పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ మిడ్నైట్ ఎటాక్

0

ప్రపంచమంతా కరోనా వైరస్ కోరలకు చిక్కి భయపడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఈ భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి నుండి ఎలా బయటపడాలో అని ఆలోచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని ఒక అవకాశంగా భావించి దుష్ట పాకిస్తాన్ తన నీచమైన ఆలోచనలకు పదును పెట్టింది. పాకిస్తాన్ నుంచి పెద్ద సంఖ్యలో కరుడుగట్టిన ఉగ్రవాదులు భారత సరిహద్దు లోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారని మరియు వారి దగ్గర ఊహించని రీతిలో యుద్ధానికి అవసరమైన మందుగుండు సామగ్రి ఉందన్న సమాచారం రావడంతో ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయింది.

మన దగ్గర సిద్ధంగా ఉన్న ఆర్టిలరీ గన్స్,105 mm ఫీల్డ్ గన్స్,155 బోఫోర్స్ గన్స్ తో ఇండియన్ ఆర్మీ , పాక్ ఆక్రమించిన కాశ్మీరులో రెడీగా ఉన్న పాకిస్థాన్ లాంచ్ పాడ్ లపై మెరుపు దాడి చేసి, వారికి సంబంధించిన లాంచ్ పాడ్ లను నాశనం చేసింది. పాకిస్థాన్ కు చెందిన ఆయుధాల గోడౌన్ లను కూడా ధ్వంసం చేశారు.

దాడి కి ముందు ఏం జరిగింది:-
కరోనా వైరస్ ఎఫెక్ట్ ను సాకు గా తీసుకుని పాకిస్థాన్ గత నెలలో దాదాపు 411 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించి కాల్పులు జరిపింది. దీనికి కొన్ని రోజుల క్రితం దట్టమైన మంచు ఆవరించిన కొండల్లో ఉగ్రవాదులు, భారత సరిహద్దు లోకి ప్రవేశిస్తున్న సందర్భం లో ఇండియన్ ఆర్మీ వారితో భీకరమైన పోరాటం చేసి 5గురు ఉగ్రవాదులను హతమార్చింది.