ఇంటింటి గృహలక్ష్మి టుడే 18-05-2022 ఎపిసోడ్ !

0
intinti gruhalakshmi serial today episode 18 may

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టుడే ఎపిసోడ్ | Intinti gruhalakshmi today episode 18 May 2022

సీన్ లోకి ఎంటర్ అయితే..

దివ్య తులసి కలసి వాళ్ళ నానమ్మ తాతయ్య ని చెస్ గేమ్ లో ఓడించేస్తారు. నువ్వు గ్రేట్ అమ్మ అంటూ దివ్య వాళ్ళ అమ్మ ని పొగుడుతూ ఉంటుంది దివ్య చాలా సంతోషపడుతుంది. నువ్వు చాలా మారిపోయావు తులసి అంటూ వాళ్ళ మామయ్య చెప్తూ ఉంటాడు.

అవును మామయ్య నాకెందుకో ఇప్పుడు నేను కొత్త జీవితాన్ని మొదలు పెట్టాను ఏ ఒక్క క్షణం కూడా వృధా చెయ్యను అని చెప్తుంది తులసి. మీకు చెప్పడం మర్చిపోయాను నేను సంగీతం టీచర్గా చేయబోతున్నాను అత్తయ్య అని వాళ్ళతో చెప్తుంది. పార్క్ లో జరిగిన విషయం అంతా వాళ్ళ అత్త మామయ్య దివ్య తో చెప్తుంది. వాళ్లు చాలా సంతోష పడతారు. స్వీట్స్ తింటూ సంబరపడుతూ ఉంటారు.

సీన్ కట్ చేస్తే..

శృతి ప్రేమ్ మీద అలిగి ఉంటుంది. ప్రేమ్ ఏం మాట్లాడినా సమాధానం ఇవ్వదు. అప్పుడు ప్రేమ్ శృతి దగ్గరకు వచ్చి సారీ శృతి ఏదో కోపంలో అలా చేశాను అని చెప్తాడు. ఓనర్ వాళ్ళ మీద ఎందుకు అరిచారు అని అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఓనర్ వాళ్ళు వస్తారు. వెంటనే ఇల్లు కాలీ చేయండి అని చెప్తారు.

వెళ్లి సామాన్లు బయటపడేయండి అని అంటారు. నన్ను క్షమించండి అని ఓనర్ తో క్షమాపణలు అడుగుతాడు ప్రేమ్. శృతి వల్ల ఓనర్ గారితో వెళ్లి క్షమించండి అని అడుగుతుంది. రేపటిలోగా అద్దె కట్టాలి లేదంటే ఇంటికి తాళం వేస్తాను అని చెప్పి ఓనర్ వాళ్ళు వెళ్ళిపోతారు. శృతి తో ప్రేమ్ నేను తీసుకొచ్చి అద్దె కట్టేస్తాను లే నువ్వేమీ బాధ పడకు అని చెప్తాడు ప్రేమ్.

సీన్ కట్ చేస్తే..

నందు వాళ్ళ ఫ్రెండ్స్ గొడవ పడుతూ ఉంటారు. నందు వచ్చి గొడవ ని ఆపేస్తాడు, తను పనిచేస్తున్న కెఫ్ తన ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యది అక్కడ వాళ్ళ అన్నయ్య వచ్చి నా స్థలం నాకు ఇచ్చే అని అడుగాడు గొడవ పడుతూ ఉంటాడు జరిగిన విషయం అంతా తన ఫ్రెండ్ నందు తో చెప్తాడు,నువ్ ఇంకో ఉద్యోగం చూసుకో నందు అని అంటాడు.

సీన్ కట్ చేస్తే..

తులసి సంగీతం చెప్పడానికి పిల్లల వాళ్ళ ఇంటికి వస్తుంది. పిల్లలకు సంగీతం నేర్పిస్తూ ఉంటుంది. ఆ పిల్ల వాళ్ళ అమ్మ లాస్య కి తన ఫ్రెండ్ అయి ఉంటుంది. అక్కడికి లాస్య వస్తుంది తులసి పాడే సంగీతాన్ని వింటూ ఉంటుంది.

వావ్ ఎవరిది ఆ గొంతు చాలా బాగుంది అని అంటుంది తన ఫ్రెండ్ లాస్య అని లోపలికి తీసుకెళుతుంది, అక్కడ లాస్య తులసి ని చూసి ఆశ్చర్యపోతుంది. నీ గొంతు కి తను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయింది అని చెప్తుంది.

అప్పుడు లాస్య తన ఫ్రెండ్ లాస్య తో నీకు ఇంతకు ముందే పరిచయం ఉందా అని అడుగుతుంది లాస్య తన ఫ్రెండ్ తో అవును తెలుసు ఒక ఫ్రెండ్ వలన తిను నాకు చాలా దగ్గరగా తెలుసు అని చెప్తుంది.అయితే మీరు మాట్లాడుతూ ఉండండి నేను మీకు కాఫీ తీసుకుని వస్తాను అని చెప్తే పిల్లల్ని తీసుకుని లోపలికి వెళుతుంది.

లాస్య చాలా వెటకారంగా ఇంటింటికీ తిరుగుతూ సంగీతం చెబుతున్నావా అని అంటుంది. బతుకు తెరువు కోసం ఇంటింటికి తిరుగుతున్నావా అని హేళన చేస్తుంది. ఇప్పటికైనా పొగరు తగ్గిందా లేదంటే అలాగే ఉందా అని అడుగుతుంది లాస్య. అప్పుడు తులసి నాకు ఇది ఆత్మాభిమానం నీ లాగా తెలియని వాళ్ళు దాన్ని అహంకారంగా భావిస్తూ ఉంటారు అని సమాధానం ఇస్తుంది.

తులసి ఉద్యోగం లేని రోజు నువ్వు మీ ఆయన ఏం చేశారు ఒకసారి గుర్తు తెచ్చుకో అని చెప్తుంది లాస్య తో, నాకు ఎవరి జోలికి వెళ్లాలని లేదు నువ్వే నా జోలికి వస్తున్నావ్ అని చెప్తుంది. సంజన నా ఫ్రెండ్ నేను వద్దు అంటే నేను ఇప్పుడే సంగీతం టీచర్గా ఉద్యోగంలో నుంచి తీసేస్తుంది, కానీ నేను అలా చెప్పను అని చెప్తుంది లాస్య.

అప్పుడు తులసి నా దగ్గర విద్య ఉంది నాకు ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా సంగీతం టీచర్ గా అవకాశం వస్తుంది కానీ నీ మాట ఇక్కడ తప్పితే ఇంకెక్కడ చెల్లదు అని సమాధానం ఇస్తుంది, వేడి వేడిగా కాఫీ వస్తుంది తాగి రిలాక్స్ అవ్వు అని చెప్పి తులసి అక్కడి నుండి వెళ్ళి పోతుంది.

సీన్ కట్ చేస్తే..

లాస్య లక్కీ కి అన్నం తినిపిస్తూ ఉంటుంది, మమ్మీ నువ్వు చెప్పిన మాట వినాలి కదా అలాగే నేను చెప్పిన మాట కూడా నువ్వు వింటావా అని అడుగుతాడు లక్కీ, నన్ను హాస్టల్ కి పంపించద్ధు మమ్మీ నేను ఇక్కడే నీ దగ్గరే ఉంటాను, నేను నిన్ను అస్సలు ఏడిపించను, నీకు హెల్ప్ చేస్తాను మమ్మీ అని అంటాడు. నేను నీతోనే ఉంటాను మమ్మీ అని అడుగుతాడు.

ఇంతలో నందు ఇంటికి వస్తాడు, అప్పుడు లాస్య ఏంటి ఇంత తొందరగా ఇంటికి వచ్చేసావు అని అడుగుతుంది. అప్పుడు తులసి తన ఫ్రెండ్ ఇంట్లో సంగీతం టీచర్గా జాయిన్ అయ్యింది అనే విషయాన్ని నందుతో చెప్తుంది. అప్పుడు నందు లాస్య నా జాబ్ కూడా పోయింది అని చెప్తాడు. బ్రదర్స్ మధ్య మిస్ కమ్యూనికేట్ వచ్చి కేఫ్ ని మూసేశారు అని చెప్తాడు.

లక్కీ చప్పట్లు కొడుతూ నవ్వుతాడు. ఇప్పుడు ఎలాగో అంకుల్ ఫ్రీ ఏ కదా నన్ను ఇంట్లో ఉండి అతడే చూసుకుంటాడు నేనింకా హాస్టల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు అని లక్కీ నవ్వుతూ ఉంటాడు. షటప్ నోరు ముయి లక్కీ అని నందు లక్కీ మీద అరుస్తాడు.

రేపటి ఎపిసోడ్ ప్రోమో: తులసి సరుకులు తీసుకోవడానికి అంగడి కి వెళ్తుంది, అక్కడ డబ్బులు ఎక్కువ అవుతాయి కొన్ని సరుకులు వెనక్కి ఇచ్చేస్తుంది తనమీద అరుస్తాడు అంగడి ఓనర్, అప్పుడు ప్రేమ్ వచ్చి గొడవ పడతాడు నీకు ఏం సంబంధం అని అంటుంది తులసి ప్రేమ్ తో..