్ కెప్టెన్సీపైతీవ్ర విమర్శలకు గురయ్యాడు. ఇదే సువర్ణ అవకాశంగా భావిస్తున్నారు ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.ఇతను కివీస్ పై విజయం గురించి పూర్తి విశ్వాసంతో ఉన్నాడు.