ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ యొక్క విశేషాలు !

0
intinti gruhalakshmi 19 may 2022

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టుడే ఎపిసోడ్ | Intinti Gruha Lakshmi Serial Today Episode 19 May 2022

సీన్ లోకి ఎంటర్ అయితే..

Intinti gruhalakshmi 19 may 2022 :నందు కి ఉద్యోగం పోయిన విషయం గురించి లాస్య కి చెప్తే పక్కనే ఉన్నా లక్కీ చాలా సంతోష పడతాడు, నందుకు చాలా కోపం వచ్చి షటప్ అని అంటాడు. అప్పుడు లాస్య ఇప్పుడు లక్కీ ఏం చేశాడు ఎందుకు వాడి మీద అరుస్తున్నావ్ అని అంటుంది, సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఆ పనికి మాలిన జాబ్లో జాయిన్ అయ్యావ్ అప్పుడు నీకు తులసి సపోర్ట్ చేసింది అని అంటుంది.

అప్పుడు లక్కీ ఎవరికో అన్యాయం చేసి ఉంటారు అందుకే మీకు ఇలా అయ్యింది అని అంటాడు. ఇంతలో తనకు అప్పిచ్చిన తన ఫ్రెండ్ వస్తాడు నాకు ఇప్పుడు అర్జెంటుగా నేను ఇచ్చిన డబ్బులు నాకు వెనక్కి ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు నందు నా అకౌంట్లో 20000 ఉన్నాయి అది వాడి అప్పుడు సరిపోతుంది.

అది ఇచ్చేస్తే నా అకౌంట్ లో జీరో నేను జీరో అని అంటాడు. అప్పుడు లాస్య ఇప్పుడైనా మంచి సాఫ్ట్ వేర్ జాబ్ చూసుకొని జాబ్ లో జాయిన్ అవ్వు అని చెప్పి వెళ్లిపోతుంది. అప్పుడు లక్కీ మీరు తులసి ఆంటీ ని ఏదిపించారు కదా మీకు బాగా అయింది మీరు బ్యాడ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు.

సీన్ కట్ చేస్తే..

పిల్లలు ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు ఆ బాలు వెళ్లి తులసి కి తగులుతుంది. తులసి కూడా వాళ్లతో పాటు ఫుట్బాల్ లో జాయిన్ అవుతుంది. అది చూసి వాళ్ళ మామయ్య చాలా సంతోష పడుతూ ఉంటాడు. తులసి వాళ్ళ మామయ్యని చూసి భయపడుతుంది కానీ వాళ్ల మామయ్య పర్లేదు నువ్వు ఆడమ్మా అని చెప్తాడు. దివ్య వాళ్ళ నానమ్మ యూట్యూబ్ లో వంట చేస్తూ ఉంటారు.

అది వాళ్ళ తాతయ్య చూసి ఆశ్చర్యపోతాడు. ఇంతలో తులసి లోపలికి వస్తుంది. మన యూట్యూబ్ ఛానల్ కి  one million subscribers గ్యారెంటీ నానమ్మ నువ్వు స్టార్ట్ చెయ్ అని దివ్య అంతుంది. ఇంతలో తులసి వచ్చి అయ్యో అత్తయ్య మీరెందుకు కష్టపడుతున్నారు మీకేం కావాలో నేను చేసి పెడతాను కదా అని అంటుంది.

అప్పుడు వాళ్ళ అత్తయ్య అయ్యో ఇది యూట్యూబ్ ఛానల్ కోసం అమ్మ నేను చేస్తున్నాను అని అంటుంది. అప్పుడు తులసి దివ్య ని పక్కకు తీసుకెళ్లి ఇలా చేయడం వల్ల బయట జనాలు నన్ను చూస్తారా అని అడిగితే ఎందుకు అని అంటుంది. అప్పుడు దివ్య ఈ కాలంలో ఇంటర్నెట్ ని మించిన గురువు ఎవరు లేరు మొమ్ అని అంటుంది. సరే అయితే నీ మొబైల్ నాకు ఇవ్వు ఇప్పుడు నేను సంగీతం నేర్చుకుంటాను అని చెప్పి దివ్య మొబైల్ తీసుకుని తులసి వెళుతుంది.

సీన్ కట్ చేస్తే..

తులసి మొబైల్ లో చూసి సంగీతం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ అత్తయ్య మామయ్య సంతోష పడుతూ ఉంటారు. నందు ఇంటర్వ్యూ కి వెళ్లి వస్తాడు. లాస్య తో నాకు కొంచెం తలనొప్పిగా ఉంది కాఫీ ఇస్తావా అని అడిగితే ఇంట్లో కాఫీ పొడి లేదు పాలు విరిగిపోయాయి అని చెప్తుంది, నందు కోపంతో అక్కడినుండి వెళుతుండగా తొందరగా జాబ్ తెచ్చుకో నందు కట్టాల్సిన ఈమ్ఐ లు చాలా ఉన్నాయి అని చెప్తుంది లాస్య.

సీన్ కట్ చేస్తే..

ప్రేమ్ తన కంపెనీ కి వెళ్తాడు వాళ్ళ మేనేజర్ చాలా వెటకారంగా ప్రేమ్ ని మాట్లాడుతాడు. ప్లీజ్ సర్ నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను నా నెల జీతం నాకు ఇప్పించండి అని అడుగుతాడు అప్పుడు వాళ్ళ మేనేజర్ అసలు నీకు ఇక్కడ ఉద్యోగమే లేదు నీకు జీతం ఎలా ఇస్తారు ఎవరు ఇస్తారు అని అంటాడు. ప్లీజ్ సర్ నేను చేసిన చిన్న తప్పు కి నాకు ఇంత పెద్ద శిక్ష వేయకండి అని బతిమిలాడతాడు. వాళ్ల మేనేజర్ మీద చాలా కోపంతో తన కాలర్ని పట్టుకొని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ మేనేజర్ సెక్యూరిటీని పిలిచి వాళ్ళని బయటికి పంపించండి అని చెప్తాడు.

సీన్ కట్ చేస్తే..

తులసి ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది ఇంట్లో సరుకులు అయిపోయి ఉంటాయి ఇంట్లో డబ్బులు కూడా ఉండవు తీసుకురావడానికి. తన దగ్గర కేవలం ₹500 మాత్రమే ఉంటాయి. దానితోనే ఈ కొద్ది కాలం గడుపుతాను అని చెప్పి సరుకులు తీసుకురావడానికి అంగడికి వస్తుంది.

ప్రేమ్ చాలా బాధపడుతూ రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాటను నెరవేర్చలేక పోతున్నాను అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మ అంగడి దగ్గర కనిపిస్తుంది. తను తీసుకున్న సరుకులు చాలా డబ్బు అయి ఉంటుంది కానీ తన దగ్గర కేవలం ₹500 మాత్రమే ఉండటంతో ఇందులో కొన్ని సరుకులు నాకు అవసరం లేదు అని చెప్పి వెనక్కి ఇచ్చేస్తుంది.

అప్పుడు అంగడి అతను డబ్బులు లేకపోతే కొనడానికి ఎందుకు రావాలి అని తులసి మీద అరుస్తాడు. అక్కడే ఉన్న ప్రేమ్ అక్కడ జరిగినదంతా చూస్తాడు ప్రేమకి చాలా కోపం వచ్చి అతని దగ్గర గొడవ పెట్టుకుంటాడు. అప్పుడు తులసి గొడవ పెట్టుకోడానికి నువ్వు ఎవరు అని ప్రేమ్ మీద అరుస్తుంది.

 ప్రోమో: లాస్య వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నువ్వు మా  కంపెనీల్లో ఇన్వెస్ట్ చెయ్యి మా బిజినెస్ లో జాయిన్ అవ్వు అని అడుగుతుంది. తరువాత లాస్య ఫ్రెండ్ తులసి ని కలుస్తుంది. లాస్య ఫ్రెండ్ తనకి కాల్ చేసి సారీ మా ఆయన ఒప్పుకోలేదు రిజెక్ట్ చేశారు అని సమాధానం ఇస్తుంది. లాస్య తులసి దగ్గరికి వెళ్లి గొడవ పెట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి : కార్తిక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ యొక్క విశేషాలు !